S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/19/2016 - 07:26

ఏలూరు, జూలై 18: కొద్దిరోజులుగా వర్షాకాలంలోనూ మండే ఎండలు జనాన్ని మాడ్చేస్తూ వచ్చాయి. వరుణుడి కరుణ దూరమైందని జనం అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులు అలుముకుని రాత్రి 6గంటల తర్వాత భారీవర్షం కురవటం మొదలుపెట్టింది. అలా దాదాపు రెండు,మూడు గంటల వరకు కొనసాగటమే కాకుండా ఆతర్వాత కూడా ఒక మోస్తరు వర్షం కొనసాగింది.

07/19/2016 - 07:22

నరసన్నపేట, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పలు పథకాల ద్వారా నిరుపేదలను ఆదుకుంటుందని, వీటి అమలులో తప్పనిసరిగా పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

07/19/2016 - 07:21

సీతంపేట, జూలై 18: వర్షాలు విస్తారంగా కురుస్తున్న దృష్ట్యా పంచాయతీ, వైద్యశాఖ ఎఎన్‌ఎంలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు ఆదేశించారు. స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో సోమవారం పంచాయతీ సెక్రటరీ, ఎఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించారు.

07/19/2016 - 07:21

శ్రీకాకుళం(రూరల్), జూలై 18: ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా అసంఘటిత రంగం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో సోమవారం ఏడు పంచాయితీలకు సంబంధించిన మహిళా సంఘ సభ్యులకు చంద్రన్న బీమా పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

07/19/2016 - 07:20

సారవకోట, జూలై 18: ప్రజాభిమానం చూరగొన్న ప్రియతమ నాయకుడు అకాల మరణం పొందిన నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, వైసిపి రాష్టక్రమిటీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ఇటీవల మృతి చెందిన మాజీ జెడ్పిటీసీ చిన్నాలరామసత్యన్నారాయణ స్మృతి చిహ్నంగా సోమవారం కుమ్మరిగుంటలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు.

07/19/2016 - 07:19

శ్రీకాకుళం, జూలై 18: మన్యంలో జ్వరాలను అదుపులో పెట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులకు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు.

07/19/2016 - 07:19

శ్రీకాకుళం, జూలై 18: వంశధార రెండో దశ పనులు మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వంశధార నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలకు ప్రభుత్వం రూ. 421 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ఇక్కడ జెడ్పీ సమావేశమందిరంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్న ప్రభుత్వం చేపుడుతున్న చర్యలను వివరించారు.

07/19/2016 - 07:15

గజపతినగరం, జూలై 18: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్ర్తినిధి ద్వారా వంద కోట్ల రూపాయలు రుణం ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని స్ర్తినిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ చెప్పారు. సోమవారం మెంటాడ వెలుగు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంతవరకు 30 గ్రూపులకు ఆరు కోట్ల రూపాయలు అందజేశామని తెలిపారు. 2015-16లో 782 గ్రూపులకు 32కోట్ల రూపాయలు రుణాలు అందజేశామని తెలిపారు.

07/19/2016 - 07:14

పార్వతీపురం, మే 18: సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.ప్రసన్నవెంకటేష్ కోరారు. సోమవారం తన కార్యాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మలేరియా, డమేరియాతో తదితర వ్యాధులు పట్ల చాలా అప్రమత్తత అవసరమన్నారు. ఏజెన్సీ ప్రజలు ఎలాంటి వ్యాధులు బారినపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

07/19/2016 - 07:14

విజయనగరం (్ఫర్టు), జూలై 18: విజయనగరం పట్టణంలో 47వేల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. ఇందులో 25వేల మొక్కలను పట్టణ ప్రజలకు పంపిణీ చేస్తామని అన్నారు. మిగతా మొక్కలను ప్రభుత్వ స్థలాలు, పార్కులు, మున్సిపల్ పాఠశాలలో నాటుతున్నామని చెప్పారు. పట్టణంలో కాటవీధిలో సోమవారం మొక్కలను నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Pages