S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 02:13

వెంకటాచలం, సెప్టెంబర్ 27: కర్మాగారాల ఏర్పాటుకు ముందు అన్ని కంపెనీలు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామీలు కురిపిస్తాయని.. చివరకు ఏమీ చేయవని కర్మాగారం ఏర్పాటు చేసిన తరువాత ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉద్యోగాలు విస్మరిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద నుంచి ఉన్న చిన్న కర్మాగారాల వరకు అన్నింటి పరిస్థితి అలాగే ఉంది. ప్రతిసారి మోసపోతున్నాం.

09/28/2016 - 02:11

కర్నూలు, సెప్టెంబర్ 27:ఇంతవరకూ ముఖ్యమంత్రి, అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ఇక నుంచి జిల్లా అధికారులు ప్రజలతో నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా కర్నూలు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు.

09/28/2016 - 02:11

కర్నూలు, సెప్టెంబర్ 27:రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో నిర్వహించే పురపాలక ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతి పాటించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు, అధికార పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. స్థానిక సంస్థలకు ప్రస్తుతం ఉన్న అయిదంచెల వ్యవస్థను మూడంచెల వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

09/28/2016 - 02:10

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 27:రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి వర్ధం తి పురస్కరించుకుని మంగళవారం నగరంలోని పాత కంట్రోల్ రూం దగ్గర ఉన్న కోట్ల విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే కిసాన్ ఘాట్‌లోని కోట్ల సమాధిని దర్శించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

09/28/2016 - 02:10

నంద్యాలటౌన్, సెప్టెంబర్ 27: పట్టణంలో ఉన్న స్పెషల్ సబ్‌జైలు పురాతనమైనదని, దీనిని తరలించడానికి స్థలాన్ని సేకరిస్తున్నట్లు ఈ విషయంపై కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తెచ్చినట్లు జిల్లా జైళ్ల శాఖ అధికారి వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని స్పెషల్ జైలు ఎదుట స్వచ్ఛ్భారత్‌లో భాగం గా నంద్యాల జైలు సూపరింటెండెంట్ అస్లాంబాషా ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరుపోశారు.

09/28/2016 - 02:10

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 27: భగత్‌సింగ్ జయంతి సందర్భంగా మండలంలోని అలసందుగుత్తి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరతి విద్యార్థి పెద్దరాజు భగత్‌సింగ్ చిత్రాన్ని గీసి అందరినీ అబ్బుర పరిచారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి చిత్రీకరించి భగత్‌సింగ్ చిత్రాన్ని విద్యార్థులు అందరు ఆంతో ఆసక్తిగానో చిత్రికరించారు.

09/28/2016 - 02:09

నందికొట్కూరు, సెప్టెంబర్ 27:పట్టణంలోని అల్లూరు రోడ్డు సమీపంలో ప్రధాన డ్రైనేజీని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారుల సూచనల మేరకు తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషనర్ మంగళవారం కౌన్సిలర్ భాస్కరరెడ్డితో కలిసి వెళ్లి ప్రధాన డ్రైనేజీని పరిశీలించారు.

09/28/2016 - 02:09

బేతంచెర్ల, సెప్టెంబర్ 27:డోన్ డివిజన్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ప్రతి విద్యాసంవత్సరం నిర్వహించే జోనల్ క్రీడలను ఈ ఏడాది నిర్వహించేందుకు సిద్ధం కావాలని డోన్ డిప్యూటీ డిఇఓ వెంకట్రామిరెడ్డి సూచించారు. స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో మంగళవారం డివిజన్ పరిధిలోని డోన్, కోవెలకుంట్ల జోనల్ వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశమై జోనల్ క్రీడా వేదికలపై సమీక్ష నిర్వహించారు.

09/28/2016 - 02:08

నందికొట్కూరు, సెప్టెంబర్ 27:పట్టణంలో సోమవారం అర్ధరాత్రి పగిడ్యాల రహదారిలోని కుమ్మరిపేటలో పడిన పిడుగుపాటుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ విశ్వం ఇంటిపై పిడుగుపడడంతో గోడ బీటలు వారింది. దీంతో విశ్వం ఇంటితో పాటు సమీప ఇళ్లలోని గౌండ సలాం, వీరన్న, రాముడు, కురువ మద్దిలేటి, కుమ్మరి వెంకటేశ్వర్లు, చిన్నపక్కీరయ్యతో పాటు మరికొందరికి చెందిన 20 టివిలు, కూలర్లు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.

09/28/2016 - 02:08

మంత్రాలయం, సెప్టెంబర్ 27: పశువులకు రక్షణ కల్పించడం ఎంతో ముఖ్యమని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి అన్నారు. మంగళవారం కొండాపురం సమీపంలో ఉన్న గోశాలను ఆయన పరిశీలించారు. జిల్లాలోని వైద్యులతోపాటు కర్నాటకలోని రాయచూరు నుండి వచ్చిన ప్రత్యేక వైద్యులతో పశువుల రోగాలను పరీక్షించారు. అనంతరం వైద్యులు వాటికి రోగ నిరోదక మందులను అందించారు.

Pages