జాతీయ వార్తలు

ఆజాంఖాన్‌కు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో కోర్టుకు హాజరుకాని సమాజ్‌వాద్ పార్టీ సీనియర్ నేత, ఎస్పీ ఎంపీ ఆజాంఖాన్‌పై నాన్‌బెయిల్ బుల్ వారెంట్ జారీ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 4న సమయం మించిపోయినప్పటికీ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, అజాంఖాన్ రోడ్‌ షో నిర్వహించి కేసులో రాంపూర్ కోర్టు వీరిరువురికీ వారెంట్లు జారీ చేసింది. అఖిలేశ్ యాదవ్‌కి బెయిల్ మంజూరు కాగా.. అజాంఖాన్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆయనకు వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.