S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/01/2017 - 23:10

జయపూర్ (రాజస్థాన్)కి 120 కి.మీ. దూరంలో వున్న ‘ఝున్ ఝునూ’ నగరంలోనూ, ఆ జిల్లాలోని యితర పాఠశాలల్లోనూ రుూ ఏడాది ‘ఆర్.డే.’ అమోఘంగా చేసుకున్నారు. స్కూళ్లల్లో 6నుంచి 12 తరగతి దాకా చదువుకుంటున్న వాళ్లకి ఎప్పటిలాగే లడ్డూలు పంచిపెట్టారు. ఒక కమ్మని అతి పెద్ద లడ్డుండతోపాటు చక్కని చిన్న జనరల్ నాలెడ్జి-2017 పుస్తకాన్ని కూడా పంచి పెట్టారు.

02/01/2017 - 23:03

నోట్ బందీగా గవర్నమెంట్ పెట్టిన చలామణీలో వున్న కరెన్సీ రద్దు ఫలితంగా చాలాకాలం లావాదేవీలు యిచ్చిపుచ్చుకోడాలూ దెబ్బతిన్నాయ్. వీటిలో ఒకటి గాడిదల వ్యాపారం పూణేలో మహారంజుగా సాగుతుంది. అది గానీ నవంబర్ 18 నుంచీ సంభవించిన ‘నోట్ బందీ’- ‘నోట్ బదిలీ’ మీద దెబ్బతీసింది. ఏటా పూణే సంతలో ఒక కోటిన్నర గార్ధ్భ రాజములు అమ్ముడుపోయేవి. కానీ, రుూసారి నగదు రహిత చెల్లింపు నియమం కారణంగా ఎక్కడి గాడిదలక్కడే వుండిపోయాయి.

02/01/2017 - 23:00

అసలా యింట్లో ప్రతిరోజూ ‘కోడి కూత’లాగే రామచిలక పలుకులు అందర్నీ మేలుకొలుపుతూ వస్తూ వుండి ఎనిమిదేళ్లయింది. ఐతే, కర్ణాటకా ‘నవాడా’ జిల్లా వార్సాగంజ్ ఠాణాచౌక్‌లో నివసిస్తున్న శ్రీమతి బబితాదేవి- ప్రాణాధికంగా ప్రేమించి, పెంచుకుంటున్న రుూ మేలుకొలుపుల రామచిలుక- రుూ జనవరి మూడవ తేదీనుండీ మాయమైపోయింది.

02/01/2017 - 22:57

అడవి జంతువులకి కూడా సంరక్షణ కావాలి మరి. మధురలో ఒక (ఉత్తరప్రదేశ్) వన్య మృగ సంరక్షణాలయం భారీ ఎత్తున పనిచేస్తూ వుంది. బానిసత్వం నుంచీ, వెట్టిచాకిరీ నుంచీ కొన్ని ఏనుగుల్ని విడిపించుకొచ్చి వాటికి జలుబు, రొంపా పట్టకుండా వేణ్నీళ్ల స్నానాలూ గట్రా చేయించే రుూ సెంటర్ కోసం ఎంతోమంది భూత దయగల వనితామణులు పూలు వుండలు (ఉండలా? కొండలా?) తెచ్చుకుని స్వెట్టర్లు అల్లుతున్నారు.

01/31/2017 - 22:24

ఇండోనేషియాలో ప్రతి పాఠశాలలో ఒక రోజు ప్రత్యేక రోజుగా జరుపుకొంటారు. ప్రతి విద్యార్థి తల్లిని ఆరోజు పాఠశాలకు ఆహ్వానిస్తారు. అక్కడ విద్యార్థులచే వారి తల్లుల పాదాలు శుభ్రం చేయిస్తారు.

01/31/2017 - 22:22

విశ్వసుందరి కిరీటాన్ని సాధించిన ఫ్రాన్స్ భామ ఇరిస్ మిథెనరికి పిల్లులంటే ఎనలేని ప్రేమ. ఆమె వద్ద రెండు పిల్లులు పెరుగుతున్నాయి. డెంటల్ సర్జరీ చేసిన ఈ సుందరి మంచి సింగర్ లేదా డ్యాన్సర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నది. జీవితం అంటే ఫన్నీగానూ, జాగ్రత్తగా ఉండటమేనని సెలవిస్తుంది. 63 ఏళ్ల తరువాత ఫ్రాన్స్ తరపున రెండవ విశ్వసుందరిగా ఎంపికై ఇరిస్‌కు క్రీడలంటే ఇష్టం.

01/28/2017 - 22:22

కొన్ని కలలుగానే మిగిలిపోతాయి. కొన్ని వాస్తవాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కలని వాస్తవం చెయ్యడానికి కృషికావాలి. ఓటమిని ఎదురీదగలిగే శక్తి కావాలి. అప్పటిదాకా ఓ సర్జన్‌గా కత్తి పట్టిన నేను, చేసే చికిత్సలని అందరి అవగాహనలోకి తీసుకెళ్లాల్సిన ఉద్దేశ్యంతో ‘కలం’ పట్టాను. ‘కలం’ కాగితం పైన పెట్టాక రాయగలనా అన్న అనుమానం వేసింది. రాస్తే ఎన్నాళ్లు రాయగలనన్న ఆలోచన కలిగింది.

01/27/2017 - 22:05

మలైకా అరోరాఖాన్‌కు డ్యాన్స్, నటనలోనే కాదు పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. చక్కగా వంట కూడా చేస్తుంది. మోడల్‌గానూ, నటిగానూ, టీవి నటిగా తనదైన శైలిలో ముందుకు వెళుతున్న మలైకా ఇటీవల ముంబయిలోని వాస్వాని పాల్తేకలినరీ అకాడమీ నిర్వహించిన వంటల కార్యక్రమానికి విచ్చేసింది. వంటల్లోనూ తన ప్రావీణ్యాన్ని చూపించింది. ఆమె మంచి తిండిగత్తే. పాలు, క్యారెట్ అంటే అసలు ఇష్టముండదు.

01/26/2017 - 21:37

ఉత్తరాఖండ్‌లోలోని అల్మోరా పర్వత ప్రాంతాల్లో దానిమ్మ పండ్లు అధికంగా పండుతాయి. ఈ పండు పేరుతోనే దారిమ్ అనే ఊరు కూడా ఉంది. అయితే ఇపుడు ఆ ఊళ్లో దానిమ్మ చెట్లే కనిపించటం లేదు. ఎందుకంటే కోతులు విపరీతంగా ఈ ఊరిపై పడి దానిమ్మ చెట్లను ధ్వంసం చేసేస్తున్నాయి. కోతులు బెడద భరించలేక ఊరివారంతా దానిమ్మ చెట్టు లేకుండా కూకటి వేళ్లతో సహా పెకిలించేశారు. అయినప్పటికీ కోతి బుద్ది ఎక్కడకి పోతుంది.

01/26/2017 - 21:29

రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

Pages