అక్షర

అలనాటి కథానికలు.. మళ్లీ అలరించేందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి కథానికలు..
మళ్లీ అలరించేందుకు
తప్పక చదవాల్సిన
వంద కథానికలు
-వేదగిరి రాంబాబు
వెల: రూ.250
ప్రతులకు: శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్
హెచ్‌ఐజి-ని, ఱ్యషరీని
యఆ యో.10
బషీర్‌బాగ్,
హైదరాబాద్-44

వేలాదిగా వెలువడిన తెలుగు కథానికల్లో నుంచీ తప్పక చదవాల్సిన వంద కధానికల్ని ఎన్నుకుని ఈ నాటి చదువరులకి పరిచయం చేయడం కష్టమైన పని. సాహిత్యపరంగా ప్రయోజనాత్మకమైన బృహత్ కార్యక్రమాన్ని, ప్రయోగాత్మకమైన విభిన్న రచనలని చేయడానికి ఎప్పటికప్పుడు ఇష్టపడే డాక్టర్ వేదగిరి రాంబాబు ఈ వంద కధానికల్ని ఒక పత్రికలో ధారావాహిక శీర్షిక కింద వారం వారం పరామర్శించారు. గురజాడ వందోవర్ధంతికి నివాళిగా ఈ పుస్తక రూపంలో వెలువరించారు. ఈ పరిచయాలకి మరో విశేషమూ వుంది. అది పాఠకుల ఆదరణని విశేషంగా పొందిన ఆ శీర్షికని ఆపేటప్పుడు ఆ పత్రిక ఏకంగా ఒక సంపాదకీయానే్న రాయడం! ఆ పత్రికా సంపాదకుడు పులిపాక సత్యమూర్తిగారి ముందు మాట కూడా ఈ పుస్తకంలో ఉంది.
ఈ కథానికా పరిచయాలు తెలుగు వారి సాంఘిక జీవనాన్ని అద్దంలో కొండలా చూపుతున్నా యి. ఆనాటి మనుషుల స్వభావ స్వరూపాల్నీ, స్థితిగతుల్నీ అవగాహన చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. ఉదాహరణకి శ్రీపాదవారి ‘అరికాళ్ల కింది మంటలు’, పి.వి.నరసింహారావుగారి ‘గొల్లరామవ్వ’, మల్లాదివారి ‘మంత్రపుష్పం’, కాళోజీగారి ‘ప్రేమ తెలిసి ద్వేషము’, కనపర్తి వరలక్ష్మమ్మగారి ‘కుటీర లక్ష్మి’, కొనకళ్లవారి ‘సంఘర్షణ’, కొ.కు ‘అక్కయ్యపెళ్లి’ తిలక్ ‘ఊరి చివరి ఇల్లు’, పురాణం ‘నదీ‘, బుచ్చిబాబు ‘కాగితం ముక్కలు-గాజుపెంకులు’ వంటివి- ఎనె్నన్నో- కథానికా పాఠకులకు సుపరిచితాలే. అయితే వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం, తద్వారా ఆనాటి సమాజపు హోరుని, మనుషుల తత్త్వాన్నీ తలపునకు తెచ్చుకోవడం-ఒక మాధుర్య భావనే. అలాగే, కొంతమంది రచయితలూ, వారి కథానికలు-అంతగా పాఠకులకు తెలియదు. ఉదాహరణకు-అంబడిపూడి వేంకటరత్నం ‘ప్రభువు’, అట్లూరి పిచ్చేశ్వరరావు ‘నెత్తురు కథ’, కె.వి.సుబ్బయ్య ‘ఆత్మసాక్షి’, కృష్ణశాస్ర్తీ ‘బూట్ పాలిష్’, బందావారి ‘పందిరి కింద’, సామవేదం జానకిరామశర్మ ‘నటుడు’, వైసివిరెడ్డి ‘దొంగబర్రెగొడ్లు’, శ్రీరాగి ‘కేసు‘వంటి కధానికలు తెలుగు సాహితికి అమూల్యాభరణాలు. వాటిలోని ఇతివృత్తాలు ఆయా రచయితల దార్శినికతకి నిదర్శనం నిలుస్తాయి. కారణం-వారంతా ఆనాటి సమాజపు పోకడల్ని గమనిస్తూనే రానున్న ధోరణుల్ని, కానున్న సంభవాల్నీ పసిగట్టి తమ రచనల్లో ఆవిష్కరించగలిగారు.
ఈ పరిచయాల్లోకి వచ్చిన రెండు కథానికల్ని గురించి ప్రత్యేకించి పేర్కొనాలి. అవి-ఒకటి, మహబూబ్‌మియ్యా సాహెబ్ ‘మీనాక్షి’ కాగా , రెండవది సిఎస్ నీలకంఠయ్యర్ ‘్భగపు మేళములు’. ‘మీనాక్షి‘ కథానికలో కులాధిపత్య ధోరణిని నిరసించడం, మానవీయ విలువల పరిరక్షణలో కులమతాల పట్టింపు అర్ధ రహితమనే విశ్వాస ప్రకటన స్ఫూర్తిదాయకంగా చిత్రించబడినై. చివరికి యువజంటని కులం వెలివేసినా వారు స్థిర చిత్తంతో దాన్ని పట్టించుకోరు. రెండవ కథానిక ‘్భగపు మేళములు’లో వివాహానికి ఆ దురాచారం పాటించడం-కడకు అది పెళ్లికొడుకునే వేశ్యాలోలునిగా చేయడంతో పర్యవసిస్తుంది. ప్రబోధాత్మకమైన కథానిక ఇది. బాగా ఎక్కువగా కథలు చదివేవారికి కూడా-ఇలాంటి విస్తృత కథానికలు లభ్యం కావు. ఆ దృష్ట్యా వాటిలోని గుణ విశేషాల్ని ఈ పరిచయాల ద్వారా తెలుసుకోవడం సంతోషదాయకమే!
అటుకొన్ని ప్రసిద్ధ రచనల పునశ్చరణ, ఇటు కొన్ని మరుగున పడిన కథానికల్ని ఎరుక పరచడం-అనే రెండు సాహిత్యావసరాల్ని తీరుస్తున్నది ఈ పుస్తకం.

-విహారి