అక్షర

ఆసక్తిని రేకెత్తించే పద్యరచనా పద్ధతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యం వ్రాయడం ఎలా?
-బులుసు వేంకటేశ్వర్లు
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
ఇఎస్‌ఐ ఆస్పత్రివద్ద
ఆదర్శనగర్, చిట్టివలస
విశాఖ జిల్లా.
**
పద్యం తెలుగువాడి సొత్తు. ఎనె్నన్ని కవితా రూపాలు వచ్చినా పద్యానికి తిరుగులేదు. ‘పద్యాల నడుముల్ విరగదంతాను’ అన్న వారి పట్ల మనం జాలి చూపించాలి. జాషువా, త్రిపురనేని, శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవులూ పద్యం ద్వారా ప్రసిద్ధులయ్యారు. ఇప్పటికీ పద్య కవులు చాలామంది ఉన్నారు. పత్రికలు ప్రోత్సహిస్తే పద్యం మరింత ప్రాచుర్యం పొందుతుంది. ఇటువంటి పద్య రచన గురించి బులుసు వేంకటేశ్వర్లు రాసిన పుస్తకమిది. ఇది కేవలం ఛందస్సు గురించి రాసింది కాదు. శ్రీశ్రీ ‘కవిజనాశ్రయం’ ద్వారా పద్య రచన నేర్చుకున్నట్టు ఉత్సాహవంతులు, పద్య ప్రియులు బులుసు వారి ఈ పుస్తకాన్ని చదివి, అభ్యాసం చేస్తే పద్యకవి కావచ్చు. పద్య రచన పట్ల ఆసక్తి గలవారికి పెదబాలశిక్ష వంటిది - పద్యం వ్రాయడం ఎలా?
బులుసు వేంకటేశ్వర్లు పద్య రచనలో ఆరితేరిన వారు. పద్యాన్ని వొంటపట్టించుకున్నవారు. అధ్యాపకత్వంతో పరిపూర్ణులు. పద్య రచనపై పుస్తకం రాయడానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నవారు గురువులు, లఘువులతో ప్రారంభించి దండకం వరకు పదహారు భాగాలుగా రచించారు. వీటిలో చాలావరకు విద్యార్థులు పరీక్షల కోసం చదివినవే. అయితే మార్కుల కోసం, పరీక్షల కోసం చదివినవి - అలాగే రాస్తే ఈ పుస్తకం అవసరం ఉండదు. బులుసు వారు ప్రత్యేక పద్ధతిలో పద్య రచనను అలవాటు చేసేదిగా ఉంది. సూచనలున్నాయి. ఉదాహరణలున్నాయి. అంతేకాదు - ఆయా పద్యాలు రాసిన పూర్వకవుల సంక్షిప్త సమాచారమూ ఉంది. ఉదాహరణ ఇచ్చిన పద్యాలన్నీ ప్రసిద్ధమైనవీ, కంఠస్థానికి అనుకూలమైనవి. వచన కవితకు శిక్షణశాలలు మాదిరి బులుసు వారు పద్య శిక్షణశాలలు నిర్వహించారు. ఆ అనుభవం ఈ రచనకు సహకరించింది. పద్య రచనా ప్రియులే కాదు - తెలుగు అధ్యాపకులకు, ప్రాచీన కావ్య పాఠకులకు ఇది కరదీపిక. కాకపోతే ధర ఎక్కువ కావటంతో రచనోద్దేశం పలచబడుతుందేమో!
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-ద్వానా శాస్ర్తీ