అక్షర

పల్లెవాసుల అంతరంగ మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టిమనిషి
వుప్పల నరసింహం కధలు
రచయిత: వుప్పల నరసింహం
జ్ఞానం పబ్లికేషన్
పేజీలు: 392
వెల: రు.300
మిలీనియమ్ హోమ్
2-3-764/1/4, తులసినగర్ కాలనీ
హైదరాబాద్ 500013
ఫోన్ 9985781799
**
చక్కని అవగాహనతో కొన్ని దశాబ్దాల తరబడి కథలు, సాహిత్య రాజకీయ వ్యాసాలు రాస్తున్న ప్రామాణిక రచయిత వుప్పల నరసింహం. ‘మట్టిమనిషి’ అని కితాబు తగిలించుకున్న ఇతనివి నేలబారు రచనలు కావు. జీవిత వికాసాన్ని, ప్రకాశాన్ని మనసారా కోరుకునే తరహాకు చెందినవి. ఇతని కథలలో గ్రామీణ జీవితం ముఖ్యంగా తెలంగాణ పల్లె ప్రాంతాల వ్యవహార సరళి ప్రస్పుటం అవుతు వుంటుంది. రచయితగా ఇతనికి వున్న నిబద్ధత ఈ కింది వాక్యాలలో స్పష్టం అవుతుంది. ‘దళితుల ఉద్ధరణ, పేద ప్రజల ఉద్ధరణ, ఇలాంటి దౌర్జన్యపు త్రోవలోనే వుందని భావించే వ్యక్తుల శక్తుల మస్తిష్కాలు మారాలి తప్పుదోవ ఎవరు తొక్కినా అది తప్పువైపే తీసుకెడుతుంది గాని ఒప్పువైపు వెళ్లదు. ఈ ఇంగితం విస్మరిస్తే ఎలా? ఈ విచక్షణ జ్ఞానం ఇబ్బడి ముబ్బడిగా పెరిగేలా పనిచేయడమే రచయితల కర్తవ్యం అని నేను విశ్వసిస్తున్నాను’.
ఈ సంకలనలో ‘తిరగబడ్డ భూమి’ మొదలైన కథలు పదహారు తెలంగాణ శిల్పంలో నడుస్తాయి. నగర నేపథ్యంలో నడిచే చిన్న కథలు మరో ఏడున్నాయి. ఉత్తరాంధ్ర కథలు మరో రెండు. దండాసి, నారక్తమే నా రిక్షాకు పెట్రోలు అనే కథలు శ్రామిక శక్తి దుర్వినియోగాన్ని గురించి వివరాలు తెలుపుతాయి.
వౌఖిక కథాజాల ముద్ర పేరుతో వున్న రచనలు లోగడ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సంవత్సరానికి పైగా అచ్చయ్యాయి. ఇవి ధ్వని ప్రధానమైనవి కనక విమర్శకుల దృష్టికి అంతగా రాలేదని రచయిత అభిప్రాయం. తెలుగు భాషలోని అపూర్వమైన పదబంధాలు, నుడికారాలు, జాతిరత్నాలు ఇందులో కనిపిస్తున్నాయని మధురాంతకం రాజారాంగారు ప్రస్తుతించారు. సంకలనాన్ని కూలంకషంగా చూసినపుడు రచయిత హృదయ ఆవేదన, ఆశయ కిరీటాల ధగధగలు, ప్రయోజనకరమైన ప్రయోగాలు చేయాలనే ఆసక్తి తేటతెల్లమవుతుంది.

-శ్రీ