సాహితి

చిత్తాన్ని దోచే చిత్తరువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు... కుంచె పట్టగానే అనన్యంగా వికసించే కళాకారులు అరుదుగానే ఉంటారు. వృత్తి, ప్రవృత్తి భిన్నమైనవే అయనా నిష్ఠ, దీక్ష, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అనితర సాధ్యులే కావొచ్చు. చిత్రకారుడు కావడమే అదృష్టం. ఏ కళలోనైనా రాణించి తనదైన ముద్ర వేసుకోవడమన్నది కొంతమందికే సాధ్యం. అలాంటి అరుదైన కోవకు చెందినవారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి సత్తిరాజు శంకర నారాయణ (శంకర్). తెలుగు బొమ్మకు తానే చిరునామాగా మారి తెలుగుదనాన్ని తన కుంచెలో ఒడిసిపట్టిన తెలుగింటి చిత్రకారుడు ‘బాపు’కి స్వయాన సోదరుడు ఈయన. అన్న అడుగు జాడల్లోనే ఎలా బొమ్మలు వేయాలో ఎంత అందంగా హృద్యంగా వేయాలో భావాన్ని ఎలా ఒలికించాలో ఒడిసిపట్టుకున్న శంకర్ ఆ దిశగా తన పయనాన్ని కొనసాగించారు. ఒకటి కాదు, రెండు కాదు బొమ్మ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ఎందరో మహామహుల చిత్రాలను అలవోకగా ఔరా అనిపించేలా గీశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ ఆయన పెన్సిల్ స్కెచ్‌లు. వీరంతా కూడా సాహిత్యంలో నిరుపమాన సేవలందించి సమున్నత సాహిత్య అకాడమీ అందుకున్న భాషా ధురీణులే. బొమ్మకు భావం తోడైతే అదో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. కేవలం బొమ్మ గీసినంత మాత్రాన భావం పలకదు. ఎవరి బొమ్మ అయతే వేస్తున్నారో ఆ వ్యక్తి మనస్తత్వాన్ని కూడా చిత్రకారుడు అవగతం చేసుకుంటేనే ఆ బొమ్మకు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. అలాంటి పరిపూర్ణత్వాన్ని తన బొమ్మలోనూ శంకర నారాయణ ఒలికించారని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమి కావాలి. పదవీ విరమణ చేసినా ఆయన తన చిత్రకళా తపస్సును వీడలేదు. అసిధారావ్రతంగా ఆయన కుంచె నుంచి అరుదైన కళాఖండాలు, అరుదైన బొమ్మలు జాలువారుతూనే వచ్చాయ. కేవలం చార్‌కోల్, పెన్సిల్‌ను ఉపయోగించి 3000కు పైగా పోర్టయట్‌లను అందించిన అరుదైన ఘనత శంకర నారాయణది.

నా కుంచెలో నేను..
*సత్తిరాజు శంకర నారాయణ (శంకర్)