S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 06:55

విజయనగరం, ఆగస్టు 29: ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల నిర్వహణను ఇ-ఆఫీసు ద్వారా నిర్వహించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

08/30/2016 - 06:54

విజయనగరం, ఆగస్టు 29: ఇతర భాషలపై మక్కువ చూపుతున్న నేటితరం అమ్మభాష తెలుగును మరచిపోకూడదని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. యూరప్ దేశాలలో ఆయా ప్రాంతాల వారు స్థానిక భాషలోనే మాట్లాడతారని, ఇదే ఒరవడిని మనదేశంలో అవలంభిస్తే స్థానిక భాషలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

08/30/2016 - 06:54

విజయనగరం, ఆగస్టు 29: వర్షాభావంతో జిల్లాలో వ్యవసాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల విషయంలో మండల స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా చూడాలని తెలిపారు.

08/30/2016 - 06:53

పాచిపెంట, ఆగస్టు 29: మండలంలో గురువునాయుడుపేట-పాంచాళి మద్యలో గల వట్టిగెడ్డపై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సోమవారం శంకుస్థాపన చేశారు. ముందుగా భూమిపూజ చేశారు.

08/30/2016 - 06:51

ఏలూరు, ఆగస్టు 29 : భారతదేశం విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, యువత దృష్టిని ఈ అంశాల నుంచి మరల్చడానికి కుహనా జాతీయత పేరుతో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై హిందూత్వ వాదులు దాడులు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై ఆరోపించారు.

08/30/2016 - 06:51

ఏలూరు, ఆగస్టు 29: అవినీతిరహిత పాలన అందించడానికి ప్రతిఒక్కరూ ముందుకురావాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్ధాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో బరువుపెట్టనిదే పనులు కావనే విమర్శలకు తావివ్వకుండా ప్రతిఒక్కరూ నీతివంతమైన సేవలు అందించాలని కోరారు.

08/30/2016 - 06:50

ఏలూరు, ఆగస్టు 29 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు దీనికోసమే కష్టపడుతున్నారని టిడిపి రాష్ట్ర నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. హోదా విషయంలో ఎవరు కలిసి వచ్చినా వారితో కలిసి పోరాడేందుకు తామంతా సిద్ధంగా వున్నామని చెప్పారు.

08/30/2016 - 06:50

ఏలూరు, ఆగస్టు 29: కొత్త ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా కూడా పాత ఇళ్లకు మరమ్మతులు చేయించటం మినహా కొత్తగా ఒక ఇల్లు కట్టామని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. టిడిపి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన దగ్గరనుంచి ఇంతకుముందు ఉన్న ఇందిరమ్మ గృహాల స్ధానంలో ఎన్టీఆర్ గృహాల నిర్మాణ పథకం రంగప్రవేశం చేసింది.

08/30/2016 - 06:49

బుట్టాయగూడెం, ఆగస్టు 29: కల్తీలతో వినియోగదారుడు అన్నివిధాల నష్టపోతున్న ఈ రోజుల్లో మేలైన అటవీ ఉత్పత్తులతో తయారైన నాణ్యమైన వస్తువులను అందించి, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి సంచార దుకాణాలు ఎంతో తోడ్పడుతున్నాయని కోటరామచంద్రపురం గిరిజన సహకార సంస్థ (జిసిసి) సీనియర్ మేనేజర్ జి.రామారావు తెలిపారు.

08/30/2016 - 06:49

ఏలూరు, ఆగస్టు 29: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద జాబ్ కార్డు కలిగిన ప్రతీ వ్యవసాయ కూలీకి బ్యాంకు అకౌంట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంపిడివోలను ఆదేశించారు.

Pages