S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/19/2016 - 17:51

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మోడల్‌ కందిల్‌ బలోచ్‌ను హత్య చేసిన ఆమె సోదరుడిని కుటుంబ సభ్యులు క్షమించొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ కుటుంబం పరువు తీస్తోందని బలోచ్‌ను హత్య చేసినట్లు ఆమె సోదరుడు మహమ్మద్‌ వసీం అంగీకరించాడు. పాకిస్థాన్‌లో పరువు హత్యలు అధికంగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులు క్షమించడంతో నిందితులు శిక్ష పడకుండా బయటపడుతున్నారు.

07/19/2016 - 17:17

ఏలేశ్వరం : ఎర్రవరం దగ్గర పోలీసులు మంగళవారం 635 కిలోల గంజాయిని పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

07/19/2016 - 17:14

ఢిల్లీ: గత మూడేళ్ళలో మతపరమైన విద్వేష కేసులు పెరిగినట్లు, విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం జరిగిందన్నారు.

07/19/2016 - 16:26

బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారం మధ్యాహ్నం కారును లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

07/19/2016 - 16:22

ముంబయి: నేడు స్వల్ప లాభాలతో దేశీయ మార్కెట్లు ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 27,787 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,528 వద్ద ముగిసింది.

07/19/2016 - 16:20

దిల్లీ: నిన్న రూ.200 తగ్గి రెండు వారాలు కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర ఈరోజు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర పైకి వెళ్లింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.30,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగి రూ.46,330కి చేరుకుంది.

07/19/2016 - 16:17

దిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌కు తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో తాము న్యాయపరంగా ముందుకు పోతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆరెస్సెస్‌కు క్షమాపణ చెబుతారా? లేక విచారణను ఎదుర్కొంటారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.

07/19/2016 - 16:17

విశాఖ: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడిచేసి ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకుపోయిన సంఘటన అనకాపల్లిలో జరిగింది. దేవుడమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని దొంగలు సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఆమె శరీరంపై ఉన్న ఏడు తులాల నగలను దోచుకుని వారు ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన దేవుడమ్మను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

07/19/2016 - 16:16

విజయవాడ: రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా ఎంతగా ప్రయత్నించినా తాను మరింతగా దూసుకుపోతానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. నిజానికి వైకాపా ఓ పనికిమాలిన పార్టీ అని ఆయన మంగళవారం ఘాటుగా విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు సాధ్యం కాదంటూ వైకాపా నేతలు ఎన్ని సమస్యలు సృష్టించినాసరే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపానని ఆయన అన్నారు.

07/19/2016 - 16:16

హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూ సేకరణ రైతుల పాలిట శాపంగా మారందని, నిర్వాసితులకు నష్టపరిహారంపై సిఎం కెసిఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు ఇచ్చితీరాల్సిందేనని మంత్రి హరీష్‌రావు రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల కోసం పాదయాత్రలు చేసేవారిని పోలీసుల ద్వారా అణచివేస్తున్నారని తమ్మినేని అన్నారు.

Pages