S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 03:03

ఎల్‌బినగర్, జూలై 19: ఎల్‌బినగర్ సర్కిల్ 3ఎ,3బి పరిధిలోని పెన్షన్ దారులు తమ వేలిముద్రలు, ఐరిస్‌లను మీసేవ లేదా ఈ-సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని సర్కిల్ 3ఎ, 3బి డిప్యూటీ కమిషనర్‌లు శ్రీనివాస్‌రెడ్డి, పంకజ తెలిపారు.

07/20/2016 - 03:03

సరూర్‌నగర్, జూలై 19:ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని బడంగ్‌పేట్ టౌన్ ప్లానింగ్ అధికారి టిహెచ్.విజయశ్రీ హెచ్చరించారు. మంగళవారం బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.

07/20/2016 - 03:02

ఖైరతాబాద్, జూలై 19: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని ఏపి ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, రామకృష్ణ, శివాజీ, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తితోనే ఏపి అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడతాయన్నారు.

07/20/2016 - 03:01

హైదరాబాద్, జూలై 19: ఆషాఢ మాసంలో తెలంగాణలో అత్యంత ఘనంగా జరిగే బోనాల ఉత్సవాలకు సంబంధించి నగరంలోని వివిధ దేవాలయాల ఆవరణలో ఏర్పాట్ల నిమిత్తం మహానగర పాలక సంస్థ రూ. 7 కోట్లతో పనులు చేపట్టినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాతబస్తీ ఇతరత్ర వివిధ దేవాలయాల్లో భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా చేపట్టిన వౌలిక వసతుల కల్పన పనులను తనిఖీ చేశారు.

07/20/2016 - 03:01

హైదరాబాద్, జూలై 19: మహానగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై సాయంత్రం అయిదు గంటలకు వర్షంగా మారింది. సరిగ్గా ఆఫీసు ముగిసే సమయానికి, విద్యా సంస్థలు విద్యార్థులను వదిలేసే సమయానికి వర్షం దంచికొట్టడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలయారు. నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లు జలమయమయ్యాయి.

07/20/2016 - 03:00

వనస్థలిపురం, జూలై 19: గురుపౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాలలో భక్తులు అధిక సఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయప్రాంగణంలో చక్కటి ఏర్పాట్లను చేశారు. వనస్థలిరం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు.

07/20/2016 - 03:00

పరిగి, జూలై 19: బోగస్ టీచర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పరిగి డివిజన్ కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం పరిగిలో బోగస్ టీచర్లను తొలిగించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బోగస్ టీచర్ల అంశంపై గత 16నెలలుగా చర్చ జరుగుతోందన్నారు.

07/20/2016 - 03:00

హైదరాబాద్, జూలై 19: భారతీయ జనతాపార్టీకి చెందిన నగరంలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంగళవారం బర్కత్‌పురాలోని పార్టీ ఆఫీసులో డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.

07/20/2016 - 02:59

హైదరాబాద్, జూలై 19: శ్రీకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో మంగళవారం నటరాజ కళా మందిరంలో గురువులకు నృత్య నీరాజనం జరిగింది. తొలుత నృత్యం నేర్చుకుంటున్న ఔత్సాహిక కళాకారులు నటరాజ స్వామికి పుష్మాంజలి సమర్పించి నాట్యాచార్యులకు పాదపూజ చేసి గురు సత్కారం చేశారు. నృత్య కార్యక్రమంలో కేరళకు చెందిన గురువయ్యారు నాట్యమండలి ‘శ్రీకృష్ణ లీలామృతం’ నృత్య నాటిక సమర్పించారు.

07/20/2016 - 02:59

హైదరాబాద్, జూలై 19: గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు, అధికారుల విధుల నిర్వహణలో అలసత్వం.. ఫిర్యాదులు వచ్చినా చూసీ చూడనట్లుగా వ్యవహరించే అధికారులపై వేటు వేసేందుకు జిల్లా పంచాయతీ శాఖ నడుం బిగించింది.

Pages