S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 08:50

పాలకొండ (టౌన్), ఏప్రిల్ 29: విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో స్థానిక నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్‌శాఖాదికారులు శుక్రవారం కరెంట్ కట్ చేశారు. దీంతో నగర పంచాయతీ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో వేసవి ఎండలకు సిబ్బంది కూడా కార్యాలయంలో పని చేయడానికి ఇబ్బంది పడ్డారు.

04/30/2016 - 08:49

శ్రీకాకుళం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలను కష్టాలనుంచి గట్టేక్కించడంలో పాలకులు వెనుకపడ్డారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగని అధికారానికి దూరమైన నిజాన్ని ఆలస్యంగా గుర్తించి గత ఎన్నికల వేళ రుణమాఫీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రుణమాఫీ రైతు కుటుంబాలను ఆదుకోకపోవడమే కాకుండా బ్యాంకుల వద్ద వారి పరపతిని కూడా దెబ్బతీసింది.

04/30/2016 - 08:49

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 29: కోరిన కోర్కెలు తీర్చే శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలకు 2016-17 ఏడాదికి రూ. 68.10 లక్షలకు వేలం పాట ఖరారైంది. శుక్రవారం ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శ్యామలాదేవి పర్యవేక్షణలో కొబ్బరి చెక్కలు, తలనీలాల వేలం నిర్వహించారు.

04/30/2016 - 08:48

శ్రీకాకుళం(రూరల్), ఎచ్చెర్ల, ఏప్రిల్ 29: ఇంజనీరింగ్, మెడిసన్, అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థి జీవితంలో ఎంసెట్ ఎంతో కీలకమైనది. జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో జరిగింది. మధ్యాహ్నం మెడిసన్ ప్రవేశ పరీక్ష ఐదు కేంద్రాల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షకు 6015 మంది దరఖాస్తు చేసుకోగా 5328 మంది పరీక్షకు హాజరయ్యారు.

04/30/2016 - 08:47

రావులపాలెం, ఏప్రిల్ 29: కృష్ణా పుష్కరాలకు దేవాదాయ శాఖ తరపున రూ.150 కోట్లు కేటాయించామని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెంలోని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పైడికొండల మాట్లాడారు.

04/30/2016 - 08:46

కాకినాడ, ఏప్రిల్ 29: ఎపి ఎంసెట్-2016ను జెఎన్‌టియుకె విజయవంతంగా నిర్వహించగలిగింది. ఎంసెట్‌ను గత రెండేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటుచేసిన ప్రవేశ పరీక్షా కేంద్రాలను వర్సిటీ వైస్ ఛాన్సలర్, ఎంసెట్-2016 ఛైర్మన్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు.

04/30/2016 - 08:45

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29: భానుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. గోదావరి తీరం ఒక్కసారిగా సలసలా కాగింది. సీజన్‌లో మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరంలో శుక్రవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ఉగ్రరూపానికి జనం విలవిల్లాడారు. ఇంట్లోంచి బయటకు రాలేకపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో రాజమహేంద్రవరంలో వేడి వాయువులు చుట్టిముట్టేశాయి.

04/30/2016 - 08:45

అమలాపురం, ఏప్రిల్ 29: రైతులు పండించిన పంటకు మద్దతుధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ హెచ్చరించారు.

04/30/2016 - 08:43

ప్రొద్దుటూరు, ఏప్రిల్ 29: జిల్లాలో 2016-17 సంవత్సరానికిగాను గ్రామీణ ఉపాధిహామీ పథకంలో లక్ష ఫారంపాండ్స్ తవ్వించేందుకుగాను రూ.303 కోట్లతో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 70,656, వాటర్‌షెడ్ పథకం కింద 29,344 కుంటలు తవ్వించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

04/30/2016 - 08:42

కడప,ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా తమ మాటవినని మండలస్థాయి అధికారులను బదిలీ చేయాలంటూ అధికార పార్టీ నేతలు హైకమాండ్‌పై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతల చర్యలతో కొందరు అధికారులు విసిగిపోయి తాము బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మండలస్థాయిలో రెవెన్యూ, పోలీసు, ఎంపిడివోలను టార్గెట్‌చేసుకుని వారిని బదిలీ చేయించేందుకు వత్తిడి తెస్తున్నారు.

Pages