అక్షర

మనుషుల నైజానికి దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది-అంతం (నవల)
-చంద్రశేఖర్ ఆజాద్
వెల రూ.150/-
ప్రతులకు: రచయత
ప్లాట్ నెం.909, సఫైర్ బ్లాక్
మై హోమ్ జ్యుయల్
మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్-500049
సెల్: 09246573575
**
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాగా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించిన నవలల పోటీలో, ఈ నవల బహుమతి పొందినదనీ, ఇదొక తాత్విక నవల అనీ రచయిత తెలిపారు.
కథాంశం కొత్తరకంగా ఉంది. ఆర్థికంగానూ, సామాజికం గానూ ఉన్నత స్థితిలో వున్న యువకుడు, చదువు పూర్తికాగానే, జీవితాన్ని గురించి చిత్రమైన ఆలోచనలతో దేశాలు పట్టిపోతాడు. ఆ పర్యటనలో రకరకాల అనుభవాలు కలిగి, చివరకు ఆధ్యాత్మికం వైపు మళ్లుతాడు. అది కూడా నచ్చక ముప్ఫయి సంవత్సరాల తర్వాత అమ్మానాన్నలను వెతుక్కుంటూ రావటంతో నవల మొదలవుతుంది.
తను దేశాటనంలో వున్న ముప్ఫయి సంవత్సరాలలో, ఇంటి దగ్గర జరిగిన విశేషాలను ఒకటొకటిగా తెలుసుకుంటాడు. ఒకదాని తర్వాత మరొకటిగా తన పరిచయస్తుల సంగతులు తెలుసుకుంటాడు. ప్రొఫెసర్ మురారి కథ, ప్రతిభా ఆంటీ కథ, డాక్టర్ చలం స్వంత కథ, ఆదిత్య కథ మొదలైనవి అనేకం నవలలో కనిపిస్తాయి. ఆయా సందర్భాలలో మనుషుల నైజాన్ని గురించి, సామాజిక పరిస్థితుల గురించి పుస్తకంలో చూడవచ్చు.
స్వార్ధ చింతన గల ప్రొఫెసర్ల గురించి చేసిన విమర్శ (పేజి 48), కట్టుబాట్ల పేరుతో స్ర్తిలపట్ల చూపించబడ్తున్న వివక్ష (పేజి 176) వంటివి ఆలోచించతగ్గవి.
నవలలో ‘జాన్’ పాత్రకు తగిన న్యాయం చేసినట్లు లేదు. చూచాయగా అతడి గురించి చెప్పటమే తప్ప, విశేషమేమీ కన్పించదు. ఇటువంటిదే మరో పాత్ర ‘సుధీర్’. ఏ ప్రయోజనం ఆశించి ఇతడి కుటుంబం కథను ప్రవేశపెట్టవలసి వచ్చిందో బోధపడదు.

-ఎం.వి.శాస్ర్తీ