S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 18:09

హైదరాబాద్: వైకాపాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు శనివారం ఇక్కడ ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాజేంద్రనాథ్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి తదితరులు స్పీకర్‌ను కోరారు. రాజీనామాలు చేయించాకే ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.

04/30/2016 - 18:09

కర్నూలు: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్పష్టం చేసినా వెంకయ్య ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై పోరాటం చేసేందుకు మే 2న విజయవాడలో వామపక్షాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాయన్నారు.

04/30/2016 - 18:08

హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పు చేసిందని, ప్రత్యేకహోదా హామీని విస్మరించి నేడు బిజెపి అలాంటి తప్పుచేయకూడదని తాను కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ తన మనోభావాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

04/30/2016 - 18:08

విశాఖ: విశాఖ జిల్లా రోలుగుంట వద్ద శనివారం ఓ పెళ్లివ్యాన్ బోల్తాపడి ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు.

04/30/2016 - 18:07

మహబూబ్‌నగర్: తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు సరిగా అమలు జరగడం లేదని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు తీవ్రంగా మందలించారు. అడ్డాకుల మండలంలో ఆయన శనివారం చెరువు పనులను ప్రారంభించారు. ఇరిగేషన్ అధికారుల తీరు మారకుంటే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

04/30/2016 - 18:07

విశాఖ: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అన్నివిధాలా ఆధునీకరిస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పోలీస్ కమిషనరేట్ కొత్త భవనాన్ని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ప్రారంభించారు. డిజిపి రాముడు, అదనపు డిజి ఠాకూర్, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు హాజరయ్యారు.

04/30/2016 - 15:27

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకటి, రెండు చోట్ల స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 53 నియోజకవర్గాల్లో అయిదో విడత పోలింగ్‌కు 14,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

04/30/2016 - 15:26

నల్గొండ: తమను పరీక్షలకు అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఈ ఘటన జరిగింది. తమకు కళాశాల యాజమాన్యం హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ముగ్గురు విద్యార్థులు భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తామని బెదిరించారు. సమాచారం తెలిశాక పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థులను కిందకు రప్పించారు.

04/30/2016 - 15:26

ముంబయి: పలు బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల మేరకు బకాయిపడిన విజయ్ మాల్యాకు చెందిన ‘కింగ్‌ఫిషర్’ ట్రేడ్‌మార్కులు, బ్రాండ్‌లను వేలంలో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో 17 మంది రుణదాతలు శనివారం ఉదయం 11-30 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ వేలం పాట ప్రారంభించారు. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌లు, ట్రేడ్‌మార్కులకు 366.70 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ ప్రారంభమైంది.

04/30/2016 - 14:08

ముంబయి: అభిమానిపై తన బాడీగార్డు చేయి చేసుకున్నందుకు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పాడు. ఇకముందు తన అభిమానులకు ఇలాంటి చేదు అనుభవాలు ఉండవని ఆయన హామీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ముంబయి విమానాశ్రయానికి అక్షయ్ వచ్చినపుడు ఆయన అభిమాని ఒకరు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో అభిమానిని పక్కకు లాగేసి అక్షయ్ బాడీగార్డు కాస్త చేయి చేసుకున్నాడు.

Pages