S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 13:56

చెన్నై: శుక్రవారం ఉదయం తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గల్లంతయ్యింది. ఉదయం 8.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్‌-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్‌తో పాటు తీర రక్షక, నౌకాదళాల బృందాలు గాలిస్తున్నాయి. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా? దారి మళ్లిందా ?

07/22/2016 - 12:29

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి కృష్ణాడెల్టాను ఆదుకున్నామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. కృష్ణాడెల్టా ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు, అధికారులతో ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పంటలు సమృద్ధిగా పండి పల్లెల్లో పండగ శోభ నెలకొనడం ఖాయమన్నారు. ప్రతి రైతు కళ్లలో ఆనందం కనపడాలన్నదే తన ధ్యేయమన్నారు.

07/22/2016 - 12:28

నల్గొండ: పిల్లాయిపల్లి కాల్వ ద్వారా తమ పొలాలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద రైతులు మంత్రి కాన్వాయ్‌ను నిలిపివేసి తమ సమస్యలను తెలిపారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రిని రైతులు అడ్డగించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

07/22/2016 - 12:27

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. తమ పొలాలకు నీళ్లు వస్తాయా? రావా? అని కొందరు, తమ ప్రాంత భూములకు తగిన నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

07/22/2016 - 12:27

విజయవాడ: చిట్టీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసిన ఓ మహిళ కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నూజివీడులో నాగరత్నం అనే మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది నుంచి కోటిరూపాయల మేరకు వసూలు చేసింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగరత్నం ఇంటి ముందు వారు ధర్నాకు దిగారు.

07/22/2016 - 12:26

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లను తక్షణం తొలగించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. తన హోర్డింగ్‌ల విషయంలోనూ మినహాయింపు ఇవ్వనక్కర్లేదన్నారు. అక్రమ హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.

07/22/2016 - 12:26

గాంధీనగర్: గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం నాడు ఉనాలో బాధిత దళితులను పరామర్శించారు. దళిత వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

07/22/2016 - 12:25

దిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎంపీలు సభలోనే ఉండాలని టిడిపి, బిజెపి విప్ జారీ చేశాయి. తన పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇదివరకే విప్ జారీ చేసింది. ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టిడిపి నేతలు ఇప్పటికే ప్రకటించగా, బిజెపి వైఖరి ఇంకా బహిర్గతం కాలేదు.

07/22/2016 - 07:38

విజయనగరం, జూలై 21: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాళిదాసు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సిఐలతో జిల్లావ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు.

07/22/2016 - 07:37

విజయనగరం, జూలై 21: జిల్లాలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. గ్రామ పంచాయతీల తీర్మానంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులను మహిళా సంఘాలకు అప్పగించి అక్కడ చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో మత్స్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

Pages