సాహితి

చయినా యువతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సుందరమగు చయినా
దేశంపు మత్స్య నయనా!
నీ యందము వినుతింపగ
సాధ్యంబ బ్రహ్మ కయినా?

జ్యోత్స్నా ద్రవంపు టలయా,
లేకున్న వింత కలయా,
నీ నవ్వు? నిత్యనూతన
లావణ్య శోభ నిలయా!

రక్త్ధారముల పయినా
నోరార ముద్దు లియనా?
శూన్యాంతర శశిరీతి, మ
దీయాంతరంగ శయనా
నీ పల్కులు శుక రుతముల్
నిన్ సోకగ మారుతముల్
మూర్ఛిల్లునహా! నీ నయ
నా లర్ధనిమీలితముల్
ఓ సుందరమగు చయినా
దేశంపు మత్స్యనయనా!
నా ముంగల నిలుచుంటివి
దివ్యాప్సరస్సఖియనా!

పఠాభి మార్కు పన్‌చాంగం

ఒ ‘తీసినా వేసినా బాధ కల్పించునవి పన్నులు’
ఒ ‘ఉద్యోగులలో రెండు రకాల వారున్నారు చేసేవారు కొందరు, కాజేసేవారు కొందరు.’
ఒ ‘ఈనాడూ అంతా తారుమారు, ఆశలు మన్ను ముట్టినవి, ధరలు మిన్ను ముట్టినవి.’
ఒ ‘వెలయాలు చాల ప్రియము, ఆలు చాల సరసము.’
ఒ ‘సధవ-తలిరుబోడి విధవ-తలబోడి.’
ఒ ‘సారాయి త్రాగినవాడు షరాయి వీడిపోతున్నా తాను వయిస్రాయి ననుకొంటాడు.’
ఒ ‘పాపం చేయకుండా గర్భం దాల్చింది క్రీస్తుమాత మరియమ్మ - గర్భం దాల్చకుండా పాపం చేయాలని
కొందరు సుందరీమణుల కోరిక.’
ఒ ‘చాలామంది నీతివంతులుగ వుండటం చాలినంత ధైర్యం లేకపోబట్టి - అవినీతికి అతి సాహసం కావాలి.’
ఒ ‘సంఘ మర్మం’ - ఒకని కూతురు మరొకనికి పెండ్లాము, వేరొకనికి తల్లికూడాను.’
ఒ ‘పంట పండించటంలో పూజ్యమైనా కోతలు కోయడంలో మొనగాడు.’
ఒ ‘ప్రపంచంలోని అభ్యుదయం చాల పాళ్లు సంశయాత్ముల వల్ల సమకూరినదే.’
ఒ ‘నిరాశ కన్ననూ దురాశ మంచిది.’
ఒ ‘తమిళ దేశస్తులు గలభా చేయడం తక్కువ ఇంతకూ వారి భాష ‘అరవం’ గదూ.’
ఒ ‘నీవు కూర్చునట్టి డబ్బు ఇతర్ల పాలు - నిజానికి నీవు ఖర్చించునదే నీది.’
ఒ ‘కేంద్ర ప్రభుత్వంలో చాలా డిల్లీ డాలీయింగు.’
ఒ ‘రష్యన్లకు నిండా తాగడం ‘వాడ్క’.’
ఒ ‘సినిమా వ్యాపారం బ్రహ్మాండమైన లాటరీ అ-దృష్టం ఉన్నవాడు ‘వాసన్’. లేనివాడు ఉపవాసన్.’