అక్షర

జాషువాను సాక్షాత్కరింపజేసిన విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కవి జాషువా
(విమర్శ గ్రంథం)
రచయిత: కొల్లా శ్రీకృష్ణారావు,
వెల: రు.50/-
ప్రతులకు : రచయిత,
రోహిణీ టవర్స్, 2/11,
బ్రాడీపేట, గుంటూరు-2.
ఫోన్: 9440033715

గుఱ్ఱం జాషువాపై ఎన్ని సిద్ధాంత గ్రంథాలు, ఎన్ని విశే్లషణలు వచ్చినా ఆయన గురించి తెలుసుకోవాల్సింది, చెప్పవలసింది ఉంటునే వుంటుంది. ‘విశ్వనరుడ నేను’ అని ఘంటాపథంగా ఆయన ప్రకటిస్తే కొంతమంది ‘మీరు ఒక వర్గపు కవి. దళిత కవి’ అని సంకుచితపరుస్తున్నారు. జాషువా అంటే గబ్బిలమే అంటూ పాడిందే పాడుతున్నారు. దానిద్వారా పదవులు, పురస్కారాలు పొందుతున్నారు. ఆత్మవుంటే జాషువా ఆత్మ ఈ తతంగం చూసి దిగులు చెందుతుంది. ఇటువంటి వాతావరణంలో, పద్యకవి పత్రికా నిర్వాహకులు, విమర్శకులు కొల్లా శ్రీకృష్ణారావు ‘మన కవి జాషువా’ పుస్తకం రాసారు. మన కవి అంటే తెలుగు జాతి కవి. అందరి కవి.
శ్రీకృష్ణారావు గారికి జాషువాతో, వారి కుటుంబంతో పరిచయం వుంది. ముందే నిశ్చయించుకున్న బుద్ధితో రాయడం ఆయనకు రాదు. వాస్తవాలు రాసారు. జాషువాను వివిధ కోణాల్లో మనకి సాక్షాత్కరింపచేసారు.
* జాషువాను బ్రాహ్మణులు, అగ్రవర్ణాలవారు ఆదరించారు.
* అనేక సత్కారాలు, ఎంఎల్‌సి పదవి పొందారు
* జన్మస్థలంపై మక్కువ ఎక్కువ.
* ప్రకృతి ప్రియులు
* లోకజ్ఞులు
* గాంధేయ వాది.
* అంటరానితనం, అవమానాలపై కళ్ళెర్ర జేసారు.
* జాతీయ భావాలు నిండుగా గల కవి
ఇటువంటి సత్యాలను జాషువా పద్యాలను ఉదహరించి వెల్లడించారు.
‘ప్రసిద్ధులైన కవి పండితులెవరు జాషువాను అవమానింపలేదు. పైపెచ్చు అభిమానించి యాదరించిరి. ఆయన కేవలం కవియే కాదు-మత సామరస్యమును కాంక్షించిన సహృదయుడు. బుద్ధుడు-ఏసుక్రీస్తు-గాంధీ ఒకే కోవకు చెందిన మహాత్ములని యెంచిన వాడు’’ అని ఉన్నమాట పలికారు. ‘కైస్తవ మత బోధకులను లక్ష్యపెట్టక విమర్శించుటచే బడిపంతులు ఉద్యోగమూడిపోయినది. అప్పుడాయన భార్యతో ఇద్దరు పిల్లలతో పొట్ట చేతపట్టుకొని ఊళ్ల వెంట తిరుగవలసి వచ్చినది’-ఇటువంటి సత్యాలను కొందరు అణచివేస్తారు. కందుకూరి వీరేశలింగం గారిని దర్శించినప్పుడు కమ్మని పద్యాలు వినిపించమన్నారు. అప్పుడు జాషువాగారు తాము రాస్తున్న ‘రుక్మిణీ కల్యాణము’నుంచి కొన్ని పద్యాలు చదవగానే కందుకూరి పద్య ప్రశంస చేసారు. వేదాంత రహస్యం గల ఒక పద్యమిది
‘‘ఎఱిగి యుందువు సర్వంబు నెఱిగియుండి
యెఱుగనట్లుండి యెఱుగని నరుని చేత
నెఱుక పరపించు కొందువే యెఱుక జేయ
నెంత దానను కడకింత నేలు మనము’’
-రుక్మిణి అగ్నిద్యోతనునిచే కృష్ణుడికి పంపిన సందేశంలోనిదీ పద్యం.
కర్ణుని గురించి జాషువా రాసిన ‘్భరత వీరుడు’ పద్యాలు ’్భరతికి’ పంపగా సంపాదకులైన నాగేశ్వరరావు పంతులుగారు ప్రచురించి 27 రూపాయలు పారితోషికంగా పంపారట. డబ్బులు లేని ఆ రోజుల్లో ఇది ఎక్కువగా భావించి జాషువా సంతోషించారు.
ఏకా ఆంజనేయులు సాహితీ పోషకులు జాషువాకు కనకాభిషేకం చేసారు. ఒక ఇల్లు, కొంత భూమి ఇచ్చారు. ఒకరోజు ఏకావారు జాషువాతో నా పేరెక్కడా రాకుండా నాపై పద్యం చెప్పమన్నారట. వెంటనే జాషువా ‘ఏకాలమ్మున భాస్కరుండుదయయై ఈ నేల పాలించెనో...’ అని మొదలెట్టగానే అందరూ సెభాష్ అని మెచ్చుకున్నారు. ఇటువంటి సంగతులు బయటపెట్టినప్పుడు జాషువాపై మరింత అనురాగం, అతని ప్రతిభపై మరింత ఆసక్తి వెల్లడి అవుతుంది.
‘‘కవియన్న కోనుకిస్కాగాడు పొమ్మంచు
పెను నిరాదరణ జూపించువారు
కళలన్న నంకమ్మ కళ మొగంబున దోప
మనకెందుకని తప్పుకొనెడువారు
అంటూ తమ అభిప్రాయం చెప్తూనే ‘సత్కళలూరూర వీధి వీధి తాండవించుగాక!’ అని ఉన్నత ఆకాంక్ష వెలిబుచ్చారు.
ఈ పుస్తకం చివర 1968 ఏప్రిల్ 24న జాషువా రాసిన వీలునామా ప్రతిని ప్రకటించారు. ‘మన జాషువా’ పుస్తకం ద్వారా వయోవృద్ధులైనా కొన్ని సత్యాలు వెల్లడించి జాషువాను మహా కవిగా మనముందు నిలిపారు. కాకపోతే గ్రాంథిక భాషలో రాసి మరో జయంతి రామయ్య పంతులు అనిపించుకున్నారు.

-ద్వా.నా.శాస్ర్తీ