S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/02/2016 - 00:01

పర్చూరు, సెప్టెంబర్ 1: పెండింగ్ కేసులు సత్వరం పరిష్కరించాలని చీరాల డిఎస్పీ ప్రేమ్‌కాజల్ ఎస్సైను ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం డిఎస్పీ సందర్శించి రికార్డులు పరిశీలించారు. కేసుల పురోగతి ఎలా ఉందో ఎస్సై బి సోమశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించినట్లు డిఎస్సీ తెలిపారు.

09/02/2016 - 00:00

విజయనగరం, సెప్టెంబర్ 1: ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లవల్సి వస్తోందనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో అణిగిమణిగి ఉంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఈ కారణంగానే ప్రత్యేకహోదా విషయాన్ని కేంద్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి నోరు మెదపటం లేదని విమర్శించారు.

09/01/2016 - 23:59

విజయనగరం, సెప్టెంబర్ 1: గ్రామపంచాయతీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే, సర్పంచులపై వేధింపులు ఆపకుంటే రాష్టస్థ్రాయిలో ఆందోళనలు తప్పవని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల సమస్యలు, సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం అదనపు జెసి నాగేశ్వరరావుకు అప్పలనాయుడు వినతిపత్రం అందజేశారు.

09/01/2016 - 23:59

విజయనగరం, సెప్టెంబర్ 1: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకుండా పోయిందని లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా 90 శాతానికిపైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని అధికారులే నిర్థారించడాన్ని గమనిస్తే పాలకులు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఏమేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతోందన్నారు.

09/01/2016 - 23:59

గజపతినగరం, సెప్టెంబర్ 1: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ లీలావతి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో ఎంపిఇఓలకు మూడు రోజులు శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు యంత్ర పరికరాలను పంపిణీ చేశారు.

09/01/2016 - 23:58

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 1: పట్టణంలో శాంతినగర్‌లో బీసెంట్ స్కూల్‌కు వెళ్లే రోడ్డులో మద్యం దుకాణాలను మూసివేయాలని మహిళలు చేపడుతున్న నిరసన కొనసాగుతోంది. మహిళల నిరసన గురువారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఇక నుంచి షాపుల ముందు నిరవధిక ధర్నా చేయాలని నిర్ణయించారు. రెండుషాపుల ముందు గురువారం నిరవధిక ధర్నాను చేపట్టారు. అదే విధంగా వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/01/2016 - 23:57

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 1: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం పట్ల మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్తాచెదారాలు, కాలువలలో పూడిక పేరుకుపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఘోరమైన పరిస్థితులు మీరేమి చేస్తున్నారంటూ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మేస్ర్తిలపై మండిపడ్డారు.

09/01/2016 - 23:57

విజయనగరం, సెప్టెంబర్ 1: జిల్లా పోలీసు విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన నలుగురు పోలీసు అధికారులను ఎస్పీ కాళిదాసు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ వీడ్కోలులో ఘనంగా సన్మానించారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం ఎస్సై సూర్యనారాయణ, పోలీసు కంట్రోల్ రూమ్ ఎఎస్సై అప్పలరాజు, బొండపల్లి ఎఎస్సై సుదర్శనరావు, గుర్ల ఎఎస్సై మురళీధర్ గురువారం పదవీ విరమణ చేశారు.

09/01/2016 - 23:57

విజయనగరం(పూల్‌బాగ్), సెప్టెంబర్ 1: ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని లయన్స్ కమ్యూనిటీ హాలులో జరుగుతున్న ఆరాధన ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. సర్వారాయ హరికథా పాఠశాలకు చెందిన విద్యార్థినులు, ప్రముఖ హరికథకులు హరికథా గానం చేశారు.

09/01/2016 - 23:56

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 1: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రభుత్వం రంగానికి మేలు చేకూర్చవని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సెప్టెంబర్ 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గురువారం సాయంత్రం కోట కూడలి నుండి ఉద్యోగ సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి.

Pages