S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/20/2018 - 19:28

నేటి మహిళలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్ళపై నిలబడాలనుకుంటారు. అలాంటి మహిళలు ఆర్థికంగా ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి? ఆత్మస్థైర్యంగా ముందుకు ఎలా సాగాలో చూద్దాం..!
రిటైర్మెంట్ ఫండ్స్ సమకూర్చుకోవడానికి పురుషులతో పోలిస్తే మహిళలు రెండింతలు ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకు కారణాలు ఏంటంటే..

11/18/2018 - 23:18

అత్తాకోడళ్లు..
కుటుంబ రథానికి రెండు చక్రాలు!
గృహ గగన సీమలో..
వెలుగుపంచే చుక్కలు!
అస్తిత్వాన్ని ప్రదర్శించడంలో..
ఇద్దరూ ఒకే తాను ముక్కలు!

అంతర్గతంగా
ఆధిపత్యం కోసం..
వారు పడే ఆరాటంలో
కొడుకులవుతారు
అడకత్తెరలో పోకచక్కలు!

11/16/2018 - 19:18

మన దేశ జనాభా 125 కోట్లు కాగా, సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య ఇప్పటికే 200 కోట్లు దాటిపోయింది. నేటి యువతలో చాలామంది సెల్‌ఫోన్ వలలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఎంతసేపూ స్మార్ట్ఫోన్‌తో గడుపుతూ ఎంతోమంది యువతీ యువకులు తమ చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

11/16/2018 - 19:13

మనం
కలల లోకంలో
విహరిస్తూ..
ఊహల పల్లకీలో
ఊరేగుతూ..
ఊపిరి పోసే గాలిమేడలు
చివరికి నీటిపై రాసిన రాతలవుతాయి!

కోరికల జలధిలో
ఓలలాడుతూ..
రూపుదిద్దే ఆశాసౌధాలు
మనల్ని
త్రిశంకు స్వర్గంలోకి లాక్కొని వెళ్లి
మన అసమర్థత జాడలు తెలిపే
నీడలవుతాయి

11/15/2018 - 19:10

మనిషి సంఘజీవి. అనుక్షణం కుటుంబ సభ్యులతో లేక స్నేహితులతో, టీవీ, అంతర్జాలం, స్మార్ట్ఫోన్లు, సినిమాలతో కాలక్షేపం చేస్తూనే ఉండడం అతని జీవన విధానం. ఒక్కరోజు ఎవ్వరూ కనబడకపోయినా లేక ఎలాంటి కాలక్షేపం లేకుండా ఏకాంతంలో గడపాల్సి వచ్చినా పిచ్చి ఎక్కినట్లు విలవిల్లాడిపోతాడు. చీకటి పడ్డాక ఒక్క క్షణం కరెంట్ లేకపోతే ఆందోళనకు గురవుతాడు.

11/14/2018 - 20:48

చలికాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరాన్ని మోసే పాదాల్లో పగుళ్లు రావడం, అవి నీళ్లలో నాని చివికిపోయి, వాసన రావడం సహజం. మొదట్లో ఇది సమస్యగా అనిపించకపోయినా తరువాత పెనుసమస్యగా మారే అవకాశముంది. చాలా సమయం నీళ్లలో పనిచేయడం వల్ల ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాలను సంరక్షించుకోవచ్చు.

11/14/2018 - 20:43

సుప్రభాత వేళ
పక్షులు తమ కిలకిలారావాలతో
స్వరహారతి పడుతుంటే..
మంచు తెరలను దాటి
వడివడిగా..
ధరణిని ముద్దాడే
లేలేత ఉషాకిరణాలతో
జగమంతా పులకరింత!

11/13/2018 - 20:31

ఆటలు పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడం లోనూ, బుద్ధి వికాసం కలిగించడం లోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి. ప్రస్తుతకాలంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలాంటి వ్యాయామాలు చేయడం లేదు.

11/09/2018 - 19:25

నలభై ఏళ్ళ క్రితం మాట. అప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. సైకిల్ షాపులో పావలా ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకి ఇస్తారు. నా ఈడు పిల్లలందరికీ సైకిల్ తొక్కాలని మహాసరదాగా ఉండేది. పెద్దవాళ్ళ సైకిల్ తొక్కాలంటే సీటు అందదు. ఫెడల్స్‌మీద కాళ్ళు పెట్టి అడ్డ తొక్కుడు తొక్కేవాళ్ళం. సైకిల్ షాపులో పిల్లలు తొక్కుకునే చిన్న సైకిల్ అద్దెకు ఇస్తారు.

11/09/2018 - 19:23

ఆ కొండ బండరాళ్ళ వెంట నీ వులిని చేతబట్టి
పరుగు పరుగునా సాగిపోతూవున్న ఓ మహనీయ,
మహోన్నత శిల్పకళా ద్రష్టా! సృష్టికర్తా!
నీ పయనము ఎచటికి? నీ కోపము ఎవరిమీద?
కాస్త ఆగవయ్యా, మహానుభావా!
నేను అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పి వెళ్ళవయ్యా,
నీవు చెక్కిన ఆ మనోజ్ఞ రసదీపికా సుమబాలికా మూర్తి అయిన
ఆ స్ర్తి మూర్తి కన్నులలో ఉయ్యాలలూగుచున్న

Pages