S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 06:41

ఇండోర్/అహ్మదాబాద్, మే 17: గుజరాత్ ముఖ్యమంత్రిగా వేరొకర్ని నియమించేందుకు బిజెపి కసరత్తు చేస్తోదంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి ఆనందిబెన్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదనీ, ఈ పుకార్లన్నీ ఊహాగానాలేనని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు విచ్చేసిన సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆనందిబెన్ పైవిధంగా స్పందించారు.

05/18/2016 - 06:40

లక్నో, మే 17: సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ మంగళవారం తిరిగి ఆ పార్టీలో చేరారు. అమర్ సింగ్ పార్టీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని బట్టి ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు అర్థమవుతోంది. అయితే అమర్ సింగ్ పార్టీలో చేరడం సమాజ్‌వాది పార్టీలో ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశముంది.

05/18/2016 - 06:39

న్యూఢిల్లీ, మే 17: రాష్ట్ర అధికారులు జారీచేసే వికలాంగుల సర్ట్ఫికెట్లు త్వరలోనే దేశమంతటా చెల్లుబాటవుతాయి. వికలాంగుల హక్కు బిల్లు-2014 ముసాయిదాలో ఈ మేరకు ఒక నిబంధనను చేర్చారు. సంప్రదింపులకోసం ఈ బిల్లును ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించారు. ‘కొత్త బిల్లులో ప్రభుత్వం ఒక నిబంధనను చేర్చింది.

05/18/2016 - 06:39

బాగ్దాద్, మే 17: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో షియాలు అధిక సంఖ్యలో ఉండే నివాస ప్రాంతాల్లోని మార్కెట్లలో మంగళవారం సంభవించిన వరస బాంబు పేలుళ్లలో కనీసం 54 మంది చనిపోగా, దాదాపు వందమంది దాకా గాయపడ్డారు. మొదట ఆరుబయలు మార్కెట్‌కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు వెలుపల ఒక బాంబు పేలింది. ఆ పేలుడులో గాయపడిన వారికి సాయపడడం కోసం జనం చేరినప్పుడు వారి మధ్యలో ఓ మానవ బాంబు పేల్చేసుకున్నాడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

05/18/2016 - 06:38

న్యూఢిల్లీ, మే 17: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్‌పై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజన్ పరిపూర్ణుడైన భారతీయుడు కాదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్‌బిఐ గవర్నర్ పదని నుంచి ఆయనను తొలగించాలని మంగళవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి లేఖ రాశారు. రఘురాం రాజన్ దేశంలో గ్రీన్ కార్డుపై ఉన్నారు. కాబట్టి ఆయన పరిపూర్ణుడైన భారతీయుడుకాదు.

05/18/2016 - 06:37

న్యూఢిల్లీ, మే 17: పరిహార కారణాలతో తాము ఇవ్వజూపిన ఉద్యోగాన్ని స్వీకరించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరుడు ఆసక్తితో లేడని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని వివరించింది.

05/18/2016 - 06:36

వాషింగ్టన్, మే 17: తీవ్రమైన జనన లోపాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను క్లోన్ చేయటంలో శాస్తవ్రేత్తలు విజయం సాధించారు. జికా నిర్మూలనకు అవసరమైన వ్యాక్సిన్, చికిత్స విధానాల రూపకల్పనలో ఈ క్లోనింగ్ బాగా ఉపయోగపడుతుందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. 2007 నుంచి వివిధ దేశాల్లో వ్యాపిస్తూ వచ్చిన జికా.. తీవ్రమైన జనన లోపాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. చిన్న తలలతో శిశువులు జన్మించటం..

05/18/2016 - 06:34

న్యూఢిల్లీ, మే 17: జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను భారత్‌లో అంతర్భాగాలుగా చూపుతూ కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘్భగోళిక సమాచార క్రమబద్దీకరణ బిల్లు’పై పాకిస్తాన్ తీవ్రంగా అశ్యంతరం చెప్పింది. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ బిల్లులో జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను తమ దేశ భూభాగాలుగా చూపించిందని..

05/18/2016 - 06:22

హైదరాబాద్, మే 17: రెండు రోజుల్లో మీ అందరికీ బిగ్ న్యూస్ అంటూ ఐటి మంత్రి కె తారక రామారావు చేసిన ట్విట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండు రోజుల్లో ఆయన పంచుకునే వార్త ఏమై ఉంటుందా? అన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే మొదలైంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పెద్ద పరిణామం చోటుచేసుకోనుందని అంటున్నారు. ఆపిల్ సిఇఓ ఈనెల 19న హైదరాబాద్‌కు వస్తున్నారు.

05/18/2016 - 06:12

హైదరాబాద్, మే 17: రాష్ట్ర పండగలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభిలషించారు. జూన్ 2న హైదరాబాద్ సహా రాష్టవ్య్రాప్తంగా అవతరణ దినత్సవం అదిరిపోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీతో సిఎం కెసిఆర్ మంగళవారం సమావేశమయ్యారు.

Pages