S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 14:08

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహానగరంలో ఆదివారం (మే 1) నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే టాక్సీలను నడపడానికి వీలు లేదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచేలా టాక్సీలను మార్పుచేసుకునేందుకు గడువును పెంచేందుకు అనుమతించే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువు శనివారంతో ముగిసింది.

04/30/2016 - 14:07

దిల్లీ: ప్రధాని మోదీతో పాటు బిజెపి నాయకులపై తరచూ విమర్శలు గుప్పించే దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇపుడు రైల్వేమంత్రి సురేష్ ప్రభుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రైల్వేమంత్రిని అభినందించారు. మహారాష్టల్రో తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న లాతూరు ప్రాంతానికి 11 సార్లు నీటిరైళ్లను పంపినందుకు కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.

04/30/2016 - 14:07

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కెటిఆర్ మితిమీరిన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని కెటిఆర్ అనడం అహంకారానికి పరాకాష్ట అన్నారు. రాజకీయ దాహంతో వ్యవహరిస్తున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణలో నీటికష్టాలు, కరవు పరిస్థతులు పట్టవని విమర్శించారు.

04/30/2016 - 14:06

విజయనగరం: ఎపికి ప్రత్యేకహోదా ఇస్తేనే బిజెపి పట్ల జనంలో విశ్వసనీయత ఉంటుందని టిడిపి నేత గద్దె బాబూరావు అన్నారు. బిజెపి, టిడిపి కలిసి పనిచేస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని, ఒంటరిగా పోటీ చేస్తే బిజెపి ఒక్క చోట కూడా గెలవలేదన్నారు.

04/30/2016 - 14:06

విజయవాడ: విభజన చట్టంలో హామీలను, ప్రత్యేక హోదా డిమాండ్‌ను తీర్చేలా ప్రధాని మోదీ కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని ఎపి హోంమంత్రి చినరాజప్ప శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. దీన్ని సాధించేందుకు టిడిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. బిజెపితో తమ పొత్తు 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు.

04/30/2016 - 14:05

విశాఖ: ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకూ తాము కేంద్రంతో పోరాడతామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రత్యేకహోదా హామీపై బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులున్నా ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా మే 2న అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజీనామాలు చేయించాకే వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.

04/30/2016 - 14:05

దిల్లీ: సిబిఎస్‌ఇ సిలబస్, రాష్ట్రాల సిలబస్ వేర్వేరుగా ఉంటుంది గనుక ‘నీట్’ (మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్)ను నిలిపివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. సిలబస్ వేర్వేరుగా ఉన్నందున తాము స్వల్పకాలంలో ‘నీట్’కు సిద్ధం కాలేమని విద్యార్థులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల వాదనను ధర్మాసనం త్రోసిపుచ్చింది.

04/30/2016 - 14:04

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపఎన్నికలపై ఆసక్తి చూపే సిఎం కెసిఆర్ తాగునీటి సమస్యపై కొంత శ్రద్ధ చూపినా జనం సమస్యలు గట్టెక్కేవని యూత్ కాంగ్రెస్ నేతలు అన్నారు. ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

04/30/2016 - 12:40

విజయవాడ: అభివృద్ధిని అడ్డుకునే వారు ఎన్ని ఆరోపణలు చేసినా పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేసే ప్రసక్తే లేదని, అనుకున్న గడువుకు పనులను పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల మట్టం బాగా అడుగంటినందున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు.

04/30/2016 - 12:39

విజయవాడ: వైకాపా అధ్యక్షుడు జగన్‌తో కొందరు బిజెపి నాయకులు కుమ్మక్కై రాష్ట్భ్రావృద్ధికి అడ్డుతగులుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శనివారం ఇక్కడ ఆరోపించారు. అవినీతిపరుడైన జగన్‌కు దిల్లీలో కేంద్రమంత్రులు అపాయిమెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్‌తో కొందరు బిజెపి నేతలు చేతులు కలపడం దారుణమన్నారు.

Pages