S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 18:16

కొట్టాయం: సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి 11వ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పుత్తుపల్లి నుంచి ఇప్పటికి పదిసార్లు గెలిచారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ వేసే ముందు ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసి, తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు.

04/29/2016 - 18:15

కాకినాడ: ఇక్కడ పర్లోవపేటలో మత్స్యకారులకు చెందిన సుమారు వంద గుడిసెలు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. ఓ ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసి పడడంతో మంటలు మిగతా గుడిసెలకు వ్యాపించాయి. గుడిసెల్లో సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో మత్స్యకారులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తాము సర్వస్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు.

04/29/2016 - 18:15

గుంటూరు: అనేక సమస్యల నేపథ్యంలో ఏర్పడిన ఎపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని సిఎం చంద్రబాబు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కరవు సమస్య వెంటాడుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

04/29/2016 - 18:14

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తానని టి.ఆర్టీసీ చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీలో లోటుపాట్లను తెలుసుకుని, ఉద్యోగులు, ప్రయాణీకుల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తానన్నారు.

04/29/2016 - 18:14

దిల్లీ: ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించలేదని, రెవెన్యూలోటును భర్తీ చేయాలని చెప్పినందున ఆంధ్రప్రదేశ్‌కు ఇక ప్రత్యేకహోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పి చౌదరి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో తేల్చిచెప్పారు. ఎపికి పన్ను రాయితీలు, ప్రత్యేక కేటాయింపులు ఇస్తున్నామన్నారు.

04/29/2016 - 17:06

అనంతపురం: వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే ఆ పార్టీలో అతని కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని మంత్రి పరిటాల సునీత అన్నారు. జగన్ ధోరణి నచ్చకే వైకపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, డబ్బులిచ్చి వారిని చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూశాకే వైకాపా ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టిడిపిలోకి వస్తున్నారని ఆమె అన్నారు.

04/29/2016 - 17:06

దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ఎపికి నిధుల్ని కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి హెచ్‌పి చౌదరి శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. గత రెండేళ్లలో ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి 2,050 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 750 కోట్లు ఇచ్చామన్నారు. ఎపిలో మూడు ఎయిర్‌పోర్టుల విస్తరణకు చురుగ్గా భూసేకరణ జరుగుతోందన్నారు.

04/29/2016 - 17:05

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రైవేటు మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ అనంతరం రాజ్యసభ సోమవారానికి వాయిదాపడింది. ఈ బిల్లుపై ఓటింగ్ పెట్టాలంటూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు కోరగా, కోరం లేనందున సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.

04/29/2016 - 17:05

దిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో అలనాడు కాంగ్రెస్ నేతలు అనాలోచితంగా వ్యవహరించినందునే నేడు ఎపి ప్రజలు నానాకష్టాలు పడుతున్నారని టిడిపి ఎంపి సిఎం రమేష్ శుక్రవారం రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఎన్నో లోపాలున్నందున వాటిని సవరించాలన్నారు. తగినన్ని నిధులిచ్చి ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

04/29/2016 - 17:04

దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే గాక, ఎపి ప్రజలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపి ఎంఎ ఖాన్ రాజ్యసభలో విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పలు హామీలుండాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వారు ఇపుడు వౌనం వహిస్తున్నారన్నారు.

Pages