S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 22:20

కాసిపేట, ఎఫ్రిల్ 29: రాబోయో రోజులలో మందమర్రి ఏరియాకు ఎంతో భవిషత్తు ఉందని, ఎన్నో కొత్త గనులు (్భగర్భ) రానున్నాయని మందమర్రి ఏరియా జనరల్‌మేనేజర్ రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 గని టన్నల్ పనులను ప్రారంభించారు.

04/29/2016 - 22:19

ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 29: రిమ్స్‌లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లపై రోగుల బంధువుల వేదింపులు అధికమవుతున్నాయని నిరసిస్తూ శుక్రవారం రిమ్స్ ఓపి విభాగం ఎదుట శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులు ధర్నా చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ రోగుల కోసం మెరుగైన వైద్యం అందిస్తే చిన్నపొరపాటు జరిగితే రోగుల బంధువులు వైద్యులపై దాడులు చేయడం సరికాదన్నారు.

04/29/2016 - 22:19

మందమర్రి రూరల్, ఏప్రిల్ 29: ఎర్రగుంట పల్లి ఓసి వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో కెకె ఓసి ప్రాంతంలో ఓసిలకు వ్యతిరేకంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బియస్ పి జిల్లా నాయకులు హజరై ఓసి వ్యతిరేక పోరాటానికి మద్దతు పలికారు.

04/29/2016 - 22:18

మంచిర్యాల, ఏప్రిల్ 29: నక్సలైట్ అనే పేరుతో వ్యాపారస్తులను బెదిరిస్తున్న అట్ల నాగభూషణం అనే నకిలీ నక్సలైట్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు సి ఐ సుదాకర్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన నాగభూషణం కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు.

04/29/2016 - 22:17

బెజ్జూరు, ఏప్రిల్ 29: మావోయిస్టుల ఉనికి కోసమే ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. శుక్రవారం బెజ్జూరు పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన సందర్బంగా విలేకర్లతో మాట్లాడారు. బెజ్జూరు మండలంలోని గూడెం ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న వంతెన పనులకు ఉపయోగించే నాలుగు వాహనాలను మావోయిస్టులు ధ్వంసం చేయడం తమ ఉనికి కోసం, చందాల కోసమేనని అన్నారు.

04/29/2016 - 22:17

ఉట్నూరు, ఏప్రిల్ 29: ఏజెన్సీలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో ఏజెన్సీ గ్రామాలన్నీ విలవిలలాడాయి. గురువారం 11 గంటల రాత్రి సమయంలో గంట పాటు గాలిదుమారం వీయడంతో గ్రామాల్లోని ఇండ్లు, పశువుల పాకలపై కప్పి ఉన్న రేకుల షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. అదే విధంగా ఎక్కడికక్కడా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో గ్రామాలన్నీ అందకారమయ్యాయి.

04/29/2016 - 22:15

నవీపేట, ఏప్రిల్ 29: మండల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి అంబులెన్స్ లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఎంపి కవిత చొరవతో ప్రభుత్వం నవీపేటకు అంబులెన్స్‌ను మంజూరు చేసింది. దీనిని శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు లాంఛనంగా ప్రారంభించారు.

04/29/2016 - 22:15

నవీపేట, ఏప్రిల్ 29: ఈదురుగాలుల వల్ల తెగిపడిన విద్యుత్ వైర్లు తగలడంతో మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సోర్‌మార్ చిన్నలింగన్న(52) అనే రైతు మృతి చెందాడు. లింగన్న గురువారం సాయంత్రం తన పొలం వద్ద పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, కరెంటు షాక్‌కు గురై చనిపోయి కనిపించాడు.

04/29/2016 - 22:14

కంఠేశ్వర్, ఏప్రిల్ 29: జిల్లాలోని అన్ని తాలూకాలలో టిఎన్జీవో సంఘాలను పునర్ నిర్మించి బలోపేతం చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.కిషన్ అన్నారు.

04/29/2016 - 22:14

వినాయక్‌నగర్, ఏప్రిల్ 29: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం బకాయిలను అందించని కారణంగానే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయడం లేదన్నారు.

Pages