ఉత్తరాయనం

అవకాశవాద రాజకీయం వద్దు

  • 20/02/2012

ఇటీవల కిషన్‌రెడ్డిగారు తెలంగాణా వాదాన్ని నెత్తికె ఎత్తుకొని తిరగడం చూసాము. గతంలో ఎంతో మంచి పేరు, వాడి, వేడీగల కిషన్‌రెడ్డిగారు కొంతమంది నాయకుల మాదిరిగా ప్రాంతీయవాదంతో పైకి రావాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన రావడం దురదృష్టకరం. ఆంధ్రాలో బిజేపిని బ్రతికించడానికి సుష్మమ్మ, అద్వానీ లాంటివాళ్ళు విభజనను అస్త్రంగా మార్చడం తగదు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు, ఆరు ముక్కలు, వీలైతే ముక్కలుముక్కలుగా మాయమ్మ చేస్తాను అంటే బిజేపి పెద్దలు ఎందుకు ఒప్పుకోవడం లేదు? అక్కడ ఒక న్యాయం, ఆంధ్రాలో ఒక న్యాయమా? పార్టీని బ్రతికించాలి అంటే నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకుంటే కిషన్‌రెడ్డిగార్కి చాలా బాగుంటుంది.
- చర్ల వెంకట సూర్యనారాయణమూర్తి, ఒరిస్సా
============
ప్రత్యేక రైలుజోన్ అవసరం
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం- విజయనగరం జిల్లాల ప్రయాణీకులకు భువనేశ్వర్ జోన్ ప్రయోజనకరంగా లేదు. విశాఖ జిల్లాలోని పాయకరావుపేట- నర్సీపట్నం రోడ్- ఎలమంచిలి, అనకాపల్లి- విశాఖ, పెందుర్తి, కొత్తవలస, ఎస్.కోట, విజయనగరం- గజపతినగరం, బొబ్బిలి- సాలూరు, పార్వతీపురం-గరివిడి, చీపురుపల్లి- శ్రీకాకుళం రోడ్ రైల్వే ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర జోన్ చేయాలి. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి తునితో సరిపెట్టాలి. కేంద్ర రైల్వేశాఖ గుర్తించడానికి ఈ ప్రాంతాల మంత్రులు, శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి.
- నూతి నారాయణరావు, హైదరాబాద్
=============
వింతపోకడల విద్యాశాఖ
రాష్ట్ర ప్రభుత్వం బిఈడీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్యాశాఖ అనుసరిస్తున్న వింత పోకడల కారణంగా అభ్యర్థుల ఆశలు నిరాశలుగా మిగిలిపోతున్నాయి. భారీ సంఖ్యలో టీచరు పోస్టులు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యాశాఖలో రోజుకో గందరగోళ ప్రకటనలు చేస్తూ లక్షలాది అభ్యర్థులను అయోమయంలో పడేస్తోంది. అసలు రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, నాగార్జున, ఆంధ్ర, ఈ యూనివర్సిటీకీ గుర్తింపు లేదా? దూర విద్యావిధానంలో డిగ్రీకి గుర్తింపు లేనప్పుడు బిఈడీ ఎంట్రెన్స్ వ్రాసే ముందు ఈ నిబంధన ఎందుకు పెట్టలేదు? అసలు ఏ అర్హత లేకుండా డిగ్రీ చేసేందుకు ప్రభుత్వం ఈ నిబంధన ఎందుకు పెట్టింది.
- కొమురవెల్లి నర్సింలు ముదిరాజ్, మర్పడగ

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading