S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

04/02/2018 - 21:31

మనలో చాలామందిమి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ రాసిన అద్భుత కథ ‘వడ్లగింజలు’ చదివే వుంటాం. అందులో ‘చతురంగ విద్యానిధి’ తంగిరాల శంకరప్ప వేసిన ఆఖరి ఎత్తు మహారాజు తిమ్మ జగపతిని ఎలా గింగిరాలు కొట్టించిందో మర్చిపోవడం సాధ్యమేనా? చదరంగం బల్ల మీద అరవై నాలుగు గళ్లు (వీటినే ‘గదులు’ అని కూడా అంటారు) ఉంటాయి.

04/01/2018 - 22:06

తెలుగు సంప్రదాయ సాహిత్య చరిత్రలో, ‘కవిత్రయ మహాభారత’మే ఆదికావ్యమనీ, దానికి - సంస్కృతంలో - శ్రీకారం చుట్టి, రెండున్నర పర్వాలు రచించిన నన్నయగారే మనకి ఆదికవి అనీ సాహిత్య చరిత్రలో నిరూపితమయి ఉంది. సాహిత్య చరిత్రకు సంబంధించిన ఇలాంటి నిరూపణల వెనక ఎందరో మేధావుల, పరిశోధకుల కృషి దాగి ఉంటుందని సాహిత్య విద్యార్థులు మర్చిపోకూడదు.

03/30/2018 - 21:46

‘ఆదికవి’గా తెలుగు ఆరతులందుకుంటున్న నన్నయ్య క్రీ.శ.1022 నాటి వాడని చరిత్ర పరిశోధకులు తేల్చారు. అంటే, పదకొండో శతాబ్దం వాడని అర్థం. ఆయనతోనే తెలుగు సాహిత్యం పుట్టిందని మనవాళ్లు ఎనిమిది శతాబ్దాలపాటు ఎదురులేకుండా రాస్తూ వచ్చారు. కానీ, ఇరవయ్యో శతాబ్దంలో - మన సాహత్య చరిత్రకు శాసనాలు ప్రాథమిక ఆకరంగా మారిన తర్వాత - ఈ నమ్మకాన్ని ప్రశ్నించడం మొదలయింది.

03/29/2018 - 21:53

తెలుగు భాషపై సంస్కృత ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడేది సాహిత్య రంగంలో. మన సంప్రదాయిక సాహిత్యంలోని చెప్పుకోదగిన ప్రతి రచనా, ఏదో ఒక సంస్కృత రచనకు ప్రతిధ్వనే అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇవి మక్కీకి మక్కీగా చేసిన అనువాదాలు కావు - సృజనాత్మకంగా చేసిన ‘అనునాదాలు’! పందొమ్మిదో శతాబ్దం వరకూ మనవాళ్లు చేసిన అపూర్వమయిన, అనిదంపూర్వమయిన ప్రయోగాలన్నీ ఇలాంటివే!

03/28/2018 - 21:56

తెలుగు భాషా సాహిత్యాలను అపారంగా ప్రభావితం చేసిన అన్ని భాషల్లో ప్రాకృతాలూ ఉన్నాయి. తెలుగునాడును తొలినాటి నుంచీ ప్రభావితం చేస్తూ వచ్చిన జైన బౌద్ధ వాఙ్మయాలు ప్రధానంగా ప్రాకృతాలలోనే ఉన్నందువల్ల ఆది నుంచీ మన సంస్కృతిపై ప్రాకృత ప్రభావం ప్రగాఢంగా ఉంటూనే ఉంది. మన నాటను బయటపడిన తొలి శాసనాలు - మూడు వేల ఏళ్ల కిందటివి - సయితం ప్రాకృతాల్లోనే ఉన్నాయి.

