S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/22/2017 - 21:51

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరపున న్యాయమూర్తి దల్వీర్ భండారీ తన ప్రత్యర్థి బ్రిటిష్ న్యాయమూర్తిపై గెలుపొంది తిరిగి ఎన్నిక కావడం చారిత్రాత్మకం. 15మంది న్యాయమూర్తుల పానెల్‌కి మూడేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారత్ పోటీ పడటమేకాకుండా, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చింది.

11/22/2017 - 21:50

హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం, కార్పొరేషన్ వరంగల్. అయితే అందుకుతగ్గట్లు నగరంలో పరిస్థితి లేదు. మురికి కాల్వల నిర్వహణ ఏ మాత్రం బాగోలేదు. రహదార్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ గోతు లు దర్శనమిస్తున్నాయ. నిజానికి వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ‘హృదయ్’, ‘స్మార్ట్‌సిటీ’గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసింది.

11/21/2017 - 23:27

తెలుగుగడ్డపై పుట్టి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ప్రముఖులను సముచిత రీతిన గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉంది. తెలుగువారి పండుగలు, ప్రముఖులపై పోస్టల్ శాఖ స్టాంపులను విడుదల చేయాలి. డాక్టర్ సి.నారాయణరెడ్డి, బతుకమ్మ పండుగ, వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి పోస్టల్ స్టాంపులు వస్తే గౌరవంగా ఉంటుంది.

11/21/2017 - 00:53

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ బిజెపి వారికి ఆరాధ్య దేముడయ్యాడు. పటేల్ జయంత్యుత్సవాలను కాంగ్రెస్ పార్టీవారు పట్టించుకునేవారు కాదు. అది విచారకరం. అలాగే ఇందిరాగాంధీ భారతదేశ రాజకీయాలను, విదేశాంగ విధానాన్ని మేలుమలుపుతప్పిన ధీర. ఒక్క ఎమర్జెన్సీ తప్ప మిగతా నిర్ణయాలన్నీ ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచాయి. అక్టోబర్ 31 ఆమె వర్థంతి.

11/19/2017 - 23:41

విశ్వసుందరిగా మనదేశానికి చెందిన మానుషి ఛిల్లార్ విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం. దాదాపు 17 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రపంచ సుందరి కిరీటం మన మహిళకు దక్కడం ఆనందకరం. చిన్నప్పటినుంచి ఉన్న కోరికను అణచివేసుకోకుండా వైద్య విద్య అభ్యసించినప్పటికీ తన చిరకాల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆమె అనునిత్యం కష్టపడటం స్ఫూర్తిదాయకం.

11/18/2017 - 00:48

ఎన్నో ఆదర్శాలు చెప్పే ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటించడం అభ్యంతరకరం. ఆయన ధోరణి గుజరాత్‌కు ఆయన ప్రధానిలా ఉన్నట్లుంది. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌పటేల్ ఓటమికి కూడా అమిత్‌షా బృందాన్ని అనైతిక మార్గాల్లో ప్రోత్సహించడం మోదీ వంటి వారికి తగదు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓటమికి సూచికగా భావించాల్సి వస్తుంది.
-బి.వి.కె.రావు, హైదరాబాద్
ఇసుక మాఫియాను
అడ్డుకోవాలి

11/16/2017 - 23:30

కొన్ని కోట్ల మంది భారతీయులు చింతపండు లేకుండా వంట చేసుకోరు. నిజానికి ఇది నిత్యావసరంగానే భావించాలి. చింతపండుపై జిఎస్‌టి విధించడం వల్ల పేదలకు భారంగా పరిణమించింది. మధ్య తరగతివారికి ఇది చికాకు కలిగిస్తోంది. జిఎస్‌టి పేరుతో వ్యాపారులు కూడా దోపిడీ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నారో లేదో తెలీదుకానీ వసూళ్లు మాత్రం చక్కగా చేస్తున్నారు. దీంతో చింతపండు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

11/15/2017 - 22:08

కేన్సర్ రోగులకు బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి కొత్త పాలసీని ప్రకటించడం బాధితులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే ప్రీమియం మొత్తం కాస్త తగ్గించాలి. వయోపరిమితి ప్రస్తుతం 20 నుండి 65 సంవత్సరాలని ప్రకటించారు. పదేళ్ల నుంచి అవకాశం కల్పించాలి. ఈ పాలసీని వ్యాపార దృష్టితో కాకుండా ఒక సామాజిక బాధ్యతతో నిర్వహిస్తేనే రోగులకు న్యాయం చేసినట్లు అవుతుంది.

- సూరం అనిల్, శాయంపేట

11/15/2017 - 22:07

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఏర్పాటు గురించి మూడున్నర ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటివరకు దానిమీద ఎటువంటి స్పష్టత లేదు. దళితులు, గిరిజనుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీనివల్ల అర్ధమవుతోంది.ఇప్పటికైనా కేంద్రం స్పందిచేలా తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నించాలి.

-గుండమళ్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం

11/15/2017 - 22:06

అధికార యంత్రాంగం, రాజకీయ నేతల్లో ఎక్కువమంది అవినీతిపరులన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వేలోనే ఇది తేలింది. ఇది బాధాకర విషయం. నీతి నిజాయితీలతో వ్యవహరించాలన్న ధ్యాస వారిలో పూర్తిగా పోయింది. పల్లెల్లో ఇసుక మాఫియా రాజ్యమేలడంలో అధికారులు, నాయకుల పాత్రే కీలకంగా మారింది. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వారు వ్యవహరిస్తున్నారు.

Pages