అక్షర

అపహాస్యం అభ్యుదయం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనే్నటి సూరి
రచనలు
మూడవ సంపుటం
వెల: రూ.150/-
ప్రతులకు: నవ చేతన బుక్‌హౌస్
హైదరాబాద్ - వారి అన్ని బ్రాంచీలు
ప్రజాశక్తి బుక్‌హౌస్
వారి అన్ని బ్రాంచీలు
**
కొంతమందివి కొన్ని మాటలు అర్థం లేనివే అయినా - అబ్బుర పరుస్తాయి. అవేమైనా అపశబ్దాలా అంటే కాదు. వాక్య నిర్మాణ దోషమా అంటే అదీ కాదు. పైగా మేధావి వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తులుగా చెలామణి అవుతుంటారు. మరి వారికిదేమి ఆత్మస్తుతి? కాదు. అదొక శైలి. ప్రకర్షము. పాఠక ప్రారబ్ధము. ఈ భూ ప్రపంచంలో ఏ తండ్రీ ఏ కూతురుకు ఇవ్వనంత స్వేచ్ఛనిచ్చి బ్రతుకంతా బండలు చేసుకున్నట్లు అర్థం వచ్చే వాక్య ఫణితిలో అంకిత కృతజ్ఞతలు కనిపించాలి. ఇది ఏమి తెలివో - ఏ తరహా అభ్యుదయమో - ఏ స్వేచ్ఛావాదమో; ఇప్పుడీ పుస్తకంలోనూ అంతే. ‘పత్రికలలో మానవత’ అనే మకుటం క్రింద జి.కృష్ణగారి ఒకప్పటి వ్యాసంలో (పే.9) ఈ వాక్యం చూడండి. ‘బాగా బతికే అవకాశం లేకపోయినా బాగా చనిపోవచ్చు’. మరో పేజీలో మరో వాక్యం ‘నమ్మిన సిద్ధాంతాల కోసం ఆశయాల కోసం జీవితాన్ని ముళ్ళదారి చేసుకున్న సుప్రసిద్ధ అభ్యుదయవాది’ (పే.14) తర్కించడానికి బోలెడంత వ్యవధానమున్న అంశమూల వాక్యాలివి. ఇటువంటి వాటిని ‘పోరచి’ మాటలంటారు. లేదా విరూపహేవాక మంటారు. ఇదో రకం చాపల్యం. చాపల్యమని ఎందుకనవలసి వచ్చిందంటే ‘చెడు వారికి చాపల్యాల ప్రసక్తే లేదు. చెడువారే చపలురు’ (పే.7) అని ఆ జి.కృష్ణగారే చెప్పారు. ఈ చపలత్వం ఎవరికంట గట్టాలో తెలియదు. ‘తెనే్నటి సూరి రచనలు’ మూడవ సంపుటం ప్రస్తుత సమీక్షా గ్రంథం. ఇందులో మూడు భాగాలు కొత్త మనుషులు; విచిత్రాభాస; గ్రంథ సమీక్షలు వున్నాయి. ‘కొత్త మనుషులు’ భాగంలో ఇరవై మూడు లఘు వ్యాసాలు, ‘విచిత్రాభాస’లో పది వాక్యత్రాలు గ్రంథ సమీక్షలుగా ఓ నలభై సమీక్షలు వున్నాయి. రాజకీయాలను అపహాస్యం చేస్తూ కొత్త మనుషుల చేత వెకిలి పనులు కూడా చేయిస్తాడీ రచయిత. ఈ వాక్యం చూడండి. ‘దిగు గుర్రం అనగానే బెజవాడ చైర్మన్ తెనే్నటి చలపతిరావు గారికి కమ్యూనిస్టుల పట్ల ఒల్లమాలిన ప్రణయం పుట్టుకొచ్చి ఎ.కె.గోపాలన్ గారిని కావలించుకొని రతి పారవశ్యంలో ఆనంద బాష్పాలు రాల్చి సన్మానించాడు.’ (పే.116) ‘సర్వాంధ్ర సాహితీపరుల సమావేశంలో (పే.52), సాహితీపరుల సమావేశంకన్నా సూరిగారి వెకిలి హాస్యమే కనిపిస్తుంది. సూరి ప్రతి రచన వ్యంగ్య హాస్యంతో వెగటు పుట్టిస్తుంది. అదేమో దానినే అలంకారంగా భావిస్తాడాయన. శబ్ద దోషాలున్నాయి. అవి అచ్చుతప్పులనుకొని పాఠకులు సహృదయామోదంతో సమాధానపడితే తప్ప రచయితను శంకించవలసి వస్తుంది. అభ్యుదయవాదికి - ప్రగతిశీలునికి - ఏ పిరికితనం పనికిరాదో ఆ పిరికితనమే ఒక చిన్న కథ వంటి వాక్యత్రానికి ముగింపు (పే.103) మొత్తం మీద ‘చెంఘీజ్‌ఖాన్’ వ్రాసి పేరు తెచ్చుకున్న తెనే్నటి సూర్యప్రకాశరావుగారి ఈ సంపుటం ఆశించినంత హృద్యంగా లేదు. సమీక్షలను తిరిగి సమీక్షించనక్కరలేదు.

-సాంధ్యశ్రీ