S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/25/2017 - 07:41

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ)ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర శాఖల మాదిరి పెన్షన్, గ్రాట్యుటీలను వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, ఈ ఉత్తర్వులు అమలుకాని దీనస్థితి కొనసాగుతోంది.

05/24/2017 - 07:41

భారత సరిహద్దుల్లో నానాటికీ పేట్రేగిపోతున్న పాకిస్తాన్ సైనికుల ఆటవిక చర్యలు జంతుబలులను తలపిస్తున్నాయి. మన సైనికులను హతమార్చడమే గాక వారి శరీరాలను ఛిద్రం చేయడం పాక్ సైనికుల పైశాచికత్వానికి పరాకాష్ఠ. గతంలోనూ మన సైనికులను చంపి తలలు నరికి తీసుకుపోయిన ఘటనలు జరిగినా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడంలో భారత్ వెనుకంజ వేస్తోంది.

05/22/2017 - 07:39

మానవ సమాజాన్ని ఓ వైపు ఉగ్రవాద, అణుబాంబు భయం, మరో వైపు ‘గ్లోబల్ వార్మింగ్’ (్భమి వేడెక్కకడం) తీవ్రంగా భయపెడుతున్నాయి. పారిశ్రామిక దేశాలు ఇష్టమొచ్చినట్టుగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుండడంతో భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని చెబుతున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోకపోవడం శోచనీయం. మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.

05/20/2017 - 01:02

భారత మాజీ నౌకాదళాధికారి కులభూషణ్ జాధవ్‌ను అన్యాయంగా దోషి అని తేల్చి ఉరిశిక్ష ప్రకటించిన పాకిస్తాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో భంగపాటు కలగడం భారత దౌత్య విజయం. తద్వారా భారత్ న్యాయ దృష్టికి, నియమం తప్పని నడతకు గౌరవం పెరగడమే కాక, పాకిస్తాన్ కుటిల నీతి నగ్న స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టినట్లయింది.

05/19/2017 - 07:49

పరిశుభ్రమైన నీటిని తాగేందుకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నందున వాటర్ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వేసవి కాలం కల్తీ వాటర్ కంపెనీలకు వరంగాను, ప్రజలకు శాపంగానూ మారింది. మినరల్ వాటర్ ప్లాంట్ యూనిట్లను ప్రారంభించాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, గ్రామాల్లో సైతం కొంతమంది ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు.

05/17/2017 - 23:44

తాము వేసిన పంటలపై పెట్టుబడులు సైతం దక్కడం లేదని లబోదిబోమంటూ అన్నదాతలు నిరసనకు దిగితే, వారి చేతులకు సంకెళ్ళు వేసి నడిపిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్ళడం సిగ్గుమాలిన పని. పోలీసులలో కొందరు తమ అధికార్లను మెప్పించడానికో లేక తాత్కాలికంగా కలిగిన ఉత్సాహాన్ని ప్రదర్శించడానికో అలా చేయడం తప్పే.

05/17/2017 - 01:14

ఘనమైన ఆదర్శ ఉమ్మడి ప్రయోజనాల స్వప్నాల్ని ఆవిష్కరిస్తూ చైనా తలపెట్టిన ‘ఒకే బెల్ట్, ఒకే రోడ్డు’ సందర్భంగా జరిగిన వాణిజ్య సదస్సుని భారత్ బహిష్కరించడం సరైన చర్యే. ఆ సదస్సులో యూరప్ దేశాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరచడం సమంజసమే. ఏ దేశపు వాదన ఏమైనప్పటికీ, భారత తన వాదన నుండి పక్కకు జరగకపోవడం ఒక సార్వభౌమిక దేశం చెయ్యాల్సిన విశ్వాస ప్రదర్శనే.

05/16/2017 - 00:55

‘ఈ దేశాన్ని పాలించిన మొఘల్ పాలకులంతా దురాక్రమణదారులే’ అని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనడం ఆయన గుండెలోంచి వచ్చిన కఠిన వాస్తవం! ‘ఈ విషయాన్ని ఆమోదిస్తేనే దేశంలోని సమస్యలన్నీ సమసిపోతాయి. మనకి ఆదర్శ దేశ నాయకులు మహారాణా ప్రతాప్, గురు గోవిందసింగ్, ఛత్రపతి శివాజీలు’ అని ఆయన అన్నది కూడా వాస్తవమే.

05/15/2017 - 00:22

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఎనిమిది లక్షల మంది నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వున్నట్టు తెలుస్తోంది. కొందరు ఏ పనీ లేక రోడ్లమీద తిరుగుతూ కాలం వెళ్లబుచ్చుతుండగా, ఇంకొందరు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. ఎవరి వ్యక్తిగత అభిరుచి, శ్రద్ధను అనుసరించి ఆయా రంగాలలోకి వెళ్లి గొప్ప వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలి. ఒకేదారిలో అందరూ చొరబడడం, తర్వాత ప్రభుత్వాలను నిందించడం సరికాదు.

05/13/2017 - 01:55

ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్‌లు, వాణిజ్య లావాదేవీలకు ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయడంపై విమర్శలు, అనుమానాలు అర్థరహితం. ‘ఆధార్’ అనుసంధానం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న భయాలు అనవసరం. గతంలో టెలీకమ్యూనికేషన్ల శాఖ ప్రచురించిన టెలిఫోన్ డైరెక్టరీల్లో వినియోగదారుల ఫోన్ నెంబర్లు, వారి పేర్లు, చిరునామాలు ఉండేవి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు దేనికి?

Pages