S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 23:59

సిద్దిపేట, సెప్టెంబర్ 27 : సిద్దిపేట మినిస్టేడియంలో సెంట్రల్ అకాడమీ ఏర్పాటుతో ఈప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి దోహదం చేస్తుందని హెచ్‌సిఎ ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక మినీస్టేడియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్‌సిఎ కృషిచేస్తుందన్నారు.

09/27/2016 - 23:59

కోల్‌కతా, సెప్టెంబర్ 27: జాతీయ జట్టులో స్థానంపై దాదాపుగా ఆశలు కోల్పోయిన గౌతం గంభీర్‌ను అదృష్టం వరించే అవకాశం కనిపిస్తున్నది. ఓపెనర్ లోకేష్ రాహుల్ కండరాల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో, అతని స్థానంలో గంభీర్‌ను తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి భారత జట్టు మేనేజ్‌మెంట్ సూచించినట్టు సమాచారం. జట్టు మేనేజ్‌మెంట్ సూచనపై అతను ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు.

09/27/2016 - 23:59

తొగుట, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని...ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ దౌర్జన్యంగా ప్రజల అభిష్టాన్ని కాదని ప్రాజెక్టుకు భూములు లాక్కోవడం దారుణమని.. సింగూరు బాధితుల పోరాటాల స్ఫూర్తితో వేములగాట్ దీక్షలు అభినందనీయని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హన్మంతరావు అన్నారు.

09/27/2016 - 23:58

సిద్దిపేట, సెప్టెంబర్ 27: దేశంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ పథకం తీసుకొచ్చిందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్భారత్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రాహుల్ ప్రతాప్‌సింగ్ అన్నారు. స్థానిక శివమ్స్ గార్డెన్‌లో జరిగిన స్వచ్చ పురస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

09/27/2016 - 23:58

మెదక్ రూరల్, సెప్టెంబర్ 27: భారీవర్షంతో నీట మునిగిన పంట పొలాలను డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, వరదలపై ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు నియమించిన ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లు మంగళవారం మండలంలోని రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని బాల్‌నగర్ శివారులో పరిశీలించారు.

09/27/2016 - 23:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మహిళల టోర్నీలో భారత బ్యాట్స్‌విమన్ స్మృతి మంధాన పాల్గొననుంది. బిబిఎల్‌లో పోటీపడే బ్రిస్బేన్ హీట్స్‌తో ఆమె ఏడాది పాటు అమల్లో ఉండే ఒప్పందం కుదుర్చుకుంది.

09/27/2016 - 23:57

సంగారెడ్డి, సెప్టెంబర్ 27: సరిగ్గా గత యేడాది సెప్టెంబర్ 25వ తేదీన కేవలం రెండు టిఎంసి నీటి నిల్వతో ఉన్న సింగూర్ ప్రాజెక్టు అందుకు భిన్నంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండుకుండలా తొణకిసలాడుతోంది. వర్షాలు కురియడం నిలిచిపోయి మూడు రోజులు కావస్తున్నా సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తాకిడి కొనసాగుతూనే ఉంది.

09/27/2016 - 23:56

దుబాయ్, సెప్టెంబర్ 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే విండీస్ జట్టుకు స్పిన్నర్ జోమెల్ వారికాన్ ఎంపికయ్యాడు. గత నెల భారత్‌తో జరిగిన మూడు, నాలుగు టెస్టుల్లో ఆడిన 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వారికాన్‌కు స్థానం లభించింది. తన ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకున్న వారికాన్‌కు మరోసారి అవకాశం దక్కింది.

09/27/2016 - 23:56

మెదక్, సెప్టెంబర్ 27: తెలంగాణ జాగృతి ప్రతినిధులు మంగళవారం నాడు బంగారు బతుకమ్మ గోడ పత్రికను విడుదల చేశారు. జిల్లా తెలంగాణ జాగృతి కో కన్వీనర్ గీతారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 నుండి అక్టోబర్ 8 వరకు మెదక్ నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాల్లో బంగారు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

09/27/2016 - 23:56

లాసనే్న, సెప్టెంబర్ 27: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఈ ఏడాదిలోగానే గుర్తింపునిస్తామని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కువో వూ స్పష్టం చేశాడు. ఇక్కడ అతను విలేఖరులతో మాట్లాడుతూ బిఎఫ్‌ఐ ఎన్నికలు నిబంధలను అనుసరించి జరిగాయని, ఎక్కడా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోలేదని తమ తరఫున పరిశీలకుడిగా వెళ్లిన ఎడ్గర్ టన్నర్ తన నివేదికలో పేర్కొన్నట్టు చెప్పాడు.

Pages