S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 07:02

న్యూఢిల్లీ,మే 17: వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలన పథకం వచ్చి 40 ఏళ్లు అయినా దాన్ని నిర్మూలించలేక పోయామన్నారు. గడచిన 38ఏళ్లలో 18 రాష్ట్రాలలో 172 జిల్లాలలో 2లక్షల 82వేల మందిని విముక్తి కల్గించామన్నారు.

05/18/2016 - 07:01

న్యూఢిల్లీ, మే 17: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఓం సహా కొన్ని వేద మంత్రోచ్చారణ ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. వచ్చే నెల 21న జరిగే యోగా దినోత్సవం రోజున ఓం సహా ఇతర వేద మంత్రోచ్ఛరణ జరగాలంటూ కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది.

05/18/2016 - 07:00

హైదరాబాద్, మే 17: దేశవ్యాప్తంగా ఐఐటిలు, జాతీయ సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 22వ తేదీన ఐఐటి జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. 20 ఐఐటిలు, జాతీయ సంస్థల్లో మొత్తం 9974 సీట్లు అందుబాటులోన్నాయి. ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష నుండి మొత్తం 1,98,228 మంది అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 12 వేల మంది పరీక్ష రాస్తున్నారు.

05/18/2016 - 06:59

హైదరాబాద్, మే 17: సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిఐపిసియు)ను ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు విధి విధానాలతో జీవోను జారీ చేస్తారు. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేకంగా ఒక సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దేశంలో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం తొలిసారి అని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

05/18/2016 - 06:58

హైదరాబాద్-గుంటూరు, మే 17: ఈ నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య హిందువుల ఆరాధ్య దైవాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన అభియోగాలపై నగరానికి చెందిన న్యాయవాది కె కరుణ సాగర్ ఎల్‌బినగర్ 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

05/18/2016 - 06:58

హైదరాబాద్, మే 17: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ దొంగలేనని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం బిజెపి రాష్ట్ర శాఖ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది.

05/18/2016 - 06:57

హైదరాబాద్/విజయవాడ,మే 17: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుదంపతులు ప్రయాణం చేస్తున్న కారు సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ రింగ్ రోడ్డులో పహాడీ షరీఫ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి (55), కారు డ్రైవర్ దాస్ అక్కడికక్కడే మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావును అపోలో ఆసుపత్రికి తరలించారు.

05/18/2016 - 06:46

ఓడ పేరు - హార్మనీ ఆఫ్ సీస్
బరువు - 1,20,000 టన్నులు
వెడల్పు - 66 మీటర్లు (217 అడుగులు)
ఎత్తు - 362 మీటర్లు
(ఈఫిల్ టవర్ కంటే 50మీటర్లు ఎక్కువ)
అంతస్థులు - 16
ప్రయాణికులు - 6360
సిబ్బంది - 2100
నిర్మాణ ఖర్చు - 100 కోట్ల డాలర్లు

05/18/2016 - 06:44

న్యూఢిల్లీ, మే 17: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టనప్పటికీ జన్‌ధన్, స్వచ్ఛ్భారత్ లాంటి కొన్ని పథకాలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించగా, మిగతా పథకాలేవీ వారి దృష్టిలో పడనే లేదని సిఎంఎస్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 2014 మేలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి దాదాపు 40 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.

05/18/2016 - 06:42

గయ, మే 17: బిహార్‌లో జెడియు సస్పెండ్ ఎమ్మెల్సీ మనోరమ దేవి మంగళవారం ఎట్టకేలకు లొంగిపోయారు. మద్య నిషేధ చట్టం ఉల్లంఘించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మనోరమను 14 రోజుల జుడీషియల్ కస్టడికి పంపుతూ గయ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని ఎమ్మెల్సీ కొడుకు రాకీ యాదవ్ కాల్చి చంపేశాడు. రాకీకోసం ఎమ్మెల్సీ ఇంట్లో పోలీసులు గాలించగా విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి.

Pages