S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

08/09/2018 - 23:28

‘‘పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలని పాత కాలంలో అనుకునేవారు కదా?’’
‘‘ఔను.. అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల సైట్లు చూడడమే కానీ ఏడు తరాల చరిత్ర చూసేవారెవరు? అలా అంటే- ఇంకా ఇదేం చాదస్తం అంటారు’’
‘‘ఈ కాలంలో కూడా ఇలా కుటుంబ చరిత్రను చూసేవాళ్లున్నారు.’’
‘ మొన్న జరిగిన మీ బాబాయ్ కొడుకు పెళ్లి గురించేనా?’’

08/03/2018 - 00:16

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’
‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’
‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’

07/26/2018 - 23:19

‘‘ఏదో ఒక రోజు మనం దేవుడిని చూడబోతున్నాం!’’
‘‘దేవుడ్ని చూసే సంగతి ఎలా ఉన్నా- రాక్షసులను మాత్రం రోజూ చూస్తూనే ఉన్నాం ’’
‘‘ఇవి ఉత్తమాటలు కాదు, సైన్స్ పరంగా దేవుడి ఉనికిని చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బుడతడు విలియం మిల్లిస్ దేవుడున్నాడని సైన్స్ ద్వారా రుజువు చేస్తానని చాలెంజ్ చేశాడు.’’
‘‘ఇది సాధ్యం అవుతుందా? ’’

07/19/2018 - 22:57

ఏమండోయ్ రైతుబజారుకు వెళ్లి కూరగాయలు తీసుకురండి! మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానమట! ప్రభుత్వం పడిపోయేట్టుంది. తొందరగా వెళ్లండి’’
‘‘కాసేపుప్రశాంతంగా పేపరు చదువుకోనివ్వవా?’’

07/12/2018 - 23:10

‘‘బయట కూర్చున్నావ్.. మీ ఇంట్లో చక్కని టీ తాగుదామని వస్తే’’
‘‘మా ఇంట్లో ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ’’
‘‘అదేం లేదన్నయ్య గారూ.. అయన బడాయి మాటలు.కరెంట్ బిల్లు కట్టమని వారం క్రితం డబ్బులిచ్చాను. చుట్టలు కాల్చాడో, బీడీలు కాల్చాడో తెలియదు కానీ జేబులో డబ్బుల్లేవట.. బిల్లు విషయమే మరిచిపోయాడట! కరెంట్ కట్ చేశారు’’

07/05/2018 - 23:41

తెలియధు అంటే- తెలివి లేదని నిందిస్తావా? నాగం జనార్దన రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన స్థాపించిన పార్టీ ఏమైంది? బిజెపి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవేంటి? టీవీ చర్చల్లో రోజూ కనిపించే ఫలానా నాయకురాలు ఈ రోజు ఏ పార్టీ తరఫున మాట్లాడారు? రాజకీయాల గురించి నాకేమీ తెలియదా? నువ్వడిగిన ప్రశ్నలకు నాగంకే సమాధానం తెలియదు.

06/28/2018 - 23:38

‘‘దిగులుపడకు.. మన రాజకుమారి అక్కయ్య కోరినట్టు మగవాళ్ల హక్కుల కమిషన్ వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.’’
‘‘నాకూ అదే అనిపించింది.. ఆడపిల్ల అని కడుపులోనే చంపేసినట్టు వచ్చే వార్తలు కాస్తా ఇప్పుడు మగపిల్లాడని తెలిసి పుట్టగానే చంపేసిన తల్లి అనే వార్తలుగా మారాయి.’’
‘‘ఏదో జరుగుతోందని అనిపిస్తోంది..’’

06/21/2018 - 23:51

అంటే.. ఇక యుద్ధం తప్పదంటావా?’’
‘‘ఆ మాట నేనెప్పుడన్నాను?’’
‘‘పెద్దనోట్ల రద్దు ప్రయోగం ఫలించక పోతే ఇక మిగిలిన ఆయుధం పొరుగు దేశంతో యుద్ధం ఒక్కటే అని అప్పుడన్నావుకదా?’’

06/14/2018 - 23:11

‘‘చెల్లెమ్మా.. గులాభ్ జాం తియ్యగా ఉంది.. మరో రెండు పట్రా..’’
‘‘దుర్మార్గుడా! అవేం మాటలురా!?’’
‘‘చెల్లెమ్మా అనడం దుర్మార్గమా?’’
‘‘కాదు.. ఆ తరువాత ఏమన్నావు?’’
‘‘గులాబ్ జాం తియ్యగా ఉందన్నాను’’

06/08/2018 - 00:05

అంతా ఉత్సాహంగా ఉన్నారు.. గుర్నాథం ఏం స్టోరీ చేస్తున్నావ్?’’
‘‘అదేదో పేద రాష్ట్రంలో ఏదో ఆఫీసులో అటెండర్ ఇంట్లో ఏసీబీ దాడి జరిపితే వంద కిలోల బంగారం, 67 ప్లాట్లు, 50 ఎకరాల పొలం కాగితాలు, కోట్లకొద్దీ నగదు దొరికింది. దీనిపై స్టోరీ చేస్తున్నా సార్! ఒక అటెండర్ ఇంత సంపాదించడం సాధ్యమా? ఎవరికైనా బినామీనా? అని ’’

Pages