S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 23:50

పోలవరం, సెప్టెంబర్ 1: పట్టిసం ఎత్తిపోతల పథకంలో ఆరు మోటార్లను గురువారం తిరిగి ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాల కారణంగా బుధవారం మొత్తం మోటార్లను నిలిపివేశారు. తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరు మోటార్లు ఆన్‌చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

09/01/2016 - 23:49

శంఖవరం, సెప్టెంబర్ 1: హైస్కూలుకు చదువుకునేందుకు వెళుతున్న బాలికలను ఆటోలో కిడ్నాప్ చేశారనే ప్రచారం మండల కేంద్రం శంఖవరంతోపాటు పరిసర గ్రామాల్లోనూ గురువారం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వార్త గ్రామాల్లో దావానలంలా వ్యాపించడంతో విధ్యార్థినుల తల్లిదండ్రులు హైస్కూలుకు పరుగుపెట్టారు.

09/01/2016 - 23:48

విఆర్ పురం, సెప్టెంబర్ 1: మండల పరిధిలోని అన్నవరం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి గొడ్ల కన్నయ్య (16) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. మృతుని బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..కన్నయ్య స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చి కాళ్లు వాచాయి. రేఖపల్లి పిహెచ్‌సిలో వైద్యం చేయించారు.

09/01/2016 - 23:48

కాకినాడ, సెప్టెంబర్ 1: ఈ నెల 15వ తేదీ నుండి 2017 జనవరి 5వ తేదీ వరకు జరిగే సమ్మరీ రివిజన్‌లో జనవరి 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేయించుకోవాలని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జెసి కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో జాతీయ ఓటర్ల జాబితా ఫ్యూరిఫికేషన్‌పై ఇఆర్‌ఓ, ఎఇఆర్‌ఓలకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు.

09/01/2016 - 23:48

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 1: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకొని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా పిలుపునిచ్చారు. స్థానిక జెఎన్‌టియుకె అలూనీ ఆడిటోరియంలో గురువారం అంకురార్పణ కేంద్రాల్లో ఆవిష్కరణలపై మేథోమథనం అనే అంశంపై సదస్సును నిర్వహించారు.

09/01/2016 - 23:47

కాకినాడ, సెప్టెంబర్ 1: మాతా, శిశు మరణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల తోడ్పాటు, భాగస్వామ్యం అత్యవసరమని జిల్లా మహిళా, శిశు సంజీవిని ప్రోజెక్ట్ కో-ఆర్డినేటర్ హెచ్ శ్రీదేవి కోరారు. జిల్లాలో మాతా, శిశుమరణాలను తగ్గించే లక్ష్యంగా ఐసిడిఎస్, వైద్యరోగ్య శాఖ, మహిళా సమాఖ్యల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు.

09/01/2016 - 23:47

రావులపాలెం, సెప్టెంబరు 1: ఆర్థిక ఇబ్బందులో ఉన్న తమకు అప్పు ఇచ్చి ఆదుకున్న వృద్ధ మహిళను బంగారు ఆభరణాల కోసం పాశవికంగా హత్యచేసిన ఉదంతమిది. ఈ హత్యలో ఇద్దరు మహిళలు ప్రధాన పాత్ర పోషించగా, వారికి భర్తలు సహకరించారు. హత్య అనంతరం వృద్ధ మహిళ వద్ద ఉన్న 18 కాసుల బంగారు ఆభరణాలను చోరీచేసి ఆధారాలు దొరకకుండా ఎంతగా జాగ్రత్తపడినా చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యారు.

09/01/2016 - 23:46

రాయవరం, సెప్టెంబరు 1: అపరిశుభ్ర వాతావరణం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి ప్రబలుతోందని డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె చంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన రాయవరం పిహెచ్‌సి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 92 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు నిర్వహించే కార్డు పరీక్ష పద్ధతి వల్ల పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.

09/01/2016 - 23:46

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1: ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు.

09/01/2016 - 23:45

శంఖవరం, సెప్టెంబర్ 1: మండలంలోని కత్తిపూడిలోగల మినీ రవాణా కార్యాలయంలో 9999 నంబరు కోసం ప్రముఖులు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కత్తిపూడి చెక్‌పోస్టులో ఎపి05 డిబి 9999 నంబర్ కోసం ఐదుగురు పోటీపడ్డారు. దీనితో చెక్‌పోస్టులోనే సీక్రెట్ వేలం నిర్వహించారు.

Pages