S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 05:43

తిరుమల, ఏప్రిల్ 12: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 15 నుంచి జూన్ 30 వరకు అన్ని శుక్రవారాల్లో వి ఐ పి బ్రేక్ దర్శనాలను కేవలం ప్రోటోకాల్ వి ఐ పి లకు మాత్రమే కేటాయించనున్నామని తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు వెల్లడించారు.

04/13/2016 - 05:41

రొంపిచెర్ల, ఏప్రిల్ 12 : అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న అన్న అమృతహస్తం పాలు తయారైన కొద్దిరోజులకే చెడిపోతున్నాయి. ప్యాకేజీ చేసిన అట్టపెట్టెల్లోనే పాలప్యాకెట్లు బెలూన్ల మాదిరిగా ఉబ్బిపోయి పురుగులు పడుతున్నాయి. మండల పరిషత్ అధికారి ఉమాలక్ష్మి మంగళవారం చెడిపోయిన పాల ప్యాకెట్లను పరిశీలించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

04/13/2016 - 05:40

రాయవరం, ఏప్రిల్ 12: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయి ఉండి విద్యార్థులకు విద్యతోబాటు నీతిని బోధించాల్సిన గురుతర బాధ్యత తనపై ఉన్నప్పటికీ తన పాఠశాలలో చదువుతున్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ లోకానికి మచ్చ తెచ్చిన ఘటన మంగళవారం మండలంలోని పసలపూడి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

04/13/2016 - 05:39

దేవీపట్నం, ఏప్రిల్ 12: జాతీయ మానవ హక్కుల కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లా) ఇంద్రజిత్ కుమార్, డిప్యూటీ ఎస్పీ రాజ్‌బీర్ సింగ్ పోలవరం ప్రోజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం తొలగించిన అంగులూరు గ్రామాన్ని సందర్శించి బాధితులతో సమావేశమయ్యారు.

04/13/2016 - 05:38

యానాం, ఏప్రిల్ 12: యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ఆయన సతీమణి ఉదయలక్ష్మి, మరికొందరు క్రైస్తవ సంఘాల నాయకులపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్ సోషన్ ఒక ప్రకటనలో తెలిపారు.

04/13/2016 - 05:38

రాజవొమ్మంగి, ఏప్రిల్ 12: మావోయిస్టుల ప్రాబల్యమున్న చింతూరులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ఏజెన్సీలో పోలీసులు అణువణువు గాలింపులు చేపట్టారు. రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులతోప్రత్యేక పోలీసు బలగాలు మంగళవారం కూంబింగ్ చేపట్టారు. జడ్డంగి నుండి బోర్నగూడెం వరకు సాయుధ పోలీసులు 12కిమీ మేర అటవీమార్గంలో జల్లెడపట్టారు.

04/13/2016 - 05:37

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో మే 15 నాటికి జిపిఆర్‌ఎస్ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండి ఎన్ సాంబశివరావు వెల్లడించారు. మే 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈసౌకర్యాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో జిపిఆర్‌ఎస్ సౌకర్యాన్ని కల్పిస్తున్న దానవాయిపేటలోని డ్రీమ్‌స్టెప్ సంస్థ కార్యాలయంలో ప్రాజెక్టు ప్రగతిపై ఆయన సమీక్ష జరిపారు.

04/13/2016 - 05:36

సామర్లకోట, ఏప్రిల్ 12: రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

04/13/2016 - 05:36

చింతూరు, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలీనమైన చింతూరు మండలంలో బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విలీన మండలాలపై వరాలు జల్లు కురిపిస్తారా అని ఈ మండలాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పోలవరం ప్రోజెక్టు పేరుతో ఈ ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారు. అప్పట్నుండీ ఈ మండలాల్లో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది.

04/13/2016 - 05:35

కాకినాడు, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి నిమ్మలగూడెంకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 10-35 గంటల నుండి 11 గంటల వరకు ఉపాధి హామీ పనులు పరిశీలించి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అనంతరం చంద్రబాబు చింతూరులోని ఎర్రంపేట ఉదయం 11 గంటలకు సబ్ ట్రెజరీని ప్రారంభిస్తారు.

Pages