అక్షర

విద్యార్థులకు చేరువగా ‘వాగ్గేయకారులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ వాగ్గేయకారులు;
రచన: డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు;
104 పుటలు;
వెల: 100 రూపాయలు;
ప్రతులకు:
అమరావతీ పబ్లికేషన్స్,
సాయిబాబారోడ్,
గుంటూరు- 522 007

తిరుమల తిరుపతి
దేవస్థానం ఇటీవల బాల సాహిత్యాన్ని ధార్మిక
పద్ధతుల్లో అరటి పండు వొలిచి పెట్టినట్లు ఎలా ఇవ్వాలి అని చక్కని చర్చలు
సాగించింది. ప్రయోజనకర మార్గంలో పయనించి
రచియింపజేయాలని చూస్తోంది.

మంచి తరాన్ని రూపకల్పన చేయడంలో విద్యార్థులకు చెందిన సాహిత్య రచనలు మంచి పాత్ర వహిస్తాయి. వారి భాషాస్థాయిని, ఆలోచనల తీరులను గుర్తించి వారిని స్ఫూర్తినిచ్చేలా రాసిన మంచి పొత్తం, రుూ ప్రముఖ వాగ్గేయకారులు.
రచయిత డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు చేయి తిరిగిన రచయిత. ఒక్కొక్కరి గురించే పెద్ద గ్రంథం రాయదగిన వస్తు విస్తృతివున్న ఉన్నత జీవిత చరిత్రల వాగ్గేయకారుల గురించి- తక్కువ తక్కువ పుటల్లో ప్రధానాంశాలను ఎక్కువ ఆసక్తికరంగా రాశారు.
వ్రాసి స్వరపరచి పాడే వాగ్గేయకారులు చేసిన సాంస్కృతిక సేవలు తరచి గ్రహించవలసినవి. సంస్కృత వాగ్గేయకారులు జయదేవుడు, లీలా శుకుడు వంటి వారి గురించి, తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, పురందరదాసు, సారంగపాణి వంటివారి గురించి, కొత్తగా తెలుసుకోదగిన పచ్చి మిరియం ఆది అస్పయ్య, పల్లవి గోపాలయ్య వంటి వారి గురించి, ఆధునిక వాగ్గేయకారులైన దాసుశ్రీరాములు, ఆదిభట్ల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పినాకపాణి, అన్నవరపు, ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ వంటివారి గురించి ఉదాత్త చరిత్రాంశాల్ని గుర్తించి వారి మధ్యమధ్యలో రచనను కేంద్రీకరించిన విద్యార్థులారా అంటూ వారిని పలకరిస్తూ హృదయాలను స్పృశించేలా చక్కగా రాశారు భూసురపల్లివారు.
ప్రాణభూతాలైన ప్రఖ్యాతి చెందిన వారి వారి అమృతతుల్యాలైన పాటలు ఎంతవరకివ్వాలో అంతవరకూ ఇవ్వడంవలన వాని తీయందనాలు అందచందాలు పసి మనస్సులకు అందించడంలో కృతకృత్యులయ్యారు రచయిత.
కేవలం పాఠ్యగ్రంథాల బరువు బాధ్యతలను మోస్తున్న బాలబాలికలను విద్యార్థులను చూస్తుంటే మన సంస్కృతి సంప్రదాయాలను గొప్ప గొప్ప చరిత్రలను వీరికి మనం అందించగలమా అని బెంగ కలుగుతూ వుంటుంది.
ఏ శలవురోజుల్లోనో నెమ్మది నెమ్మదిగా ఇటువంటి పొత్తాలను వారి చిత్తాలకు చేర్చాలి. వాగ్గేయకారుల జీవన పరిమళాలు, సంగీత సాహిత్యాల పట్ల దైవభక్తిపట్ల వారి తాదాత్మ్య లక్షణాలు లక్షణంగా తెలిపే సరల సుబోధక గ్రంథమిది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల బాల సాహిత్యాన్ని ధార్మిక పద్ధతుల్లో అరటి పండు వొలిచి పెట్టినట్లు ఎలా ఇవ్వాలి అని చక్కని చర్చలు సాగించింది. ప్రయోజనకర మార్గంలో పయనించి రచియింపజేయాలని చూస్తోంది. ఈ పుస్తక రచయితల వంటి వారిని ప్రోత్సహించడం మంచిదనిపిస్తుంది. విద్యార్థులూ పెద్దలూ అందరూ చదవతగ్గ గ్రంథం. ముఖ్యంగా దీనివల్ల ప్రముఖ వాగ్గేయకారులు విద్యార్థుల దగ్గరకొచ్చారు.

-సన్నిధానం నరసింహశర్మ