అక్షర

భాషా ప్రేమికులకు దారిచూపే చంద్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభక్తి చంద్రిక
రచన: శ్రీకార్మంచి
సుబ్బరాయలునాయఁడు
వెల: రూ.50- లు
ప్రతులకు
డా॥ వుయ్యూరు
లక్ష్మీనరసింహారావు
ఇంటి నెం. జి-2, గార్డెన్ టవర్స్,
ఎస్.టి.ఆర్. స్టేడియమ్ ఎదురు,
చంద్రవౌళి నగర్,
గుంటూరు - 522007
చరవాణి- 9573884352
తియ్యని తెలుగు భాష లోని తియ్యందనానికి మురిసి ఎందరో ఇతర దేశస్థులు కూడా తెలుగునేలకు వచ్చి తెలుగుభాషను నేర్చుకున్నారు.. తెలుగుభాషలో తెలుగు పదాలల్లో ఒదిగిపోయిన ఇతర భాషలన్నింటికన్నా సంస్కృతం మిన్న. తెలుగు మాట్లాడేటపుడు వ్రాసేటప్పుడు సైతం సంస్కృత పదాలను తెలుగు వారు తెలుగుపదాలే అన్నంత సులభంగా వాడేస్తుంటారు. తెలుగు సంస్కృత భాషలు రెండూ పాలు నీళ్లలా కలిసిపోయిన సందర్భాలు మనకు అనేకం కనిపిస్తుంటాయి. తెలుగు భాషాప్రియులు అన్య భాషలను వేరుచేసి తెలుగును వృద్ధి చేయాలనుకొనేవారు సైతం అక్కడక్కడా సంస్కృత పదాలను ఉటంకిస్తునే ఉన్నారంటే సంస్కృత భాష తెలుగులో ఎంత కలగలసిపోయిందో అర్థమవుతుంది. అట్లాంటి సంస్కృతమే అయినా ఆ భాష మీద పట్టు నేటి జనంలో తక్కువనే చెప్పాలి.
నేటి విద్యార్థులు వారి చదువుసంధ్యల్లో సంస్కృతభాషాధ్యయనం ఉన్నా అది కేవలం మార్కుల సంపాదనకే ఎక్కువగా వినియోగం అవుతున్నది. దీన్ని చూచిన సంస్కృత పండితులు సంస్కృత భాషా ప్రియులు ఎన్నోసార్లు వారి ఆవేదననువెలిబుచ్చినా నేటి విద్యార్థులలో పెద్దమార్పు ఏమీ రాలేదు.
అట్లాంటి నేపథ్యం ఉన్న నేటి దినాల్లో శ్రీ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు కార్మంచి సుబ్బరాయలు నాయఁడు రచించిన ఈ విభక్తి చంద్రిక అనే పుస్తక ముద్రణకుసిద్ధ పడడం ముదావహం.
లక్ష్మీనరసింహారావుగారు జీవితంలో ఆటుపోట్లకుగురై ఎన్నో వెతలను వేదనలను అనుభవించారని అయినా సరే శారదాపుత్రులు వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు అని ‘‘అరణ్య అజ్ఞాత వాసాలు ముగిసినవి’’ అన్న ముందుమాటలో ఇప్పగుంట సాయిబాబాగారు చెప్పిన విషయాలు పాఠకులను కంట తడిపెట్టిస్తాయి కాని వారి పాండీతీ గరిమను చూచి మనసున దివ్యజ్యోతులను వెలిగించి వారికి చేతులను జోడించేలా చేస్తాయి. అంతేకాక రెండుసార్లు డాక్టరేటు పట్టా పొంది సంస్కృత బోధనాచాతురి గల వుయ్యూరు లక్షీనరసింహారావు గారు ఈ గ్రంథ ముద్రణ చేసి ఎందరికో మార్గదర్శి అయినారు.
నేటి చదువులు కేవలం మార్కుల సంపాదన కే ఎక్కువ భాగం వెచ్చించినా ఆ మార్కుల సాధనకోసం కంఠోపాఠం గా కాక వ్యాకరణాన్ని ఇంచుక మనసువెట్టి అర్థం చేసుకొంటే ఆ మార్కుల సాధనలోకూడా మరో మెట్టు ఎక్కవచ్చు ననే అభిప్రాయం ఈ ‘‘విభక్తిచంద్రిక’’ చదివిన చదువరులకు తెలుస్తుంది.
అటు మార్కుల సాధన కోసం శ్రమించే విద్యార్థులకే కాక ఇటు ఆధ్యాత్మికంగానో, ఉత్సాహంతోనో లేక భాషామీద మక్కువతోనే గ్రంథాలను చదివే వారికి కూడా ఈ విభక్తి చంద్రిక అను పుస్తకరాజం ఎంతో తోడ్పడుతుంది. సంస్కృతశబ్దాలు వాటిని ఉపయోగించాల్సిన విధానాల్లాంటి ఎన్నో విషయాలు విశిదంగా చెప్పే ఈ పుస్తకం చిన్నదైనా ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇలాంటి పుస్తకాలను భాషాప్రియులు కాని వారిని సైతం ఆకర్షించే అక్షరమైత్రి ఉన్న ఈ పుస్తకం సులభశైలిలో చదవగానే అర్థమయ్యేట్లు గా ఉంది. శ్రీ కార్మంచి సుబ్బరాయలు నాయఁడు గారు రచించిన ఈ పుస్తకాల్లాంటి మరెన్నో పుస్తకాలను ముద్రణలో చూడాలనుకొంటున్న శ్రీ లక్ష్మీ నరసింహారావుగారి ఆశలు అన్నీ నిజమవ్వాలని తద్ద్వారా భాషాప్రియులకు మంచి విందు దొరుకుతుందని ఆశిద్దాం.

-రాయసం లక్ష్మి