S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 02:36

కూచిపూడి, జూలై 19: మొవ్వ మండలం గూడపాడు దళితవాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు నిత్యం ఆందోళనతో తల్లడిల్లుతున్నారు. ఈ పాఠశాల సమీపంలోని జగ్జీవన్‌రామ్, అంబేద్కర్‌నగర్ మధ్య అర కిలోమీటర దూరంలో నిర్మించారు. పొలాల మధ్య, పంట కాలువ సమీపంలో ఉన్న ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు దళితులే.

07/20/2016 - 02:35

ముదినేపల్లి, జూలై 19: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ముదినేపల్లి మాంసం కొట్లు మార్కెట్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నం మండలం తాళ్ళపాలేనికి చెందిన పసుపులేటి లక్ష్మణరావు(60) బుధవారం ఉదయం ముదినేపల్లి మార్కెట్ వద్ద మృతి చెంది ఉన్న సమాచారాన్ని విఆర్‌ఏ విఆర్‌ఓకు అందించాడు. ముదినేపల్లి-2 విఆర్‌ఓ వి మధుసూదనరావు ఈమేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

07/20/2016 - 02:35

ఎ కొండూరు, జూలై 19: మండలంలోని కోడూరు గ్రామంలో ఈ నెల 12న వంట చేస్తుండగా జరిగిన స్టౌ ప్రమాదంలో గాయపడిన గృహిణి మంగళవారం మృతి చెందింది. గ్రామస్తుడు రవి భార్య నీలవేణి(30) వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్టౌ పేలటంతో తీవ్ర గాయాల పాలైంది. ఆమెను బంధువులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది.

07/20/2016 - 02:34

కూచిపూడి, జూలై 19: శ్రీ సీతారాం గురుంభజే.. అంటూ నిత్యం భక్తులు కొలిచే ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులను గురుపూర్ణిమ సందర్భంగా పూజించేందుకు భక్తులు శ్రీకృష్ణాశ్రమానికి తరలివచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో మంగళవారం శ్రీ సీతారాం గురుదేవులు తమ శిష్యుల పూజలు అందుకున్నారు.

07/20/2016 - 02:34

ఇబ్రహీంపట్నం, జూలై 19: మూడు రాష్ట్రాల వినియోగం అనంతరం మిగిలిన కృష్ణా జలాలు మాత్రమే మనకు వచ్చేవని, వీటి ద్వారానే సాగు, మంచినీటి అవసరాలు తీర్చే పరిస్థితులను ముందుగానే గ్రహించి, నదుల అనుసంధానంతోనే మన ఇబ్బందులను ఎదుర్కొనగలమని భావించి, పట్టిసీమకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర కృష్ణా, గోదావరి సంగమం ప్రాంతంలో మంగళవారం సిఎం పూజలు చేశారు.

07/20/2016 - 02:33

పెనమలూరు, జూలై 19: రాష్ట్ర ఖజానాకు ఆదాయం తీసుకొచ్చే కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ తొలి త్రైమాసికంలో వెయ్యి కోట్ల రూపాయల వరకు పన్ను మొత్తం వెనకబడిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం కానూరు పరిధిలోని మన కల్యాణ మండపంలో జరిగిన రెండు రోజుల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

07/20/2016 - 02:32

విజయవాడ, జూలై 19: రాష్ట్రంలో సీనియర్ పోలీసు అధికారులు, ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో అడిషినల్ డిజిలుగా పనిచేస్తున్న నలుగురికి డిజిలుగా పదోన్నతి లభించింది. వీరి పదోన్నతులకు కేంద్ర యుపిఎస్‌సి బోర్డు పచ్చజెండా ఊపింది. నేడో రేపో జీఓ రావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, ఆర్‌పి ఠాగూర్, మాలకొండయ్య, వినయ్‌జింత్ రేకు ప్రమోషన్ లభించింది.

07/20/2016 - 02:32

కంకిపాడు, జులై 19: కంకిపాడు మండలం పునాదిపాడు శివారులో సినీ ఫక్కీలో సోమవారం రాత్రి 17 లక్షల 50 వేలు చోరీ జరిగింది. తాము ఇన్‌కమ్‌టాక్స్ అధికారులమని కారులో ప్రయాణిస్తున్న వారిని ఆపి సొమ్ము దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కైకలూరు వెలమపేటకు చెందిన చొక్కపు శ్రీనివాసరరావు చేపల వ్యాపారం చేస్తుంటారు.

07/20/2016 - 02:31

ఇబ్రహీంపట్నం, జూలై 19: దేశంలోనే ప్రప్రథమంగా పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం జరిగి, గోదావరి, కృష్ణా నదులు కలిసిన పవిత్ర ప్రాంతంలో శాశ్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు. ఇబహ్రీంపట్నంలోని పవిత్ర సంగమ ప్రాంతంలో మంగళవారం అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హారతులు ఇచ్చారు.

07/20/2016 - 02:31

ఇంద్రకీలాద్రి, జూలై 19: కనకదుర్గమ్మ మంగళవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ప్రత్యేక అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోడానికి వేకువజాము నుండే భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. వర్షాలు సకాలంలో పడి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ కనకదుర్గమ్మ మూడు రోజులు శాకంబరీదేవి అలంకారంతో భక్తులకు కనువిందు చేశారు.

Pages