సాహితి

పుత్తడిబొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళిస్తూ పువ్వులు పూస్తున్నాయ
పవన తరంగాలు పలుకరిస్తున్నాయ
పిల్లకాలువ పరుగులు పులకరిస్తున్నాయ
కోకిలమ్మ పాటలు వీనులవిందు చేస్తున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడిబొమ్మ కానరాదే?
మమతల కోవెలలోని తలపులు తెరవలేదే?

గోదారమ్మ హొయలు పరుగులెడుతున్నాయ
చెట్లు కదిలి వానచినుకులు తడిపేస్తున్నాయ
అందెల సవ్వడులు ఘల్లుమంటున్నాయ
అందమైన కురులు సిగ్గులొలుకుతున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడిబొమ్మ కానరాదే?
కొలనులో విరిసిన తామరులు పలుకలేదే?

ఇంద్రధనుస్సులోని రంగులు కుంచెకంటాయ
పురివిప్పి మయూరములు ఆటలాడుతున్నాయ
గువ్వా గోరింకలు గూటికి చేరుతున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడిబొమ్మ కానరాదే?
కమ్మని కలలుగన్న నా కంటికి నిదురలేదే?

లేగదూడలు పాలకు చిందులేస్తున్నాయ
కడలి కెరటాలు తీరాన్ని తాకుతున్నాయ
తారకలు నింగిలో మిలమిలమెరుస్తున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడిబొమ్మ కానరాదే?
తరుముతున్న తరంగాలు నిలకడగ నిలువలేదే?

ఉత్తరాలన్నీ పుస్తకాలుగా మారుతున్నాయ
చెదలు పట్టిన కాగితాలు చిరిగిపోతున్నాయ
ఎదురుచూపులతో కళ్ళు అలసిపోతున్నాయ
కానీ మనసు దోచిన పుత్తడి బొమ్మ కానరాదే?
కథ కంచికి చేరుతుంటే చివరి చరణం పాడలేదే!

- డా. శారదారెడ్డి వకుళ, 9492416166