S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/05/2017 - 01:35

ఈమధ్య తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ- ‘దరిద్ర బ్రాహ్మణులు’ అని విచక్షణ లేకుండా తన హోదాకు, సెక్యులర్ విధానానికి మచ్చతెచ్చేలా విమర్శలు చేయడం విచారకరం. దీనిని ఇతర కులాల వారు, ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఇదే ఇతర కులాలను విమర్శిస్తే అట్రాసిటీ కేసు వెంటనే నమోదయ్యేది. బ్రాహ్మణులు సహజంగా సాత్వికులు. గొడవల జోలికి పోరు. అవమానాలను మానసికంగా అనుభవించే విజ్ఞత కలవారు.

04/04/2017 - 00:22

విజయవాడ విద్యార్థిని ఆయేషా హత్య కేసులో వెలువడిన తీర్పు న్యాయ పాలికపై సామాన్యుడి గౌరవం పెంచేదిగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో సహజ న్యాయానికి ఎన్ని ఇనుప తెరలు అడ్డుగా నిల్చి ఉన్నాయో, సామాన్యుడికి న్యాయం అందుకోవడమన్నది ఎంత దైవాధీనంగా మారుస్తున్నాయో అవగతమవుతోంది.

04/03/2017 - 00:25

అరలక్షకు పైగా ఖరీదున్న ద్విచక్ర వాహనాలను కొనలేక పాత వాహనాలను రిపేర్ చేయించుకుని బయటకు తీసుకొచ్చిన వాటిని పాతవనే పేరుతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేయడం తగదు. అలాగే వాటి రిజిస్ట్రేషన్ వగైరాలన్నీ ఇతర జిల్లాల్లో ఉన్నట్టయితే వాటిని వాహన యజమానులు నివసిస్తున్న జిల్లాకు ఆన్‌లైన్‌లో లైసెన్స్‌లు ఇచ్చేట్టు అనుమతించాలి.

04/01/2017 - 01:46

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును పార్లమెంటు ఆమోదించడం ద్వారా దేశమంతటా ఏకరూప పన్ను విధానం- ప్రతిపాదనకు మోక్షం దొరికినట్లయింది. తద్వారా పన్ను మీద పన్ను, రాష్ట్రానికో పన్ను తరహా భేదాలు లేకుండా దేశమంతా ఒకే పన్ను అమలులోకి వస్తుంది.

03/30/2017 - 23:21

ఇటీవల చాలా రైళ్లలో పాంట్రీకార్ ద్వారా విక్రయించే అల్పాహారం ధరలు సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండడం లేదు. ఆలూ చాప్ బోండాలు, మిరపకాయ బజ్జీలు, ఇడ్లీ, దోశ తదితర టిఫెన్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ‘రైలు నీరు’ ప్రకటనలకే పరిమితం అయింది. ఇండియన్ రైల్ టూరిజం, క్యాటరింగ్ సెల్లర్స్ ఒక లీటర్ వాటర్ బాటిల్స్ లభించడం లేదు. కొంతకాలం క్రితం జనతా టిఫిన్ కేవలం 10 రూపాయలకే లభించేది.

03/30/2017 - 07:28

‘పాడిందే పాడరా.. పాచిపళ్ల పాటగాడా!’ అన్నట్టుంది కాంగ్రెస్ యువరాజా రాహుల్ గాంధీ వైఖరి. రోజుకు రెండుమూడు సార్లయినా- ‘మణిపూర్, గోవాల్లో భాజపా అధికారం కాజేసింది..’ అని ఆయన చెప్పిందే చెబుతున్నాడు. ‘మీకు మెజారిటీ వుంటే ముందుగా గవర్నర్‌ని ఎందుకు కలవలేదు?’ అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు రాహుల్ ఎలాంటి జవాబు చెప్పడు.

03/29/2017 - 00:34

ఆదాయం: కాగితాల్లోనే వ్యయం: జీవితాల్లోనే
రాజపూజ్యం: రాసుకున్నోళ్లకి రాసుకొన్నంత
అవమానం: చేసుకున్నోళ్లకి చేసుకున్నంత
రాష్ట్రంలో అధిపతి ‘చంద్రుడు’
కేంద్రంలో అధిపతి ‘నరేంద్రుడు’

03/27/2017 - 00:18

దేశంలో అవినీతి లేకుండా పాలన సాగుతోంది తెలంగాణాలోనే అని కేంద్ర ఇంటెలిజన్స్ సర్వేలో తేలినట్టు మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈమధ్యనే హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ తాను ఇల్లు నిర్మించుకొని ఆస్తి పన్ను మదింపుకోసం మునిసిపల్ ఆఫీస్‌కు అనేకసార్లు వెళ్లానని, లంచం ఇస్తేనే పని చేస్తామని, లేకుంటే చేయం అని ఉద్యోగులు తెగేసి చెప్పారని వెల్లడించింది.

03/25/2017 - 01:13

అయోధ్యలో ‘మందిర్-మసీదు’ వివాదం పరిష్కారం దిశగా సుప్రీం కోర్టు ఇచ్చిన సలహా సమంజసమైనదే. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాల వారూ ఈ వివాదాన్ని ముగించుకోవచ్చని కోర్టు సూచించింది. సున్నితమైన మత విశ్వాసాలతో ముడిపడి ఉన్నందున చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం అన్న న్యాయపాలిక అభిప్రాయంతో అందరూ ఏకీభవించాల్సిందే. అయితే, అయోధ్యపై సయోధ్య సాధ్యమా? అన్న అనుమానాలు లేకపోలేదు.

03/24/2017 - 01:02

ఈమధ్య పలుచోట్ల ఘోర బస్సు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు పోయాయి. వాహనాల అమిత వేగం, డ్రైవర్లు కంట్రోల్ తప్పడం, కునుకు తీయడం, ఓవర్‌టేక్ చేయాలన్న ఆతృత, డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వంటివి ఈ ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తాయి. ఈ ప్రమాదాలన్నీ చాలావరకూ కోరితెచ్చుకున్నవలే. కన్నవారికి, బంధువులకు విషాదాన్ని మిగిలిస్తున్నాయి. ప్రభుత్వాలను అదేపనిగా తప్పు పట్టవలసిన పని లేదు.

Pages