03/27/2018 - 21:50

సాక్షాత్తూ ఆ కవిసార్వభౌముడూ, సాహితీ సమరాంగణ చక్రవర్తీ కలిసికట్టుగా దిగొచ్చి- మన ముందుకొచ్చి- ‘సకల భాషలకూ సంస్కృతమే తల్లి సుమా!’ అని చెప్పినప్పటికీ, విద్వల్లోకం దాన్ని ఆమోదించే పరిస్థితి లేదివాళ. ప్రముఖ పండితుడూ, తొలితరం పరిశోధకుడూ, బహుభాషావేత్త అయిన డాక్టర్ చిలుకూరి నారాయణరావు తన జీవిత పర్యంతం తెలుగు భాష సంస్కృత ప్రాకృతాల నుంచి పుట్టినదని నిరూపించేందుకు తపించి, విఫలమయ్యారు.

03/26/2018 - 21:23

ఏ భాషలోనయినా తిథి వార నక్షత్రాలు చూసుకుని మరీ ‘సాహిత్యం’ పుట్టుకురాదు. పాటుపడే వాళ్లే, పాటలు పాడుకోవడం మొదలుపెడతారు. అందులో వాళ్ల జీవనం ప్రతిధ్వనిస్తుంది. ప్రతిఫలిస్తుంది. సామాజిక జీవనంలో ప్రముఖ పాత్ర వహించే పండగలూ పబ్బాలూ, పెళ్లిళ్లూ పేరంటాలూ, జాతర్లు, తిరునాళ్లలోనే తొలి తెలుగు పాటలు పుట్టి వుంటాయి. ఆ జానపదులు ఈ పాటల కింద తమ ఊరుపేరూ చెక్కుకుని ఉండకపోవచ్చు.

03/25/2018 - 21:27

జాతుల, భాషల చరిత్రకి నమ్మకమయిన భౌతిక ఆకరాల్లో శాసనాలు ముఖ్యమైనయినవి. శిలా శాసనాల్లో కనిపించే విషయాలను మనవాళ్లు ప్రామాణిక సత్యాలుగా పరిగణిస్తారు. అందుకే, శాశ్వత సత్యాలను ‘శిలా శాసనాలు, శిలాక్షరాలు’ అనడం కద్దు! తెలుగునాట దొరికిన శాసనాల్లో అశోకుడు చెక్కించిన శిలాఫలకాలే అత్యంత ప్రాచీనమయినవంటారు. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందినవీ శాసనాలు.

03/23/2018 - 20:23

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, దక్షిణ భారతదేశంలోని భాషా సమూసాలన్నింట్లోకీ పెద్దదయిన తెలుగు ‘జాతి’ ఆది నుంచీ భిన్నత్వంలో ఏకత్వానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తూ వచ్చింది. ఆ కారణం చేతనే వేరువేరు ఆలన వ్యవస్థల పరిధిలో మనుగడ సాగించినప్పటికీ, వాళ్లందరికీ ఎప్పుడూ ఓ ఉమ్మడి సంస్కృతి ఉంటూనే వచ్చింది. ఈ సంస్కృతి ఉనికి ప్రధానంగా, తెలుగు భాష చుట్టూ కేంద్రీకృతం కావడం కాకతాళీయం కాదు.

03/22/2018 - 21:23

మన దేశంలో ఏ ప్రాంతంలోనూ వినిపించనంత ఎక్కువగా నాగ శబ్దం తెలుగు నాట వినిపిస్తుంది. ఇక్కడ ఇంటింటా ఓ నాగన్న ఉంటాడు. ప్రతి కుటుంబంలోనూ ఓ ‘పాపన్న’ (పాప అంటే పామనే అర్థం. పాపరేడు అనే కావ్య ప్రయోగం ప్రచురమే కదా!) కనిపిస్తాడు. ఇక్కడున్నంత మంది నాగరాజులు మరెక్కడా -నాగలోకంలో కూడా - కనిపించరేమో. పాములకి మాటాపలుకూ ఉండదు. కానీ, మన రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ‘నాగవాణి’ వినిపిస్తూనే ఉంటుంది.

Pages