S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:51

దొరవారిసత్రం, జూలై 17: 16వ నెంబర్ జాతీయ రహదారిపై కలగుంట బ్రిడ్జి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మువ్వా భవాని (48), ధరణీ నరేష్ (30) మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

07/18/2016 - 02:50

వెంకటాచలం, జూలై 17 : కంటైనర్ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని ఆర్‌టిసి జోనల్ కళాశాల సమీపంలో వెంకటాచలం దగ్గర జాతీయ రహదారిపై అదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన నేరెళ్లపల్లి కిరణ్‌కుమార్‌రెడ్డి, దొంతం కిషన్‌రెడ్డి, బస్సు అంజన్‌రెడ్డి, ఎట్టెం రాజశేఖర్‌రెడ్డి మంచి ప్రాణస్నేహితులు.

07/18/2016 - 02:48

ప్రత్యేకంగా ఏ వాదాన్నీ కాకుండా, ఇంకా చెప్పాలంటే మానవతావాదాన్ని పెంచే రచనల్ని బలివాడ కాంతారావు చేశారు. నేవీలో పనిచేస్తూ ఆయన మనదేశంలో విభిన్న అపదేశాల్ని చూశారు. సంస్కారాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఈ అనుభవంతో రాశారు కాబట్టి ఆయన రచనల్లో మనదేశమంతా కనిపిస్తుంది.

07/18/2016 - 02:46

భారతదేశపు దురదృష్టమేమోగాని మన పార్టీలన్నీ సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ చెలగాటాలాడుతున్నాయి. అధికార కాంక్షతో ఇతర రాష్ట్రాలలో ఇటువంటి క్రీడలాడితే వారికింకా ప్రజాస్వామిక పరిణతి రాలేదని సరిపెట్టుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం ఇన్ని దశాబ్దాలు గడిచినా అటువంటి పరిణతి ఇంకా కలగకపోవటం విచారకరమే అయినా, అందువల్ల కనీసం దేశ సమగ్రతకు, సమైక్యతకు ముప్పు ఉండదు గనుక ఆమేరకు ఉపేక్షించవచ్చు.

07/18/2016 - 02:43

అం తర్గత భద్రతకు అవరోధాలు ఏర్పడుతుండడం శనివారంనాడు న్యూఢిల్లీలో, రాష్టప్రతి భవనం ప్రాంగణంలో జరిగిన ‘అంతర్ రాష్ట్ర మండలి’ సమావేశానికి నేపథ్య వైపరీత్యం! ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాల మధ్య నిఘా విభాగాల మధ్య సమన్వయం పెంపొందాలన్నది ఆయన ప్రసంగంలోని ప్రధాన ఇతివృత్తం!

07/18/2016 - 02:42

ఆదోని, జూలై 17:తుంగభద్ర డ్యాం నుండి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేయలేదు. బసాపురం ట్యాంకులో నీరు ఖాళీ అవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నీటి ఎద్దడిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదు రోజులకు ఒక్కసారి తాగునీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు.

07/18/2016 - 02:42

కర్నూలు, జూలై 17 : కృష్ణా పుష్కరాల పనులు జరగుతున్న తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం కర్నూలులో సమీక్షిస్తారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉదయం 11గంటలకు కర్నూలు చేరుకుని కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో శ్రీశైలం, సంగమేశ్వరంలలో పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు సమీక్షా సమావేశం ఉంటుందని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు.

07/18/2016 - 02:41

కర్నూలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ ఆదివారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అందులో భాగంగా సిఎం పర్యటించే కర్నూలు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.

07/18/2016 - 02:41

మంత్రాలయం, జూలై 17:ప్రభుత్వ నిబంధనలకు పాతర వేసి ఇసుక బకాసురులు జేసిపిలతో తవ్వి భూగర్బ జలాలను ఎండ గడుతున్న సంబందిత అధికారులు పట్టించుకోవటంలేదు. నియోజకవర్గ కేంద్రమైన మం త్రాలయంలోని తుంగభధ్ర నదిలో రోజు వందలాది ట్రాక్టర్లు ఇసుకను ఇతర పట్టణాలకు తరలిస్తున్నారు.

07/18/2016 - 02:40

ఆదోనిటౌన్, జూలై 17:అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగి నష్టపోయిన బాధితులను, ప్రజలను ఆదుకోవడంలో సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫ లం చెందిందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే స్వగృహం వద్ద గత నెలలో ఇఏస్‌ఐ ఆసుపత్రి వద్ద గడ్డివాములు కాలిపోయిన బాధితులకు వైకాపా నాయకులు కృష్ణమోహన్ తన వంతు గా రూ.

Pages