జాతీయ వార్తలు

సిఎం చెప్పినా ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ‘మీ ముఖ్యమంత్రి చెప్పినా గుంటూరులోని పొగాకు బోర్డులో మీరు చెప్పిన వ్యక్తిని సభ్యుడుగా కొనసాగనిచ్చే ప్రసక్తే లేదు. పొగాకు బోర్డులోనే కాదు... మరే ఇతర బోర్డులో కూడా సభ్యత్వం లభించకుండా చేస్తాను’ ఈ మాటలు ఎవరో వీధి నాయకుడు చెప్పినవి కాదు, సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగుదేశం ఎంపిలతో అన్న మాటలివి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిహేనుమంది తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యులు రెండు రోజుల క్రితం నిర్మలా సీతారామన్‌ను కలిసి పొగాకు బోర్డు సభ్యుడు జాస్తి రమేష్ సభ్యత్వం కొనసాగించాలని కోరుతూ ఒక వినతిపత్రం సమర్పించారు. రమేష్ ప్రస్తుతం పొగాకు బోర్డు సభ్యుడుగా పని చేస్తున్నారు. స్థానికుడైన రమేష్‌ను మరోసారి బోర్డు సభ్యుడుగా నియమించాలని ఎంపిలు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రమేష్ సమర్థంగా పని చేస్తున్నందున బోర్డు సభ్యుడుగా ఆయనను కొనసాగించటం మంచిదన్నది తమందరి అభిప్రాయమంటూ వారు ఆమెకు వినతిపత్రం అందజేశారు. నిర్మలా సీతారామన్ వారిచ్చిన వినతిపత్రం తీసుకుని ‘మీరు ఆలస్యంగా వచ్చారు. గుంటూరులోని పొగాకు బోర్డుకు కొత్త సభ్యులను నియమించేందుకు సంబంధించిన ఫైలును ఖరారు చేసి ప్రధాన మంత్రి మోదీకి పంపించివేశాను. ఆ ఫైలు వాపస్ వస్తే మీరు సూచిస్తున్న రమేష్ పేరు జోడించేందుకు ప్రయత్నిస్తాను. ఫైలు వెనక్కు రాకపోతే ఏదైనా ఇతర బోర్డులో సభ్యుడుగా నియమిస్తాము’ అని భరోసా ఇచ్చి ఎంపిలను పంపించివేశారు. అయితే ఈ వ్యవహారం అక్కడితో ముగిసిపోలేదు. పొగాకు బోర్డు నియామకాలకు సంబంధించిన ఫైలు ప్రధాని కార్యాలయానికి వెళ్లకుండా ఇంకా నిర్మలా సీతారామన్ కార్యాలయంలోనే ఉన్నట్లు ఎంపీలకు తెలిసింది. దీనితో ఒకరిద్దరు టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిర్మలా సీతారామన్‌ను కలిసి ‘పొగాకు బోర్డు ఫైలు మీ కార్యాలయంలోనే ఉన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే జాస్తి రమేష్ పేరు జోడించి పంపించాల’ని విజ్ఞప్తి చేశారు. మంత్రి నుండి అనుకూల సమాధానం వస్తుందని ఆశించిన ఎంపిలు ఆమె మాట్లాడిన తీరుకు అవాక్కయ్యారు. ‘జాస్తి రమేష్ మా కార్యాలయంపై గూఢచర్యం చేస్తున్నాడా? అతనేమనుకుంటున్నాడు? పొగాకు బోర్డులోనే కాదు, మరే ఇతర బోర్డులోనూ కూడా అతన్ని సభ్యుడిగా నియమించటం జరగదు. ఇతర మంత్రులు కూడా ఆయనను నియమించకుండా చూస్తాను. మీరే కాదు, మీ ముఖ్యమంత్రి సిఫారసు చేసినా పొగాకు బోర్డులో సభ్యుడిగా రమేష్‌ను కొనసాగించను’ అంటూ ఆమె వెళ్లిపోయినట్లు తెలిసింది. తమ పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపికై కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ ఇలా కటువుగా మాట్లాడటం తెలుగుదేశం సభ్యులకు మనస్తాపం కలిగించినట్లు తెలిసింది. తమను తప్పు పడితే పట్టవచ్చు కానీ మీ ముఖ్యమంత్రి చెప్పినా రమేష్‌ను నియమించటం జరగదని వ్యాఖ్యానించటం అవమానకరంగా ఉన్నదని వారంటున్నారు. ఎంపిలు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీలో నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఎంపిక కావటం తెలిసిందే. ఆమె రాజ్యసభ సభ్యత్వం వచ్చే సంవత్సరం పూర్తి అవుతుంది.