S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 05:49

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 29: మన దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి రజనికి రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమెకు 25లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రజనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.25లక్షల చెక్కును అందచేశారు.

08/30/2016 - 05:46

విజయవాడ, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యకు చిరునామాగా మారనుంది. అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలు, అత్యాధునిక పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

08/30/2016 - 05:45

విశాఖపట్నం, ఆగస్టు 29: భూ ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా ఉండటంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపారు.

08/30/2016 - 05:45

చంద్రగిరి, ఆగస్టు 29: రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి రహిత శాఖగా తీర్చిదిద్దే విధంగా సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో 68 లక్షలతో నిర్మించిన చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

08/30/2016 - 05:44

ఆదోని, ఆగస్టు 29: ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాన్ని తిలకిచేందుకు భక్తులు పుట్టిలో వస్తుండగా తుంగభద్ర నదిలో అది మునిగిపోయింది. దీంతో ఒకరు గల్లంతయ్యారు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/30/2016 - 05:44

ఒంగోలు, ఆగస్టు 29: జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం 2.50గంటలనుండి మూడుగంటలలోపు రెండుసెకన్లపాటు భూమికంపించటంతో అన్నివర్గాల ప్రజలు భయాందోళన చెందారు. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట, గాంధీనగర్, సుజాతనగర్, రాజపానగల్‌రోడ్డు, దేవుడిచెరువు తదితర ప్రాంతాల్లో స్వల్పభూకంపం వచ్చింది. ఇటీవల కాలంలో తరుచుగా జిల్లావ్యాప్తంగా స్వల్పభూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

08/30/2016 - 05:43

తిరుపతి, ఆగస్టు 29: తెలుగు పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికి నెరవేర్చకపోతే చలో అమరావతి పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, భాషా ప్రియులతో కలిసి తామే తెలుగు భాష శిలాఫలకాలను ఏర్పాటు చేస్తామని ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా పరిరక్షకులు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు.

,
08/30/2016 - 05:22

హైదరాబాద్, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సత్యప్రకాష్ టక్కర్, రాజీవ్ శర్మ మరో మూడు నెలలపాటు అదే పదవుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

08/30/2016 - 05:19

ఎమ్మిగనూరు, ఆగస్టు 29: పవన్ కళ్యాణ్ జాగ్రత్త... నోరు అదుపులో పెట్టుకో, ముఖ్యమంత్రిపై అభాండాలు మోపితే మూల్యం చెల్లిచక తప్పదు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయం అంటే గడ్డం ఇడిచి గొరుక్కోవడం కాదన్నారు.

,
08/30/2016 - 05:18

సంగారెడ్డి, ఆగస్టు 29: నేరం రుజువై కోర్టు శిక్షలు విధించిన ఖైదీలు, నేరారోపణలు ఎదుర్కొంటూ రిమైండ్‌లో ఉన్న ఖైదీలు జైలులో ఏలాంటి శిక్షలను అనుభవిస్తారో, జైలు జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియజెప్పడానికి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో ముందడుగు వేసింది.

Pages