S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:24

ఖానాపురం హవేలి, జూలై 17: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో హరితహారం కార్యక్రమంలో ఆటోవర్కర్స్‌కు మొక్కలు పంపిణీ చేశారు.

07/18/2016 - 02:23

ఖమ్మం, జూలై 17: ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నది. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన తర్వాత అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయనున్నది.

07/18/2016 - 02:22

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 17: రాష్ట్రంలోనే అత్యధిక మంది కార్మికులు కలిగి ఉన్న కార్పొరేషన్‌గా గుర్తింపు ఉన్న ఆర్టీసి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం వరకు ఖమ్మం రీజియన్‌లోని అన్ని ఆర్టీసి డిపోల్లో ఆయా సంఘాల నేతలు భారీ ప్రచారం నిర్వహించారు.

07/18/2016 - 02:22

కొత్తగూడెం, జూలై 17: పివికె-5 ఇంక్లైన్ గనిలోకి కార్బన్‌డయాక్సైడ్‌ను పంపించే ప్రక్రియను ఆదివారం అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించి బోరుబావుల తవ్వకాలు శనివారం ప్రారంభమయ్యాయి. పలుచోట్ల గని ఉపరితలంపై పలుచోట్ల తవ్వకాలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రెండు బోరుబావుల తవ్వకాలు పూర్తయ్యాయి. ఇందులో ఒకటి మాత్రం ఫలితాన్నిచ్చింది.

07/18/2016 - 02:21

నేలకొండపల్లి, జూలై 17: హరితహరంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటేందుకు రాష్ట్ర రోడ్డ్భువనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేలకొండపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు విద్యార్థులతో స్వాగతం పలికించేందుకు ఎండలో గంటల తరబడి ఉంచారు. మంత్రి కార్యక్రమానికి ఆలస్యం కావటంతో విద్యార్థులు సుమారు రెండు గంటల పాటు ఎండలో వేచి ఉన్నారు.

07/18/2016 - 02:21

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 17: ప్రతి ఒక్కరు నిసహాయులకు సహాయం చేసే గుణం అలవరుచుకోవాలని ఇంటిలిజెన్స్ డిఎస్పీ బాలకిషన్, ప్రముఖ వైద్యులు రాజేష్‌గార్గెలు అన్నారు. ఆదివారం స్థానిక కెమిస్ట్ భవన్‌లో ఖమ్మం నగర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసీమియ వ్యాధిగ్రస్థ పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

07/18/2016 - 02:21

కామేపల్లి, జూలై 17: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంటింటా మొక్కలు అందించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ లోకేష్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొత్తలింగాల, తాళ్ళగూడెం గ్రామాలలో సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను కలెక్టర్ లోకేష్‌కుమార్, ఐటిడిఏ పిఓ రాజీవ్‌గాంధీ హన్మంతు సంయుక్తంగా అకస్మికంగా సందర్శించారు.

07/18/2016 - 02:20

నేలకొండపల్లి, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహరం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి పచ్చని తెలంగాణకు పాటుపడుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, హరితహరం కింద మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/18/2016 - 02:20

బోనకల్, జూలై 17: భూస్వాములు, కాంట్రాక్టర్లు, ఫ్యాక్షనిస్టుల కోసమే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, పేద ప్రజల సంక్షేమాన్ని కెసిఆర్ సర్కార్ గాలికి వదిలేసిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మండల పరిధిలోని రావినూతల గ్రామ సర్పంచ్ షేక్ వజీర్ నివాసరంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

07/18/2016 - 02:18

గుంటూరు, జూలై 17: పుష్కరాల నేపథ్యంలో విగ్రహాల విధ్వంస రచన గుంటూరును తాకింది. ఇప్పటి వరకు విజయవాడలో మతాల కతీతంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో గుంటూరులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రోడ్ల విస్తరణలో భాగంగా మునిసిపల్ అధికారులు ఏటుకూరు రోడ్డులోని పురాతన ఆలయంతో పాటు మార్కెట్ సెంటర్ వద్దలగ ప్రాచీనమైన మస్తాన్ దర్గా పరిసరాల్లో ఆదివారం మరోసారి మార్కింగ్ ఇచ్చారు.

Pages