S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 02:50

విశాఖపట్నం, జూలై 19: వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 9.55కు బయలుదేరి అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10 గంటలకు పూడి వద్ద ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్‌కు చేరుకుంటారు.

07/20/2016 - 02:49

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 19: క్రెడిట్ కార్డును గుర్తు తెలియని వ్యక్తి వినియోగించి తమను మోసం చేసారని చినరాజుపేటకు చెందిన అలంకారాము పట్టణ పోలీస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసారు. సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలు ప్రకారం ఈ నెల 15న గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్‌చేసి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు తమకు తెలియజేయలన్నారు.

07/20/2016 - 02:42

విజయవాడ, జూలై 19: వెనకబడిన తరగతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేస్తున్నామని గుర్తు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నియమించిన బిసి ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులతో సమావేశం నిర్వహించారు.

07/20/2016 - 02:42

పెనమలూరు, జూలై 19: సనాతన భారత సంస్కృతిలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనదని ప్రముఖ యోగాచార్యులు వెంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. మంగళవారం గురుపూర్ణిమ సందర్భంగా గోసాలలో నిర్వహించిన గురు పూజా మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింపచేసేవారు, కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను ఆచరిస్తూ శిష్యుల చేత ఆచరింప చేసేవారే ఉత్తమ గురువులన్నారు.

07/20/2016 - 02:39

మచిలీపట్నం, జూలై 19: చేనేత కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాంప్రసాద్ విమర్శించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికులతో కలిసి ధర్నా చేశారు.

07/20/2016 - 02:38

నాగాయలంక, జూలై 19: పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీరామపాద క్షేత్రం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.

07/20/2016 - 02:38

మచిలీపట్నం, జూలై 19: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక రేవతి సెంటరు సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన బందరు నియోజకవర్గ బిజెపి కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

07/20/2016 - 02:37

పెనుగంచిప్రోలు, జూలై 19: పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం జరిగింది.

07/20/2016 - 02:37

తోట్లవల్లూరు, జూలై 19: రైతులకు ఆసరా కల్పించే దిశగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉంటుందని విజయవాడ డివిజన్ వ్యవసాయ శాఖ ఎడిఎ సునిల్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పిఎసిఎస్ కార్యదర్శులకు పిఎంఎఫ్‌బివై పథకంపై అవగాహన కల్పించారు.

07/20/2016 - 02:36

అవనిగడ్డ, జూలై 19: పుష్కరాల పుణ్యమా అని దివిసీమలోని ఆలయాల్లోని విశిష్ఠతలు, కట్టడాలు, శిల్పకళా నైపుణ్యాలు వెల్లడవుతున్నాయి. దివిసీమలోని ఆలయాలన్నీ దాదాపుగా చోళరాజుల కాలంలో నిర్మించారు. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు శిల్పాలను అందంగా తీర్చిదిద్దారు. కాగా కాలక్రమంలో ఈ ఆలయాలన్నీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్లడంతో వాటి విశిష్టత మసకబారింది.

Pages