అక్షర

వ్యక్తిత్వ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.బి.ఆర్.అంబేద్కర్, బెర్ర్నాండ్ రసెల్,
విలియం వర్డ్స్ వర్త్,
రచన: కత్తి పద్మారావు,
పేజీలు: 256+
వెల: 200/400/-
లోకాయత ప్రచురణలు,
అంబేద్కర్‌కాలనీ, పొన్నూరు- 522124, గుంటూరు జిల్లా. ఫోన్: 9849741695
**
ఈ పుస్తకం కవరు మీద పేరుమీద, చిన్న అక్షరాలలో ప్రపంచ విజేతలు: వ్యక్తిత్వ నిర్మాణం: 2 అని ఒక సీరీస్ శీర్షిక ఉంది. అంటే వ్యక్తిత్వ నిర్మాణం గురించి రచయిత ఇంతకుముందే ఒక పుస్తకం రాశారని, ఇది రెండవదని అర్థం అవుతుంది. నా మాటలో ఆయన ఆ విషయంతోనే మొదలుపెట్టి పుస్తకం గురించి చక్కగా వివరించారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి!’అని చెప్పడం అర్థంలేనిది అన్నారు అక్కడే. అందుకే తమ జీవితం మీద అంతులేని ప్రభావం చూపిన ముగ్గురు మహనీయుల గురించి రాసి, వారి ఆదర్శాలను పాఠకులకు పరిచయంచేసే ప్రయత్నం చేశారు.
నాయకత్వ లక్షణాలతో చర్చ మొదలయ్యింది. 80 పేజీలకు పైగా అంబేద్కర్ భావజాలం, జీవితాల గురించిన చర్చ ఆసక్తికరంగా సాగింది. మొదట్లో సంస్కృతం (్భర్తృహరి)నుంచి చేసిన ప్రస్తావనలు బాగున్నాయి. ప్రతి రెండు పేజీలలోనూ ప్రధానంగా గుర్తుంచుకొనవలసిన అంశాలను బాక్స్‌కట్టి చదువరులకు మరింత సాయంచేశారు ఈ పుస్తకంలో. సామాజిక దుఃఖం మనిషిని విప్లవకారునిగా, సామాజిక పరివర్తకునిగా మారుస్తుంది అన్న ఒక్కమాట చాలు. ఈ రచయిత ఉద్యమకారునిగా మారడానికిగల కారణాలు ఆ మాటతో చెప్పకుండానే అర్థంఅయ్యాయి.
ఒక 50 పేజీల పాటు బెర్ర్నాండ్ రసెల్ జీవితం, రచన, భావాల గురించిన చర్చ సాగింది రసెల్ తత్వశాస్త్రంతో సైన్సును సమన్వయించి ఎన్నో విజయాలు సాధించాడు. ఆయన హేతువాదం, నాస్తికతలు ఈ రచయిత ఎత్తిచూపారు.
ఇక చివరి భాగం చిత్రంగా ప్రకృతి ఆరాధకుడయిన కవి వర్డ్స్‌వర్త్ గురించి. (అట్టమీద సరిగానే ఉన్న కవి పేరు పుస్తకం లోపల వార్డ్స్‌వర్త్ అని దీర్ఘమయింది. ఎందుకో?) ప్రకృతిని లోతుగా పరిశీలించడం ఈ కవి లక్షణం. ఆయన కవిత్వంలో ప్రకృతి, ఆత్మగౌరవం, స్నేహం, సున్నితత్వం కలగలిసిన తీరు మనముందుకు వస్తుంది. ప్రకృతినుంచి మానసిక శక్తిని పొందాలని కవి ద్వారా మనకు సందేశం అందుతుంది. ఇంగ్లీషునుంచి విస్తారంగా ఇచ్చిన రెఫరెన్స్‌ల అర్థం తెలుగులోనూ వివరిస్తే మరింత బాగుండేదేమో?
ఈ పుస్తకాన్ని మిగతా వ్యక్తిత్వ వికాసం, డూ ఇట్ యువర్ సెల్ఫ్‌గైడ్‌ల లాగ సులభంగా చదవడం కుదరదు. చదివిన ప్రతి పేజీలోని అంశాలను మనసుకు ఎక్కించుకుని ఆలోచించగలగాలి. అప్పుడు అసలు ప్రయోజనం కలుగుతుంది!

-కె.బి.గోపాలం