S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 00:05

నక్కలగుట్ట, సెప్టెంబర్ 27: ఎస్సారెస్పీ కాలువ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువును నింపాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదుల ద్వారా కాకుండా ఎస్సారెస్పీ ద్వారా రామప్ప, గణపురం చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.

09/28/2016 - 00:05

ఏటూరునాగారం, సెప్టెంబర్ 27: ఎగువ ప్రాంతాల వరద నీటితో ఉప్పొంగిన గోదావరి మంగళవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంతో సోమవారం గోదావరి ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి నివాస, భోజన, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.

09/28/2016 - 00:04

నక్కలగుట్ట, సెప్టెంబర్ 27: దేశంలో ప్రవేశపెట్టిన వస్తుసేవా పన్ను విధానం పన్నుల ఎగవేతను నియంత్రించి, ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుందని మాజీ ఉపకులపతి ఆచార్య వెంకటరత్నం అన్నారు. మంగళవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్వర్యంలో భారతదేశంలో జిఎస్‌టి అమలు-తీరుతెన్నులు అనే అంశంపై ఒకరోజు సదస్సు జరిగింది.

09/28/2016 - 00:04

వరంగల్, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వశక్తితో ఎదిగి నమ్మిన సిద్దాంతానికి కట్టుబడిన వ్యక్తి అని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆయన సిద్దాంతాలను ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు.

09/28/2016 - 00:03

దుబాయ్, సెప్టెంబర్ 27: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ని భారత్ గెల్చుకుంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్కించుకోవడంతోపాటు పాకిస్తాన్‌ను చిత్తుచేస్తుంది. టెస్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది.

09/28/2016 - 00:03

ఏటూరునాగారం, సెప్టెంబర్ 27: వైద్య సౌకర్యం అందక ఓ గొత్తికోయ మహిళ చెట్టు కిందనే కవలలను ప్రసవించిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయ. ఏటూరునాగారం మండలంలోని శివాపురం పంచాయతీపరిధిలోని లింగాపురం గొత్తికోయగూడెంకు చెందిన మడవి పోసి పురిటినొప్పులతో బాధపడుతుండగా 108కు సమాచారం అందించారు.

09/28/2016 - 00:03

గోవిందరావుపేట, సెప్టెంబర్ 27: భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం చెరువు ఇప్పటికే మత్తడి పోస్తుండటంతో చెరువు అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. దయ్యాలవాగు, గుండ్లవాగు వరద ఉద్ధృతి కారణంగా టప్పమంచ, అమృతండా, చంద్రుతండా, రంగాపూర్ గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

09/28/2016 - 00:02

వరంగల్, సెప్టెంబర్ 27: భారీవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం లభించేలా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు జిల్లాయంత్రాంగాన్ని కోరారు. వారం రోజుల కిందట వరకు సరిగా వర్షాలు కురియక కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటే, ఇప్పుడు భారీవర్షాల కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

09/28/2016 - 00:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ జాతీయ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా కొనసాగి, పదవి నుంచి తప్పుకొన్న తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనైతికమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. సచిన్ తెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులపై పాటిల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అతను మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ విమర్శించాడు.

09/28/2016 - 00:00

పనాజీ, సెప్టెంబర్ 27: ప్రపంచ సాకర్‌ను శాసిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)కు ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా ఖాయం చేసిన అజెండాకు వ్యతిరేకంగా ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) తీర్మానాన్ని ఆమోదించడంతో, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫిఫా ఆత్మరక్షణలో పడింది. ఫిఫాలో ఆసియా నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండింది.

Pages