S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:17

గుంటూరు, జూలై 17: అభివృద్ధి కంటే అవినీతిలో దూకుడు పెంచిన పాలకులకు రానున్న రోజుల్లో ప్రజలు కళ్లెం వేసి అధికారాన్ని కలగా మార్చనున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

07/18/2016 - 02:16

చేబ్రోలు, జూలై 17: ప్రజలను ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన గ్రామ పంచాయతీ పాలకవర్గం కనీసం ప్రజలకు శుద్ధమైన మంచినీటిని కూడా అందించలేక పోతోంది. కోట్లాది రూపాయలతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించినప్పటికీ అవి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడం లేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గ బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ ప్రజానీకానికి రక్షిత మంచినీరు మృగ్యమైంది.

07/18/2016 - 02:16

అమరావతి, జూలై 17: అమరావతి పరిసర గ్రామాల్లో ఆదివారం మధ్యా హ్నం ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. సుమారు 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మండల కేంద్రమైన అమరావతిలోని రాజీవ్, జైల్‌సింగ్, బండచేను కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. ముత్తాయపాలెం వద్ద వాగు పొంగిపొరళి రాకపోకలకు ఇబ్బంది కలిగించింది.

07/18/2016 - 02:15

అమరావతి, జూలై 17: పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఈనెల 21 ఉదయం 9 గంటల నుండి 2 గంటలలోపు సామూహికంగా 3.36 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఆదివారం ధరణికోట జెబి గార్డెన్స్ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

07/18/2016 - 02:15

గుంటూరు (కొత్తపేట), జూలై 17: మారుతున్న ప్రస్తుత సమాజంలో వేగంతో పాటు భద్రత కూడా ప్రధాన భూమిక వహిస్తుందని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి మన్ననలు పొందాలని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గుంటూరు 1,2 డిపోల్లో గేట్ మీటింగ్‌లను నిర్వహించారు.

07/18/2016 - 02:14

పెదకూరపాడు, జూలై 17: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అధిక వ్యయ ప్రయాసలతో మిరప నారుమళ్లు పెంచేందుకు రైతాంగం పలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వర్షం కొంతమేర ఊరటనిచ్చింది. గత 20 రోజులుగా వర్షం లేక అధిక ఉష్ణోగ్రతలు ఉండుట వలన విత్తిన పత్తిపంట మిరపనారుమళ్లు ఎండుముఖం పట్టాయి.

07/18/2016 - 02:14

గుంటూరు (కల్చరల్), జూలై 17: బృందావన వెంకన్న సన్నిధిలో అన్నమయ్య కళావేదికపై ఆదివారం రాత్రి గుంటూరు హ్యూమర్‌క్లబ్ సభ్యులు సమర్పించిన హాస్యవల్లరి పెద్దసంఖ్యలో విచ్చేసిన ప్రేక్షక జనావళిని కడుపుబ్బ నవ్వించింది.

07/18/2016 - 02:13

మంగళగిరి, జూలై 17: ఉడ్ కార్మికులు తమ వృత్తిని కొనసాగించుకునేందుకు ప్రభుత్వం పట్టణంలో స్థలం కేటాయించాలని ఎఐటియుసి జిల్లా కా ర్యదర్శి వెలుగూరి రాధాకృష్ణ డిమాండ్‌చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ కా ర్యాలయంలో ఉడ్ టర్నింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఎన్ రామస్వా మి అధ్యక్షతన జరిగింది.

07/18/2016 - 02:13

పొన్నూరు, జూలై 17: కార్పొరేట్ సంస్థల్లో వివిధ రకాల కెమికల్స్‌తొ తయారుచేసిన పెయింటింగ్స్ వేస్తున్న కార్మికులకు ఆరోగ్యం కునారిల్లుతున్న నేపథ్యం లో వారికి ఎన్‌టిఆర్ వైద్య సేవ కార్డులు అందించాలని వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి హెర్నేజర్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఎఐటియుసి కా ర్యాలయంలో సంఘ నాయకుడు ఆరేటి రామారావు నేతృత్వంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/18/2016 - 02:13

మాచర్ల, జూలై 17: ప్రమాదవశాత్తు నడుపుతున్న లారీకి విద్యుత్ వైర్లు తగిలి డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణ శివారులోని రాయవరం జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తె రాయవరం జంక్షన్ సమీపంలోని కోళ్ళ ఫారంలో కోడి పెంటను లోడు చేసేందుకు దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ముటుకూరు పెద అమరయ్య పది మంది కూలీలతో కలసి వెళ్లాడు.

Pages