అక్షర

మరణ మగ్గంపై చేనేత కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడుగు పేకల
బరువు బతుకులు
తడ్క యాదగిరి,
వెల: రు.200/-
పేజీలు: 88
సంఘమిత్ర పబ్లికేషన్స్,
హైదరాబాద్.
ప్రతులకు: 9348009227
***
లక్షలాది ప్రజలకు జీవనాధారమైన చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చేతి మగ్గాన్ని నమ్ముకుని బ్రతుకులీడుస్తున్న నేత కార్మికులు పనిలేక పస్తులుంటూ ఆకలి చావులకు, ఆత్మహత్యలకు చేరువవుతున్నారు. ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న నూలు, రంగులు, రసాయనాల ధరలు మరోవైపు కనీస వేతనాలకు సైతం నోచుకోకపోగా రోజురోజుకు పెరుగుతున్న ధరలు చేనేత కార్మికుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రెండు దశాబ్దాల్లో చేనేత కార్మికుల్లో మూడింట ఒకవంతు మంది వృత్తి, ఉపాధి వదులుకున్నారంటే, ఆ మేరకు మగ్గాలు అంతరించిపోయాయనే చెప్పాలి. చేనేత వృత్తిని ఆశ్రయించుకున్న వారిలో దాదాపు 75 శాతం మంది కటిక దరిద్రంలో మగ్గుతున్నారంటే ఈ రంగం ఎంతగా సంక్షోభిస్తోందో విదితమవుతున్నది.
చేనేత చిక్కుముడి విప్పడానికి ప్రభుత్వ యంత్రాంగంపరంగా జరిగే ఉద్దీపన, ఉపశమన చర్యలు సమీకృతంగా, సమగ్రంగా లేవన్నవి రచయిత విశే్లషణలో తేటతెల్లమైన వాస్తవం. వృత్తిలోనే కొనసాగుతున్నవారి నైపుణ్యం పెంచడం, వారి ఉపాధి యత్నాలకు ఊతమివ్వడం, నాజుకైన నాణ్యమైన కళాత్మకమైన ఉత్పదనలను ప్రోత్సహించడం, ముతకబట్ట తయారీలో లీనమై ఉండదల్చిన వారిని ఉపాధి హామీ పరిధిలోకి తీసుకురావడం, జౌళి, చేనేత శాఖలను శాస్ర్తియంగా ప్రక్షాళన చేయడం వంటి గుణాత్మక, నిర్మాణాత్మక అవసరాలు అలాగే వున్నాయి.
ఈ దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను, ఉద్దీపన ప్యాకేజీల గురించి వివరిస్తూ తడ్క యాదగిరి రాసిన వ్యాసాలివి.

-కె.