అక్షర

‘దండయాత్ర’తో పండిన హాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగూరి చిట్టెన్‌రాజు చెప్పిన అమెరి‘కలకలం’
కథలూ కమామీషులు
వెల: రూ.50; పుటలు: 190
ప్రతులకు: జె.వి.పబ్లిషర్స్,
నవోదయ బుక్‌హౌస్,
ఇతర పుస్తకాలయాలు
***

నవ రసాలలో ప్రథమంగా పేర్కొనబడేది శృంగారమయితే, దాని వెంటనే వచ్చేది హాస్య రసమే. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోడం ఒక రోగం అన్న నానుడి అన్ని దేశాలకూ వర్తిస్తుంది. భారతదేశాన్ని వదలి నాలుగు దశాబ్దలయినా తెలుగుతనాన్ని వదలని వంగూరి చిట్టెన్‌రాజు కలంనుంచి వెలువడిన ‘‘వంగూరి చిట్టెన్‌రాజు చెప్పిన అమెరి‘కలకలం’ కథలూ కమామీషులు’’ పుస్తకం తెలుగు పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో పంతొమ్మిది శీర్షికలున్నాయి. ఇందులో ఉన్నవి కథలో, వ్యాసాలో, వ్యాస కథలో, కథా వ్యాసాలో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగేలా రచయిత ‘ముందుమాట’ ఉంది.
శిశువు జన్మించిన వెంటనే జాతకం రాయించడం మనకలవాటు. జాతకాలలో రాసినవి జీవితంలో జరుగుతాయా లేదా అన్నది కాలక్రమేణా గాని తెలియదు. మీరు రాసినట్టు జరగలేదేమిటి అని నిలదీయడానికి రాసిన సిద్ధాంతిగారు దొరకడం అంత సులువుకాదు. కొండొకచో వారు కీర్తిశేషులయి ఉండవచ్చు కూడా! జాతకాలు చెప్పేవారికి ఎదురయ్యే ఇబ్బందులని హాస్యరస ప్రధానంగా వర్ణించిన వ్యాసం ‘‘ఎవరి జాతక పిచ్చి’’ వారిది.
ఆసక్తికరమైన శీర్షికలు పెట్టడంలో రచయితది అందెవేసిన చెయ్యి. ‘తెకోకా కరహై’ యాత్రా స్పెషల్-1’ అనే ప్రపంచ తెలుగు మహాసభలు అన్న వ్యాసంలో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంవల్ల కల్గిన ఆవేదన పాఠకులతో పంచుకోడం జరిగింది. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలిసి ఉండాలన్న సత్సంకల్పంతో పెట్టుకున్న ముద్దు పేరు ‘తెకోకాకరా’. తెలంగాణా, కోస్తా, కాకినాడ, కళింగ, మరియు రాయలసీమల హ్రస్వనామమే తెకోకాకరా. ప్రాంతాలతోబాటు కాకినాడ పట్టణం పేరుకూడా కలిపేడంతో రచయిత విద్యార్థిదశ ప్రభావం అనబడుతుంది. మహాసభల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందుల ప్రస్తావన చదివినపుడు చదువరులకు నిర్వాహకుల మీద సానుభూతి పెరుగుతుంది. మొదటిరోజున ఉపన్యాసం ఇవ్వలేదని సభలకే రావడం మానేసిన వక్త ఒక ఉదాహరణ మాత్రమే.
సమైక్యరాష్ట్రం ఉండాలని కోరుకున్నవారికి రాష్ట్ర విభజన మనస్తాపం కలిగించడం సహజం. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కొంపముంచిన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్న వ్యాసంలో రాజకీయవేత్తలు తమ స్వంత రాష్ట్రంలో ఓడిపోతామనుకున్నపుడు దక్షిణాది రాష్ట్రాలు అందునా తెలుగు రాష్ట్రాలనుంచి పోటీచేయడం గురించిన ప్రస్తావన ఉంది. తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. తెలుగువారిని ఒక ఇటాలియన్ విభజించడం విధి విలాసం అనుకోవాలి.
దండయాత్రలు అనగానే సైన్యాలూ యుద్ధాలూ జ్ఞాపకం రావడం సహజం. కాని ‘కోటాదాటిన ఏప్రిల్ నెల’ వ్యాసంలో దండలకోసం ప్రత్యేకమయిన ప్రయత్నం లేకుండానే దండలు కంఠసీమలను అలంకరించడం ప్రస్తావన ఉంది. పూలమాలల సంఖ్య వేదికనలంకరించిన పెద్దల సంఖ్యకన్నా తక్కువయినపుడు ఎలా పరిష్కరించాలన్న ఉపాయం పాఠకులను ఆకట్టుకుంటుంది.
ప్రభుత్వ పథకాలమీద సంధించిన వ్యంగ్యా‘స్త్రాం’ ‘గోచికి సంచీ పథకం’. పేదవారు ఆధార్‌కార్డు చూపగానే కందిపప్పు, ఉప్పు, కారం తదితర నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలియచేస్తుందీ వ్యాసం. అమెరికా నివాసుల పేర్లతో రేషన్‌కార్డు సంపాదించిన డ్రైవరు తెలివితేటలని అభినందించడం చదువరుల వంతు అవుతుంది.
ఈ పుస్తకం ‘అన్నట్టు ఈ కథలో నిజం-3, కల్పన 7 ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చిందో తరువాత చెప్పాను’అన్న వాక్యంతో ముగించబడింది. కల్పన నిజాల విశే్లషణకోసం పాఠకులు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తారనడం అతిశయోక్తికాదు.

-పాలంకి సత్యనారాయణ