అక్షర

ఈ అక్షరాల్లో ప్రాణం ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుర్చీ’
కవిత్వం
-వనపట్ల సుబ్బయ్య
వెల: రూ.100/-
ప్రతులకు: భార్గవి హేర్ స్టైల్స్
నాగర్‌కర్నూలు- 509 209
9492765358
**
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించిన కవులలో వనపట్ల సుబ్బయ్య ఒకరు. ‘వొల్లెడ’ ‘మశాల్’ ‘ఊర చెరువు’ వంటి దీర్ఘ కావ్యాలతో సాటి కవులలో కూడా చైతన్యాన్ని రగిలించారు.
ఎందరో కవులు ఎంతో కవిత్వం రాసి రాశి పోసినా, సుబ్బయ్య ప్రత్యేకత సుబ్బయ్యదే. తంగెడు పువ్వును ‘యుద్ధంలో గెలిచిన పువ్వు’గా నిర్వచిస్తారు. పువ్వు లాంటి సంస్కారం వున్నవాడు ఎందుకు ఆయుధంగా మారవలసి వచ్చిందో చెప్తారు. ‘దండకడియం’ అంటూ ఆళ్వారుస్వామి మీద రాసిన కవితను వైతాళిక గీతం అనవచ్చు. ‘రాచరికానికెదురుగా/ గ్రంథాలయమై నిలబడ్డాడు’ అన్న రెండు పాదాల్లో నిజాంకు వ్యితిరేకంగా ఆళ్వారు చేసిన పోరాటాన్ని చెప్పి, వేల ప్రశ్నలకు లక్షల జవాబులిచ్చే పుస్తకాల వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటాన్ని కూడా అనితర సాధ్యంగా చెప్తారు సుబ్బయ్య. దేశోద్ధారక గ్రంథమాలతోపాటు, సొంత గ్రంథాలయాన్ని ఆళ్వారు స్థాపించిన సమాచారాన్ని కూడా ప్రకటించారు.
ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వెనుకబడిన వర్గానికి చెందిన కవికి నిన్నటిదాకా తెలంగాణనే లక్ష్యం. తెలంగాణ సాధన తర్వాత మరో లక్ష్యం ఏర్పడిందంటున్నారు సుబ్బయ్య - ‘రేపటి బహుజన రాజ్యాధికారానికి/ బహుజన బోనం వండే’ మాతలు కావాలంటున్నారు. దీనే్న ‘రేపటి గోల్కొండ ఖిల్లా మీద/ బోనం బహుజనులదే’ అంటూ జెండ ఎగరేస్తున్నారు.’
సాధారణంగా సుబ్బయ్య సంస్కృతం వైపు పోరు. ‘మోదుగు పూలు’ అన్న శీర్షిక పెట్టవలసిన చోట ‘కింశుక పుష్పాలు’ అనటం ఆశ్చర్యమే. బహుశా ఆ పువ్వుకున్న శక్తి అది. ప్రజాదృష్టి లేని కవికి వర్ణన వర్ణనే. కాని, ‘తోవ పొడువూ/ అమరుల స్తూపాల్లా అగ్నిపూలు’ అని అనగలగటంలోని ప్రజా దృష్టి, రక్తతర్పణం చేసిన త్యాగమూర్తుల పట్ల వుండే అభిమానం నుంచి, ఆరాధన నుంచి పుట్టుకొచ్చింది.
విశాల అర్థంలో సుబ్బయ్య సబ్బండ వర్గాల బలమైన ప్రతినిధి. ‘పగిలిన డప్పుకు పాణమొచ్చింది/ నీ అలికిడి విని సిలుకొయ్యకే సిలువైన/ ఏడు మెట్ల కినె్నర ఏక్‌తారలు దిగ్గున మెరిసినవి’ అంటూ సబ్బండ వర్గాల ప్రతీకలు ఉద్యమ కాలంలో మానవీకరణ పొందటం చూడొచ్చు. సుబ్బయ్య తన కవితల్లో వృత్తి మాండలిక పదాల చేర్పుతో, కొత్త పద బంధాల కూర్పుతో సమకాలీన కవీత్వాన్ని బలోపేతం చేస్తున్నారు.
ఒక సీమాంధ్ర సినీ ప్రముఖుడు - ‘అధికారమంటే మంగలి షాపు కుర్చీ కాద’ని ప్రకటించాడట. అందుకు నిరసనగా- ‘మేస్ర్తి! నీది నాలుగు పడగల హైందవ కుర్చీ/... నా కుర్చీ పేదవాడి చర్చ’ అని జవాబిచ్చారు సుబ్బయ్య. మంగలి షాపు కుర్చీ సమానత్వానికి, సేవాభావానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇది కొత్త భావావిష్కరణ!

-అమ్మంగి