S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 21: రైతుల రుణ బకాయిలు మాఫీ కాకపోవడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సంకల్పించింది.

11/22/2016 - 00:55

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఒక తుపాకీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జప్తు చేసిన తుపాకుల నుండి యుఎస్ కార్బైన్ కాల్.30 విన్‌చెస్టర్ (తయారీ)ను మార్కెట్ ధరకే విక్రయించేందుకు హోం (ఆర్మ్స్) శాఖ అంగీకరించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర పేరుతో జీఓ (ఆర్‌టి నెంబర్ 1386, తేదీ 21-11-2016) జారీ అయింది.

11/22/2016 - 00:50

విశాఖపట్నం, నవంబర్ 21: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భారత జట్టు బోణీ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన భారత జట్టు తాజాగా సోమవారం విశాఖపట్నంలోని వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో ప్రత్యర్థులను 246 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యత సాధించింది.

11/22/2016 - 00:48

విశాఖపట్నం, నవంబర్ 21: కెప్టెన్‌గా ఒత్తిడిని తాను ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నానని, అయితే మరోమూడేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ నరం ఎంత తనపై ఉందో అంనా వేయగలుగుతానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘బహుశా మూడు నాలుగేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ భారం ఎంతగా నాపై ఉందో అంచనా వేయగలుగుతాను.

11/22/2016 - 00:46

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 21: విశాఖ టెస్టులో తాము చివరి వరకు కష్టపడినా మ్యాచ్‌ను నిలుపుకోలేకపోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. టాస్ గెలవడం భారత్‌కు కలిసొచ్చిందని, తొలిరోజు సునాయాసంగా భారత్ జట్టు పరుగులు సాధించిందని అన్నాడు. రెండవ రోజు నుండి ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు.

11/22/2016 - 00:45

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత క్రికెట్ బోర్డును సంస్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిసిసిఐ పెద్దలపై జస్టిస్ ఆర్‌ఎం.లోధా కమిటీ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

11/22/2016 - 00:43

కౌలూన్, నవంబర్ 21: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో తొలిసారి టైటిల్ కైవసం చేసుకుని మంచి ఊపుమీద ఉన్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో మరోసారి సత్తా చాటుకుని వచ్చే నెల దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు అర్హత సాధించాలని ఎదురు చూస్తోంది.

11/22/2016 - 00:38

విశాఖపట్నం, నవంబర్ 21: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం ఐఎన్‌ఎస్ జలాశ్వను సందర్శించాడు. ఇంగ్లండ్‌పై భారత్ జట్టు విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌కు నేవల్ డాక్‌యార్డు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కొద్దిసేపు అశ్విన్ ముచ్చటించాడు.

11/22/2016 - 00:32

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరో రోజు సూచీలు నష్టాలకే పరిమితమవగా, ఆరు నెలల కనిష్టానికి పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 385.10 పాయింట్లు కోల్పోయి 25,765.14 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 145 పాయింట్లు దిగజారి 8వేల స్థాయికి దిగువన 7,929.10 వద్ద స్థిరపడింది.

11/22/2016 - 00:30

న్యూఢిల్లీ, నవంబర్ 21: జైడస్ క్యాడిలా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పటేల్.. వచ్చే ఏడాదికిగాను పారిశ్రామిక సంఘం ఫిక్కీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే నెలతో ఫిక్కీ అధ్యక్షుడిగా అంబుజా నియోటియా గ్రూప్ చైర్మన్ హర్షవర్ధన్ నియోటియా పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పటేల్ ఫిక్కీ సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.

Pages